Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అలా రెండు నెలలు సంతోషన్గా గడిచిపోతున్నాయి . స్కూల్ కి వెళ్లిన ప్రతిరోజూ సునీతక్క , అక్కయ్యను ఏదో విషయమై బ్రతిమాలడం , పిచ్చిపట్టిందే నీకు అని అక్కయ్య నవ్వుకోవడం చూస్తూనే ఉన్నాను .
 ఒకరోజు నాన్న ఇంటికి రావడంతో నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం అని అమ్మ అడిగింది . 
మీరే పెట్టొచ్చు కదా నేను మాత్రం చూడను తీసుకురా అని చెప్పగానే , మాకు కావాల్సింది కూడా అదేనండి అని పత్రాలు తీసుకురావడం నాన్న చూడనుకూడా చూడకుండా ఎక్కడ పెట్టమంటే అక్కడ తల అటువైపు తిప్పి పెట్టడంతో థాంక్స్ చెప్పి , నాన్న కొన్నిరోజులు ఉండి వెళ్లిపోగానే లాయర్ ను పిలిపించి అందించారు . వారంలో మీపని పూర్తిచేస్తాను అని అలాగే మార్చేసి తీసుకొచ్చి ఫీజ్ తీసుకుని వెళ్లిపోయారు . ఆక్టోబర్లో exams రావడంతో అక్కయ్యలు వాళ్ళ exams లా నాతో చదివించారు .  ప్రతి exam బానే రాశాను . Exams తరువాత దసరా హాలిడేస్ వదలడంతో స్టూడెంట్స్ ఆనందానికి అవధులు లేవు . ఇక 10 రోజులు అక్కయ్యతోనే ఉండవచ్చు అని పరుగునవచ్చి అక్కయ్య గుండెలపై వాలిపోయి సంతోషాన్ని పంచుకున్నాను .

రెండు రోజుల హాలిడేస్ తరువాత ఒకరోజు ఉదయం ముందు పెద్దయ్య కృష్ణగాడు వెనుక ఊరిజనమంతా సంతోషంతో ఇంటికివచ్చి , బాబు మహేష్ తల్లి వాసంతి అని బయటకు పిలిచారు . 
ఊరుఊరంతా రావడంతో అమ్మతోపాటు ఆశ్చర్యపోయి బయటకు వచ్చి పెద్దయ్యా ఏమైనా సమస్యా , రేయ్ ఏంట్రా అని అడిగాను . 
 సమస్య కాదు బాబు ఈరోజు ఊరంతటికీ పండుగ , బాబు మహేష్ ముందు నీ ఓడిపట్టుకో బాబు అని అడిగారు .
ఒడినా ..........పెద్దయ్యా ఎందుకు అని అడిగాను .
మా బుజ్జిదేవుని వలన దాదాపు కొన్ని సంవత్సరాల తరువాత పెట్టుబడికి పదింతలకు పైనే రాబడిని పొందబోతున్నాము . సంవత్సరానికి ఒక్క పంట కూడా పండించుకోలేని స్థితిలోనుండి ఏకంగా మూడు పంటలు పండించేంత నీటిని సమకూర్చావు .
మొదటి మానేడు ధాన్యాన్ని అమ్మవారికి సమర్పించి జాతరను ఫిక్స్ చేసేవాళ్ళము . మా బుజ్జి దేవుడి వలనే కదా ఆ అమ్మవారి మాన్యం లోకూడా పచ్చదనం వెల్లువిరిసింది . కాబట్టి నువ్వే మా అందరికీ ఆ అమ్మవారు ప్రసాదించిన ప్రాణమైన బుజ్జిదేవుడివి . మాకొరిక కాదనకుండా ఈ నీ ప్రియమైన భక్తులు అందించే ధాన్యాన్ని అందుకో అన్నారు .

పెద్దయ్య మాటలకు నాకళ్ళల్లో ఆనందబాస్పాలతో మీ కోరిక కాదనను పెద్దయ్యా ......, ఎందుకంటే మీరందరూ అంటే నాకు చాలా చాలా ఇష్టం కానీ మొదటి ధాన్యాన్ని నేను అందుకోవడం కంటే నన్ను ఇంత అందమైన ఊరికి తీసుకొచ్చిన దేవత మా అక్కయ్య అందుకోవడం కరెక్ట్ అని ఏకంగా అక్కయ్య చేతిని అందుకొని పిలుచుకునివచ్చాను .
అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో అమితమైన ఆరాధనతో నావైపే చూస్తోంది .
మా బుజ్జిదేవుడి ఇష్టమే మాఇష్టం , తల్లి వాసంతి అందుకొమ్మా అని అమ్మావాళ్ళు ముందుకువచ్చి అక్కయ్య పైటలో వేసి చల్లగా ఉండు తల్లి అని దీవించి అమ్మ చేసిన తేనీటిని స్వీకరించి తల్లి వాసంతి సాయంత్రం అమ్మవారి గుడిలో జాతర ఎప్పుడన్నది నిర్ణయిస్తారు అమ్మతోపాటు మన బుజ్జిదేవుడిని పిలుచుకొనిరండి అని వెళ్లిపోయారు.

