Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
స్టేషన్ బయట వీపు వెనుక కర్రలు కత్తులు దాచిపెట్టుకున్న ఒక 20 -25 మంది తెల్లచొక్కాలు వేసుకుని కోపంతో గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నట్లు అందరూ గమనించారు . 

ఒకేసారి అంతపెద్ద మొత్తంలో ట్రాక్టర్లలో దిగేసరికి ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి పెద్దయ్యతోపాటు అందరినీ స్టేషన్ బయటే ఆపేశారు . 



లోపలకు వెళ్లిన మన అన్నయ్య ఎలాగోలా ఆ పిల్లనాయాళ్లను లాక్కొనివస్తారు ఇక్కడే కత్తికి కండగా నరికి మన సర్ బాధను కొద్దిగానైనా తగ్గించాలిరా అని తెల్లచొక్కాలవాళ్ళు మాట్లాడుతోంటే , మేమని తెలియని పెద్దయ్య , అందరూ విని కానిస్టేబుళ్లతో SI గారిని కలవడానికి వచ్చాము అన్నారు . 

ఇంతమంది కలవడానికి వీలుకుదరదు ఏవైరానా ఇద్దరు ముగ్గరు అయితే ok అని బదులివ్వడంతో , 

సరే సర్ అని పెద్దయ్యతోపాటు ముగ్గురు లోపలకు వెళుతోంటే , ఇంతకుముందు లోపలకు వెళ్లిన తెల్లచొక్కావాళ్లను కానిస్టేబుల్స్ బయటకు లాగేస్తున్నారు . 

ఏయ్ SI మమ్మల్నే బయటకు తోసేస్తావా ...........మా సర్ తో పెట్టుకుంటున్నావు ట్రాన్స్ఫర్ అయిపోతావు అని వేలితో బెదిరిస్తూ , ఆ పిల్లలను నువ్వుకాదు కదా ఆ భగవంతుడు కూడా రక్షించలేడు , ఏక్షణమైనా వాళ్ళ అంతుచూస్తాము అని కోపంతో మాట్లాడుతోంటే ,



ఏమి చేసుకుంటావో , ఎవరిని పిలుచుకునివస్తావో పీలుచుకొనిరా ఆ పిల్లలను కోర్ట్ లో సబ్మిట్ చెయ్యడం నా కర్తవ్యం . నా డ్యూటీ నేను నిర్వర్తిస్తున్నాను ఎవ్వడికీ భయపడను అని చల్ రే నీలాంటివాళ్లను నా సర్వీస్ లో చాలామందిని చూసాను అని లోపలికివెళ్లిపోయారు . 

వాడు కోపంతో ఊగిపోయి రేయ్ కాయిన్ బాక్స్ లోనుండి కాల్ చేసి మనవాళ్ళందరినీ రమ్మని చెప్పరా ............. స్టేషన్ కూల్చయినా పిల్లల అంతు చూడాల్సిందే , ఆ న్యూస్ తో కానీ మనం సర్ దగ్గరకు వెళ్లకపోతే మన ప్రాణాలు తీసేస్తారు మన సర్ అనిచెప్పగానే , ఒకడు స్టేషన్ కాంపౌండ్ బయటకువెళ్లి కాయిన్ బాక్స్ నుండి కాల్ చేసి అందరినీ రమ్మని చెప్పాడు . 



కానిస్టేబుల్స్ , హోంగార్డ్స్ ........... అందరూ అలెర్ట్ గా ఉండండి మన ప్రాణాలు ఫణంగా పెట్టైనా పిల్లలను కాపాడాలి , మనం చేయలేని మంచిపనిని చేసి అతని బారి నుండి పడబోయే ఎంతోమందిని రక్షించారు అని చెప్పడంతో ,

Yes సర్ అంటూ లాఠీలు పట్టుకుని రెడీ అయిపోయారు . 

స్టేషన్ బయట తెల్లచొక్కాల వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్లపై కోపంతో ఊగిపోతూ ఆయుధాలను రెడీ చేసుకుంటున్నారు . 

పెద్దయ్యా , అన్నయ్యావాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మాకు ఏమైందోనని కంగారుపడుతోయి లోపలకు వెళ్లి సర్ .............

