Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అంతే ఆనందబాస్పాలతో లవ్ యు రా అని అమాంతం వాడిని కౌగిలించుకున్నాను .

రేయ్ మహేష్ , నువ్వేమి భయపడకు అక్కయ్య సేఫ్ అనిచెప్పడంతో ,

గుండెలపై చేతినివేసుకొని అక్కయ్యనే తలుచుకుంటూ కళ్ళుమూసుకుని వాడి భుజం పై వాలిపోయాను . 



వెహికల్ ఆగడం మాఇద్దరినీ స్టేషన్ లోకి తీసుకెళ్లి , కానిస్టేబుల్ పిల్లలను లాకప్ లో ఉంచండి అని పెద్ద సెక్యూరిటీ అధికారి చెప్పారు . 

సర్ చిన్నపిల్లలను ...........లాకప్ లో ,

వాళ్ళ సేఫ్టీ కోసమే మూర్తి గారు , చనిపోయినది MP బావమరిది ..........

సర్ వాడేనా కాన్ఫర్మా .............. అని ఆనందంతో పొంగిపోతూ మాఇద్దరి చేతులు అందుకొని థాంక్స్ చెప్పారు . సర్ వాడిచావుకోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో తెలుసుకదా సర్ , వాడి వలన అత్యాచారాలకు గురయ్యి అభాగ్యులై కంప్లైంట్ ఇచ్చిన ఫైల్ లో ఒక్కొక్క కంప్లైంట్ పెరుగుతుందే తప్ప మనం ఏమీ చేయలేకపోయాము . ఈ చిన్నపిల్లలు వాడి ప్రాణం తీసినా ఇంతమంది సంతోషాలను కారనడం అవుతారు అని పెద్ద ఫైల్ చూపించాడు .



కానీ వాడి ఫ్యామిలీ అలా ఆలోచించరు కదా ..........., ఖచ్చితంగా పిల్లలను ఏమైనా చెయ్యడానికి తెగించవచ్చు . కోర్ట్ లో సబ్మిట్ చేసేంతవరకూ మనమే పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే లాకప్ లో ఉంచమని చెప్పాను . అందులోనూ వాళ్ళ ఇంట్లో రేపు జరగబోతున్న పెళ్లికూడా ఆపేస్తారు , ఆ కోపం కూడా పిల్లలపై చూపించవచ్చు . అందుబాటులో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లను , హోమ్ గార్డ్స్ ను పిలిపించండి అని అక్కడే కూర్చున్నారు .

Yes సర్ అని సెల్యూట్ చేసి పిల్లలూ మీ క్షేమం కోసమే రండి అని లాకప్ లో కూర్చోబెట్టి , తాగడానికి నీళ్లు అందించి సెల్ కు ఏకంగా రెండు తాళాలను వేసి , ఏమీ భయపడకండి సర్ చాలా మంచివారు అనిచెప్పి ల్యాండ్ లైన్ దగ్గరికివెళ్లి కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ అందరినీ వెంటనే స్టేషన్ కు రమ్మన్నారు . 



అక్కడ ఇంటిలో కానిస్టేబుల్స్ శవం చుట్టూ మార్క్ వేసి ఫార్మాలిటీస్ పూర్తిచేసి , అంబులెన్స్ లో శవాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు పంపించి , ఫైల్ తోపాటు నాన్న దగ్గరకువెళ్లి మీరే కదా మొదట చూసి కాల్ చేసింది . పిల్లలకు మీరేమవుతారు అని అడిగారు . 

భయంతో వణుకుతూ ఏమీ కాము సర్ ............, రూంలో స్పృహకోల్పోయిన అక్కయ్య ప్రక్కనే కూర్చున్న అమ్మ నాన్న మాటలకు కోపంతో రగిలిపోతూ , మమ్మల్నే తలుచుకుంటూ బాధపడుతోంది . 

సరే ఏమిజరిగిందో , ఏమిచూసారో చెప్పండి అని కానిస్టేబుల్ అడిగారు . 

 మాది ప్రక్క ఇల్లు సర్ టౌన్ లో ఫంక్షన్ కు అటెండ్ అయ్యి బైకులో ఇంటికి వెళ్తోంటే గట్టిగా కేకలు వినిపించడంతో ఆగి పరుగునవచ్చిచూస్తే ఇద్దరు పిల్లలు అతికిరాతకంగా చంపేశారు సర్ ..........

మీ పేరు ..........

పేరు పేరు ..........మల్లన్న సర్ అని మాఇంటి ప్రక్కనే ఉన్న వాళ్ళ పేరు చెప్పాడు.

అయితే సాక్షిగా మీరువచ్చి కోర్ట్ లో సాక్ష్యం చెప్పాలి మల్లన్న ఇక్కడ సంతకం చెయ్యండి అని ఫైల్ చూపించారు . 



సర్ సెక్యూరిటీ ఆఫీసర్లు , కోర్ట్ అంటే మాకు చచ్చేంత భయం మమ్మల్ని ఇందులో involve చేయకండి . ఏదో మా మంచితనం వలన మీకు కాల్ చేసి విషయం చెప్పాను అని రెండు చేతులతో నటించడంతో , 

సరే చూద్దాము అని ఇద్దరు కానిస్టేబుల్స్ బైకులో వెళ్లిపోయారు . 



ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఫోన్ నుండి ట్రాన్స్పోర్ట్ కు కాల్ చేసి పెద్ద లారీ , కార్ మరియు ఎంతమంది ఉంటే అంతమంది పనివాళ్లను పంపించండి అని అడ్రస్ చెప్పారు . 

సర్ అర్ధరాత్రి అయ్యింది కుదరదు సర్ .........

హెలో హెలో బాస్ మీరు ఎంత అడిగితే అంత అమౌంట్ డబల్ త్రిబుల్ ఇస్తాను please please .............అని బ్రతిమాలడంతో , 

సరే సర్ అర గంటలో ఉంటాము అని బదులివ్వడంతో , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని , వాళ్లకు కనిపించకుండా శవపు మార్క్ పై దుప్పటి కప్పి , రూంలోకివెళ్లి కంగారుపడుతూ బ్యాగు అందుకొని బీరువాలో సేఫ్టీ గా ఉంచిన నగలను , డబ్బుని అందులోకి మార్చేస్తూ , జానకి తొందరగా విలువైన వస్తువులను తీసుకొచ్చి బ్యాగులలోకి మార్చేయ్ .

ఎందుకండీ ............

చెబుతాను త్వరగా త్వరగా ..........అని ఇల్లుమొత్తం తిరుగుతూ ఎక్కడా ఒక్క ఫోటోకూడా లేకుండా ఒక పెద్ద బాక్స్ లో నింపేశారు . 

ఈ బ్యాగు పైకి తీసుకెళ్లి నీ కూతురి బట్టలను ఇందులోకి మార్చేయ్ .........ఇంకా అలా చూస్తున్నావే వెళ్లు త్వరగా అని తోసారు . 

ఏమీ అర్థం కాని అమ్మ పైకివెళ్లింది . 

ఇంతలో లారీ ఆగినట్లు సౌండ్ రావడంతో , గుమ్మం దగ్గరకువెళ్లి కారుతోపాటు చాలామందిని చూసి హమ్మయ్యా అనుకుని ఇది అడ్వాన్స్ మాత్రమే అంటూ పెద్ద అమౌంట్ చేతిలో ఉంచి , మొత్తం సామానులను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మార్చేయ్యాలి , ఏమాత్రం సౌండ్ చేయకూడదు నా కూతురు నిద్రపోతోంది అనిచెప్పారు . 

వాడి పెదాలపై చిరునవ్వుతో మీరే చూస్తారు కదా సర్ అని మొత్తం అన్నట్లు సైగచెయ్యడం ఆలస్యం , పనివాళ్ళు వాళ్లపని వాళ్ళు చకచకా పూర్తిచేసేశారు . 

అమ్మ ఆశ్చర్యపోతూ నాన్నను అడిగినా రిప్లై ఇవ్వకపోవడంతో కొప్పడటం చూసి , నాన్న నేరుగా వంట గదిలోకివెళ్లి జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి టెన్షన్ తగ్గుతుంది తాగమని వద్దన్నా నోటికి అందించడంతో అమ్మ కొప్పుడుతూనే తాగేసింది . 



కొద్దిసేపట్లోనే కళ్ళు మూతలు పడుతుండటంతో , నాన్న నడిపించుకుంటూ వెళ్లి అక్కయ్య ప్రక్కనే పడుకోబెట్టి , మొదట అక్కయ్యను ఎత్తుకొనివెల్లి కారులో వెనుక పడుకోబెట్టారు , నగలు డబ్బు బ్యాగుని తీసుకెళ్లి కారులో ఉంచి , మత్తుగా నిద్రపోతున్న అమ్మను కూడా ఎత్తుకుని వెళుతూ మీరు ఒప్పుకోరు కాబట్టే ఇలాచెయ్యాల్సి వచ్చింది అని కారులో అక్కయ్య ప్రక్కనే పడుకోబెట్టి , చుట్టూచూసి హమ్మయ్యా ...........అందరూ పొలం పనులు చేసి దున్నపోతుల్లా నిద్రపోతుండటం వలన అనుకున్నది అనుకున్నట్లు పూర్తయ్యింది అని చివరగా రూంలోని వస్తువులను కూడా లారీలోకి మార్చెయ్యడంతో , మీరు కోరిన అమౌంట్ unload అయ్యాక ఇచ్చేస్తాను మరొక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అని నాన్న కారులో ఎక్కి పోనివ్వమనడంతో లారీ వెనుకే ఫాలో అయ్యింది .