పెద్దయ్యా ...........అని కృష్ణగాడి పిలుపుకు , 

పెద్దయ్యా మరియు కృష్ణగాడి నాన్నగారు కృష్ణ అంటూ లాకప్ దగ్గరకు పరిగెత్తి బాబు మహేష్ ..........ఎంత కంగారుపడ్డామో తెలుసా ఇంటిలోని శవపు మార్క్ ను చూసి హమ్మయ్యా ........... మీరు కనిపించారు అదిచాలు అని మా బుగ్గలను ప్రాణంలా స్పృశించి , మీరు లాకప్ లో అని కోపంతో లాగెయ్యబోయారు . 



కానిస్టేబుల్స్ పెద్దయ్యా , అంకుల్ వీపుపై రెండు దెబ్బలు వేసి బయటకు లాగెయ్యబోతుంటే , 

సర్ సర్ ............ వాళ్ళు అమాయకులు సర్ , మా ప్రాణం , వాళ్ళు లాకప్ లో ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నాము కావాలంటే మమ్మల్ని వేసి వాళ్ళను వదిలెయ్యండి అని బాధతో చెబుతోంటే , 

SI గారు తన గదిలోనుండి బయటకువచ్చి కానిస్టేబుల్స్ అంటూ ఆపారు . 

సర్ సర్ మా పిల్లలను ఎందుకు లాకప్ లో వేశారు అని అడిగారు . 

రాత్రి ఆ పిల్లలు పెద్ద రాజకీయనాయకుడి బావమరిదిని చంపేశారు అనిచెప్పగానే ,

నలుగురూ షాక్ తో మహేష్ , కృష్ణ .........

అవును పెద్దయ్యా ............ మేమే మాచేతులతో చంపేసాము . 

ష్ ష్ ........... మళ్లీ మీ నోటి నుండి ఆమాట రాకూడదు అని చేతులతో మా నోటిని మూసేసి , సర్ ఆ హత్యను చేసింది ఆ పిల్లలు కాదు నేను అని పెద్దయ్య ,

నేను అని కృష్ణగాడి నాన్నగారు .......

నేను , నేను అని వెనుక ఉన్న అన్నయ్యలు చెప్పడం చూసి , SI గారు ఆశ్చర్యపోతున్నారు . 



పెద్దయ్యా , పెద్దయ్యా ........... అని ఆపకుండా పిలుస్తుంటే ,

మీరు మాప్రాణం మా ప్రాణాలైనా అర్పించి కాపాడుకుంటాము అని మాదగ్గరికి వచ్చారు . 

పెద్దయ్యా .......... ఆ హత్య గురించి మరొక్కమాట మాట్లాడితే మీ బుజ్జి దేవుడినైన నామీద ఒట్టు అని చేతుని తలపై పెట్టుకున్నాను . 

బాబు ........మహేష్ ........ సంవత్సరాలపాటు జైల్లో వేస్తారు ......... మీరు ఉండలేరు నామీద వేసుకుని నేను అంటోంటే , 

మళ్లీ నాచేతిపై చేతినివేసుకున్నాను . అంతే ఒక్కసారిగా పెద్దయ్య కళ్ళల్లో కన్నీళ్లు ............

పెద్దయ్యా ......... అంటూ చేతులుపట్టుకొని , మీరు ఇలా చేస్తే హత్య ఎవరు చేశారో ఎంక్విరీ వేస్తారని బుక్స్ లో చదువుకున్నాము . అలా జరుగనే జరగకూడదు . ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి అని కన్నీళ్ళతో చెప్పాను . 



అంటే ఆ హత్య ........... నా కన్నీళ్లను తుడిచి అర్థమైంది మహేష్ అర్థమైంది మొత్తం ఇప్పుడే అర్థమైంది . అక్కయ్య ............ తప్పంతా మాది వాడు వెంటపడుతున్నాడని తెలిసికూడా మా బుజ్జి దేవుడికి కాపలా ఉండాల్సినవాళ్ళమ ఇంట్లో నిద్రపోయాము . ఆపాపం మాది మాది అని ఊసలకు తలను కొట్టుకున్నారు . 

పెద్దయ్యా పెద్దయ్యా ..........అని ఇద్దరమూ మా చేతులను అడ్డుపెట్టాము . 

కానిస్టేబుల్స్ ఆపి వెనక్కు లాక్కెళ్లారు . 

మేమంతా బ్రతికి ఉన్నా శవాలకిందే లెక్క మహేష్ , మమ్మల్ని క్షమించు అని కన్నీళ్లను ధారలా వదులుతూ మోకాళ్లపై కూర్చుని రెండు చేతులనూ జోడించారు . 

పెద్దయ్యా ..........ఏమంటున్నారు .

అవునురా మనం ఇంతమంది ఉండి మన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాము అని కానిస్టేబుల్ చేతిలోని లాఠీ అందుకొని తనని తాను కొట్టుకున్నారు .

అంకుల్ , అన్నయ్యలు కూడా పెద్దయ్య చెప్పినది నిజమేనని లాఠీలు అందుకోబోతుంటే కానిస్టేబుల్స్ ఆపారు . 



SI గారు బాధతో కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని కానిస్టేబుల్స్ అని సైగ చెయ్యడంతో అందరినీ ఆపి పొడవాటి స్టూల్ పై కూర్చోబెట్టారు . 

మేమిద్దరమూ పెద్దయ్యా , నాన్న , అన్నయ్యా ........... అంటూ ఏడుస్తూ ఆపడానికి ప్రయత్నించాము . 

సర్ వాళ్ళు అమాయ...........

పెద్దయ్యా ............. మీరు మరొక్కమాట మాట్లాడితే ఈ లాకప్ లో మా చావులను చూస్తారు అనిచెప్పడంతో , 

మహేష్ అంతమాట అని అక్కడితో ఆగిపోయారు . 

చూడండి నేనుకూడా రాత్రన్తా ఇదేవిషయమై పిల్లలను ఒప్పించడానికి ప్రయత్నించాను కానీ ఈ హత్యను మేమే చేసాము అని చెబుతూనే ఉన్నారు . మనం చెయ్యడానికి ఏమీలేదు ఇక కోర్ట్ వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది . నా వంతుగా పిల్లలను కాపాడుకుంటున్నాను . 

మేము చెయ్యవలసినది చేయక ఇప్పుడు బాధపడుతున్నాము . మమ్మల్ని ఆ అమ్మవారుకూడా క్షమించరు , ఏమీకాని మీరు ఎంతో చేస్తున్నారు అని లేచి SI గారి పాదాలకు నమస్కరించారు .



అంతలో ఇద్దరు స్టేషన్ మెట్లదగ్గరకువచ్చి ఏయ్ SI ఈ టౌన్ మొత్తం మా సారు అండర్ కంట్రోల్ మరొక్కసారి చెబుతున్నాము పిల్లలను మాకు అప్పచెప్పి రాసిన FIR చింపేయ్యండి . కొద్దినిమిషాల్లో మా రౌడీలు మొత్తం ఇక్కడకు చేరుకుంటున్నారు , పిల్లలతోపాటు మీప్రాణాలు కూడా మిగలవు అని వార్నింగ్ ఇస్తుంటే ,



సర్ సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూమ్ కు కాల్ చెయ్యడం మంచిది సర్ మనమంతా కలిపి 8 మందిమే ఉన్నాము . ఇప్పటికే బయట 30 మంది ఆయుధాలతో ఉన్నారు ఇంకెంతమంది వస్తారో అని ఒక కానిస్టేబుల్ భయపడుతోంటే ,

కానిస్టేబుల్స్ మనం సెక్యూరిటీ ఆఫీసర్లం వాళ్ళు ఆఫ్ట్రాల్ వీధి రౌడీలు ........ భయపడేవాళ్ళు ఉన్నఫలంగా వెళ్లిపోవచ్చు నేనేమీ అనుకోను అనిచెప్పి వెనుకకు తిరిగారు . 

అందరూ ఒకరిముఖాలను మరొకరు చూసుకుని సర్ ముందుకువెళ్లి మీరే మాకు ఇన్స్పిరేషన్ సర్ ఇలాంటి పిల్లలను రక్షిస్తూ ప్రాణాలుపోయినా పర్లేదు మీతోపాటే ఉంటాము సర్ అనిచెప్పారు . 

అయితే lets టేక్ పొజిషన్స్ అని ధైర్యంతో కేకవేయ్యడంతో లాఠీలతో నిలబడ్డారు . 

అందివచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు ఇక అంటూ చేతితో గొంతుకోసినట్లు సైగచేసి బెదిరిస్తుండటం చూసి , మన పిల్లలను కాపాడుతున్న దేవుడిలాంటి సెక్యూరిటీ ఆఫీసర్లనే బెదిరిస్తారా ........ రేయ్ రంగన్నా అని పెద్దయ్య సైగచెయ్యడం ఆలస్యం ముగ్గురూ కోదమ సింహాల్లా పరుగుపెట్టి వాళ్ళిద్దరిమీదకు దూకి చేతులు కాళ్ళను వెనక్కు విరిచేసి నోటిలోనుండి మాటరానట్లు చేసి ప్రక్కకు పడేసారు . 

వాళ్ళ అరుపులు కిలోమీటర్ వరకూ వినిపించినట్లు బయట ఉన్న తెల్ల చొక్కాలలోనివాళ్ళు రేయ్ మనవాళ్లను కొడుతున్నారురా ఆయుధాలు అందుకోండి వాళ్ళందరినీ నరికేయ్యాలి అని కేకవేసి పరుగున వస్తుంటే , ప్రక్కనే ఉన్న మా ఊరి జనమంతా చుట్టుముట్టేసి క్షణాల్లో నెలరోజులపాటు కదలలేనట్లు కుమ్మేసి వదిలారు . 

వాళ్ళ అరుపులు ఊరంతా వినిపించినట్లు ఫోన్ చేసి వినిపించినవాళ్ళు అప్పుడే స్టేషన్ చేరుకుని వాళ్ళ వాళ్ళ పరిస్థితిని , మా ఊరి జనం కోపాన్ని చూసి చేతిలోని ఆయుధాలను వదిలి ఎలావచ్చారో అంతకు డబల్ వేగంతో తుర్రుమన్నారు . 



ఊరిజనమంతా SI గారితోపాటు బయటకువచ్చిన  పెద్దయ్య దగ్గరకు చేరుకుని విషయం తెలుసుకుని , మన బుజ్జి దేవుడు లోపల ఉన్నాడా అని అందరూ లోపలకు దూరి చూడబోతుంటే , 

కానిస్టేబుల్స్ సర్ సర్ ..........

వదలమని సైగచెయ్యడంతో అడ్డుతప్పి వదిలారు . బాబు బాబు ........అంటూ వచ్చి బాధతో పలకరించి , హత్యను నామీద నామీద నామీద.......... వేసుకుంటాము అని మాట్లాడుతోంటే , పెద్దయ్య లోపలికివచ్చి అందరినీ ఆపేశారు . 



పెద్దయ్యా ......... ఇంత చిన్నపిల్లలకోసం ఇంతమంది ప్రాణాలివ్వడానికి సిద్ధపడటం చూస్తుంటే ఖచ్చితంగా పిల్లలు ఏదో గొప్పదే సాధించి ఉంటారు.

అవును సర్ మేమంతా ఒక ఊరివాళ్ళమే , ఈ విషయం తెలిస్తే మరొక ఊరు మొత్తం వచ్చేస్తుంది అని పెద్దయ్య మొత్తం వివరించారు . 

మహేష్ అని నా కురులపై స్పృశించి నేను కూడా నీ అభిమానిని అయిపోయాను అన్నారు .



ఇంతలో స్టేషన్ బయట వరుసబెట్టి వెహికల్స్ ఆగడం , అందులోనుండి స్వయంగా MP గారే స్వయంగా రావడంతో , SI గారు డ్యూటీలో భాగంగా వెళ్లి నమస్కరించి లోపలకు పిలుచుకునివచ్చారు . 

సర్ వీల్లే అని కొందరు ఊరి జనాన్ని చూపించి భయంతో వెనుక దాక్కున్నారు . 

అందరి మధ్యనే లోపలకు వెళ్లి కుర్చీలో కూర్చుని , కానిస్టేబుల్స్ తాళం తీసి ఆ పిల్లలను తీసుకురండి అని చెప్పారు . 

Sir sir ...........

ఏంటి సర్ సమయం లేదు , బావమరిది చనిపోయాడు , పెళ్లి ఆగిపోయింది , పరువు పోయింది ............. నిమిషంలో పిల్లలిద్దరూ నా వెహికల్లో ఉండాలి . 