ఫంక్షన్ పూర్తిచేసుకుని ఇంటికిచేరుకున్న కుటుంబసభ్యులకు తెలపాలనుకుని స్టేషన్ లో తగినంతమంది లేకపోవడంతో , పిల్లల సేఫ్టీ ముఖ్యం అనుకుని తెల్లవారేంతవరకూ గోప్యన్గా ఉంచి , సూర్యోదయం అయ్యాక కానిస్టేబుల్స్ వెళ్లి షాకింగ్ న్యూస్ చెప్పడంతో , అందరూ శోకసంద్రంలో మునిగిపోయి హాస్పిటల్ చేరుకుని బాడీ చూసి , ఎలాజరిగిందో తెలుసుకుని నెక్స్ట్ మినిట్ అంబులెన్స్ లో ఇంటికి పంపించేసి స్టేషన్ లాకప్ లో ఉన్న వాళ్ళు మల్కీ సూర్యుణ్ణి చూడరాదు అని కోపంతో చెప్పడంతో , yes సర్ అంటూ తన అనుచరులు పెద్దమొత్తంలో స్టేషన్ వైపు కదలడం చూసిన కానిస్టేబుల్స్ వెంటనే హాస్పిటల్లోని ల్యాండ్ లైన్ నుండి స్టేషన్ కు సమాచారం అందించి వెనుకే స్టేషన్ కు బయలుదేరారు .



తెల్లవారుఘామునే వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి ఫ్రెష్ అయ్యి మహేష్ దగ్గరికి పరుగున వెళ్లే తనకొడుకు తెల్లవారినా రాకపోవడంతో , నన్ను అక్కయ్యను అమ్మను పలకరించినట్లు ఉంటుందని అమ్మ ఇంటికిచేరుకుని తలుపులు పూర్తిగా తెరుచుకుని ఉండటంతో లోపలికివచ్చి ఒక్కవస్తువూ లేకపోవడంతో ఆశ్చర్యపోయి , వాసంతి జానకి ............. అనిపిలుస్తూ కంగారుపడుతూ కొన్ని అడుగులువేసి మెట్ల ప్రక్కనే శవపు మార్క్ చూసి భయంతో వణికిపోయి పరుగున ఇంటికిచేరుకుని వొళ్ళంతా చెమటతో నోట్లో మాటరానట్లు  బా........మహే..........అంటూ అంకుల్ మరియు అన్నయ్యకు చెప్పడానికి try చేస్తోంది .

అమ్మా ..........ఏమైంది అలా భయపడుతున్నారు . ఇలా కూర్చుని శాంతించండి అని వాళ్ళుకూడా కంగారుపడుతూ నాన్న తొందరగా వెళ్లి నీళ్లు తీసుకురండి అనిచెప్పాడు అన్నయ్య .

నీల్లువద్దు ఏమీవద్దు అని అంకుల్ , అన్నయ్యల చేతులనుపట్టుకుని వడివడిగా ఇంటికీపిలుచుకునివచ్చి ఇల్లుమొత్తం ఖాళీ అని సైగ చేసి మార్క్ దగ్గరకు పిలుచుకొనివెళ్లి చూపించింది . అమ్మలానే ఇద్దరూకూడా ఆశ్చర్యం షాక్ తో మహేష్ , కృష్ణ ...........అని కేకలువేస్తూ పైకివెళ్లికూడా చూసొచ్చి ఎక్కడా ఎవ్వరూ లేరు , ఒక్కసామాను కూడా లేదు . 

తొందరగా నువ్వెళ్ళి పెద్దయ్యను పీలుచుకొనిరా అని అంకుల్ చెప్పడంతో అన్నయ్య టెన్షన్ పెడుతూనే పరుగునవెళ్లి పెద్దయ్యతోపాటు ఊరిజనాలను పిలుచుకునివచ్చాడు . 



చూసి ఏమీ అర్థం కానట్లు బాబు మహేష్ , తల్లీ వాసంతి అంటూ కళ్ళల్లో నీళ్లతో అందరూ ఇల్లుమొత్తం మరియు ఇంటిచుట్టూ కాంపౌండ్ లో మరొకసారి అణువణువూ చూసి ఎక్కడా లేకపోవడం , శవపు మార్కు ఉండటం చూసి ఊరిజనమంతా మాకు ఏమైందో అన్న బాధలో ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా గుసగుసలాడుతోంటే , 

మనవాళ్లకు ఏమీ అయి ఉండదు ఈ శవపు మార్క్ 51/2 అడుగులకు పైనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరో మగవాళ్ళది అని పెద్దయ్య కాన్ఫిడెంట్ గా చెప్పడంతో , అందరూ ఊపిరిపీల్చుకుని , మరి మనవాళ్ళు ఎక్కడ , సామానులన్నీ ఏమైపోయాయి రాత్రికిరాత్రి అని మళ్ళీ కంగారుపడుతూ ఏమీకాకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు . 

ఈ మార్క్ వేశారంటే ఖచ్చితంగా రాత్రి పోలిసులు వచ్చారు . కాబట్టి స్టేషన్ కు వెలితే ఏమిజరిగిందో తెలుస్తుంది అని పెద్దయ్య అనడం ఆలస్యం , రేయ్ ట్రాక్టర్లు తియ్యండి అందరమూ వెళదాము అని , అమ్మకు ధైర్యం చెప్పి ఊరిలోని మగవాళ్ళంతా టౌన్ కు బయలుదేరి స్టేషన్ చేరుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 17-04-2020, 05:50 AM



Users browsing this thread: Shiva@123, 63 Guest(s)