No సర్ క్షమించండి , FIR రాసేసాము పిల్లలిద్దరినీ కోర్ట్ లో సబ్మిట్ చేసేంతవరకూ మా స్టేషన్ కంట్రోల్ లోనే ఉంటారు అని SI సర్ సమాధానమిచ్చారు . 

రేయ్ లాకప్ పగలగొట్టి పిల్లలను లాక్కొని రండి అని కేకవేశాడు .

సర్ మీకు తెలుసో తెలియదో మీ బావమరిది మీరనుకున్నంత మంచివాడు కాదు . చుట్టుప్రక్కల డిస్ట్రిక్ట్ మొత్తం లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి . త్వరలోనే మేమే ఎన్కౌంటర్లో లేపేయాలని పైనుండి ఆర్డర్స్ వచ్చాయి ఇంతలో ఆ పిల్లలే మా శ్రమను తగ్గించారు అని చెప్పారు . 

అవన్నీ నేను ఆలోచించే పరిస్థితుల్లో లేను SI , ప్రాణానికి ప్రాణం అంతే రేయ్ చూస్తారేంటి లాక్కుని రండి అని కోపంతో అరిచాడు . 



వెనుక ఉన్నవాళ్ళంతా ఊరిజనాన్ని చూసి భయపడి అడుగువెయ్యకపోవడం చూసి వెనుక ఉన్న కానిస్టేబుల్స్ నవ్వుకున్నారు . 

వీళ్ళకి భయపడతారా .........అని వాళ్ళ మనుషుల చెంపలపై కొట్టి , అయితే నేనే లాక్కొనివస్తాను అని అడుగుముందుకెయ్యడం , 

మొదట SI గారు ఆయన వెనుక పెద్దయ్యా ఊరిజనమంతా అడ్డు నిలబడ్డారు . 

నేను మీ అందరికీ నాయకుడిని నాకే అడ్డుపడతారా ..........

ముందు మీరు ప్రజా సేవకులు సర్ , మీరు చెయ్యనివి మా పిల్లలు మాకు అందించారు . వాళ్లకోసం మాప్రాణాలైనా అర్పిస్తాము అని బదులిచ్చారు .

నన్నే ఎదిరిస్తారా ........... నా బావమరిది కట్టె కాలేలోపు నా పవర్ ఏంటో చూపిస్తాను అని కోపంతో వెళ్లిపోయారు . 



పైనుండి ఆర్డర్స్ వచ్చేలోపు జడ్జిగారిని రిక్వెస్ట్ చేసి ఈరోజే కోర్ట్ లో సబ్మిట్ చేసేలా చూస్తాను అని SI గారు కాల్స్ చేయబోతే ,

సర్ పెద్దమనసుతో మాపిల్లలను వదిలి మమ్మల్ని , 

పెద్దయ్యా .......... మీరు నామాట వినడం లేదుకాదూ అంటూ ఊసలకు బలంగా తలతో కొట్టాను . 

బాబు బాబు అని అందరూ కన్నీళ్ళతో బాధపడటం , పెద్దయ్య మౌనంగా ఉండిపోవడంతో ఆపాను . 

SI గారు కాల్స్ చేసి మధ్యాహ్నం 12 గంటలకు పర్మిషన్ ఇచ్చారు అంతవరకూ జాగ్రత్తగా చూసుకోవాలి . 

మేముకూడా ఇక్కడే ఉండి కాపలా కాస్తాము సర్ అని స్టేషన్ చుట్టూ నిలబడ్డారు .



పెద్దయ్యను , కృష్ణగాడి నాన్నను పిలిపించి ముందు కృష్ణగాడి అమ్మ ఎలాఉన్నారు అని అడిగాను . 

ఈ విషయం తెలియక మీరెక్కడ అని ఉదయం చాలా కంగారుపడుతున్నారు మీ అన్నయ్యతో కబురుపంపాము అని బదులిచ్చారు . 

మరి వాసంతి అక్క , అమ్మ చాలా బాధపడుతుంటారు కదా పెద్దయ్యా .........అని కృష్ణగాడు నాచేతిని పట్టుకుని ధైర్యాన్నిస్తూ అడిగాడు . 



మహేష్ నువ్వు మాకు దేవుడిచ్చిన వరప్రసాదం , నీతో అపద్దo చెప్పలేము . రాత్రికి రాత్రే మొత్తం ఇంటిసమానులతో సహా ఎక్కడికో వెళ్లిపోయారు మహేష్ .

పెద్దయ్యా .......... ఏమంటున్నారు .

అవును మహేష్ వంట గదిలో ఈ నిద్రమాత్రలు బాటిల్ కనిపించింది . అంటే మీ అక్కయ్యా , అమ్మలను ఒప్పించలేనని వారికి నిద్రమాత్రలు ఇచ్చి పడుకున్నాక తీసుకెళ్లిపోయినట్లున్నాడు మీనాన్న . మీ నాన్న గురించి తెలుసుకదా అనిచెప్పారు .



ఒక్కసారిగా నాకళ్ళల్లో నీళ్లతో స్పృహకోల్పోయినట్లు కిందపడిపోతుంటే కృష్ణగాడు పట్టుకుని నెమ్మదిగా కూర్చోబెట్టాడు . 

కానిస్టేబుల్ లాకప్ తెరవండి అని సర్ చెప్పడంతో , తెరవగానే పెద్దయ్యా , అంకుల్ లోపలికివచ్చి బాబు మహేష్ మహేష్ అంటూ నీళ్లతో మేల్కొలిపి నీళ్లు తాగించారు . 

పెద్దయ్యా .........అని హృదయం నుండి తన్నుకొస్తున్న బాధతో , తడబడుతూ వణుకుతూ ఎక్క......డికి వెళ్ళా......రో తెలిసిందా అని అడిగాను . 

క్షమించు మహేష్ అందరమూ మా కర్తవ్యాన్ని మరిచిపోయి ఆదమరిచి నిద్రలోఉన్నాము అని బాధపడుతూ బదులిచ్చారు .



వెంటనే కన్నీళ్లను తుడుచుకుని ఇప్పటికి అక్కయ్య ఎవ్వరికీ తెలియని దగ్గర సేఫ్ గా ఉండటమే మంచిది అనిచెప్పాను . నాన్న గురించి తెలిసినా తప్పకుండా అక్కయ్య వస్తుందని నమ్మకంతో ఉన్నాను . 

అన్నయ్య లోపలికి వచ్చి తమ్ముళ్లూ అంటూ కౌగిలించుకుని , మీరు స్టేషన్ లో ఉన్నారని విషయం మొత్తం అమ్మకు చెప్పాను . 

అమ్మ నామీద కోప్పడి.............

తమ్ముడూ మహేష్ కు అనుక్షణం ఆపదలోకూడా తోడుగా ఉన్నందుకు అమ్మ చాలా చాలా సంతోషించి గర్వపడింది తమ్ముడూ .........

చెప్పాను కదరా అమ్మకు నాకంటే నువ్వంటేనే ప్రాణం అని అని భుజం చుట్టూ చేతినివేశాడు .

లవ్ యు అమ్మా .........అని రెండుచేతులతో అంకుల్ కు నమస్కరించాను . 

మేము లేకపోయినా కృష్ణ నీప్రక్కన ఉన్నందుకు నెనుకూడా చాలా చాలా సంతోషిస్తున్నాను మహేష్ .

తమ్ముళ్లూ.......... మీకోసం అమ్మ అప్పటికప్పుడు మ్యాగీ చేసిచ్చింది అని అందించాడు .



అన్నయ్యా ............. వాడికి తినడం రాదు , తినిపించాలి అనిచెప్పడంతో , పెద్దయ్య తినిపించబోతే అక్కయ్య ఎక్కడికీ వెళ్లిందో అనే బాధతో తినకపోవడంతో ,

ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా మీ అక్కయ్య , అమ్మ ఎక్కడుందో కనుక్కునే బాధ్యత మాది మహేష్  , 12 గంటలకు కోర్ట్ కు వెళితే ఎంత సమయం అవుతుందో తిను నాన్నా అని పెద్దయ్య బాధపడటం చూసి , కన్నీళ్లను తుడిచి తిన్నాను . కృష్ణగాడికి అన్నయ్య తినిపించాడు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 17-04-2020, 05:50 AM



Users browsing this thread: 68 Guest(s)