లోపలికివచ్చి ధాన్యాన్ని పూజ మందిరంలో ఉంచివచ్చి , తమ్ముడూ .........అని పరుగునవచ్చి అమాంతం గుండెలపై హత్తుకొని నేనేమివ్వగలను అని గుండెలపై హత్తుకుంది . 
మా అక్కయ్యే నా సర్వస్వం అయినప్పుడు ఇంకేమికావాలి అక్కయ్యా ........., నాకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో మా అక్కయ్యకు తెలియదా అని బుగ్గపై ముద్దుపెట్టాను . 
తమ్ముడు always రైట్ అని నా ముఖమంతా ముద్దులతో ముంచెత్తి పరవశించిపోయింది . మమ్మల్ని చూసి అమ్మ ఆనందబాస్పాలతో చెరొకముద్దుపెట్టి , ఇక ఏమి కోరుకుంటాను నా ప్రాణమైన ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంతకంటే ఇంకేమీ కోరుకోను అని దేవుళ్ళని ప్రార్థించింది .

సాయంత్రం అమ్మా అక్కయ్యలు పట్టుచీరలలో నాకు కొత్త బట్టలు వేసి పిలుచుకొనివెళ్లారు . అప్పటికే ఊరిజనమంతా ఉండటం మమ్మల్ని చూసి దారి వదిలి చేతితో దారి చూపించడంతో నేరుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము . పూజారిగారు మన మహేష్ వచ్చాడు మొదలెట్టండి అని పెద్దయ్యతోపాటు అందరూ సంతోషంతో చెప్పారు .
పూజారిగారు కూడా సంతోషంతో పూజ చేసి అందరి సమక్షంలో , పండిన పంటను అమ్ముకోవడానికి కాస్త సమయం కావాలి కాబట్టి దసరా పర్వదినం తరువాతి రోజు జాతర జరుపుకోవడానికి అత్యంత పవిత్రమైనదిగా అమ్మ ఆజ్ఞాపించారు అని చెప్పగానే , 
తప్పట్లు తాళాలతో కేరింతలు వేసి తమ సమ్మతాన్ని తెలపడంతో జయం అని అమ్మవారిని ప్రార్థించారు . పెద్దయ్య సంతోషంతో నన్ను పైకెత్తి ఊరందరి మధ్యకు తీసుకొచ్చి చాలా సంవత్సరాల తరువాత జాతర జరపబోతున్నాము , అంతా మా బుజ్జిదేవుడి వల్లనే ఘనంగా జరుపుకుందాము అని సంబరాలు చేసుకోవడం చూసి అమ్మా అక్కయ్యలు మురిసిపోయారు .

 బాబు మహేష్ రేపు ఉదయం ప్రక్క ఊరిని మొత్తం జాతరకు ఆహ్వానించడానికి వెళ్లబోతున్నాము రెడీగా ఉండమని పెద్దయ్య చెప్పినట్లుగానే నెక్స్ట్ రోజు ఉదయం తెల్లవారునే లేచి అక్కయ్యతో స్నానం చేయించుకుని బూస్ట్ టిఫిన్ చేసి రెడీగా ఉన్నాను .
బయట ట్రాక్టర్స్ సౌండ్ వినిపించడం కృష్ణగాడు రేయ్ రేయ్ రెడీనా అంటుపరిగెత్తుకుంటు రావడం , వెనుకే పెద్దయ్య వచ్చి బాబు మహేష్ రెడీగా ఉన్నావు . 
అక్కయ్యా వెళ్ళొస్తాను అని హత్తుకొని , అమ్మా అక్కయ్య జాగ్రత్త అనిచెప్పాను . 
రేయ్ మనం వచ్చేవరకూ మా అమ్మకూడా ఇక్కడే ఉంటుంది నువ్వు రారా అని కృష్ణగాడు పిలిచాడు . 
బై అక్కయ్యా .........అని బుగ్గపై ముద్దుపెట్టి , లవ్ యు రా మంచిపనిచేశావు అని చేతులను కలిపి బయటకు వచ్చిచూస్తే ఊరిలోని మగవాళ్ళంతా వరుసబెట్టి ట్రాక్టర్లలో ఉన్నారు .

అందరూనా...........సూపర్ అయితే అని వెళ్లి అందరితోపాటు ఒక ట్రాక్టర్లో ఎక్కి కూర్చున్నాము . 
మహేష్ ముందుకు వెళ్లి కూర్చో నీడ ఉంటుంది అని అన్నయ్యలు చెప్పారు . 
అందరిలానే నేను అని ఉత్సాహంగా వాళ్ళ మధ్యనే కూర్చున్నాను . 
నామాటలకు మరింత ఉత్సాహంతో కేరింతలు వేస్తూ కాంచన అక్కయ్య ఊరికి చేరుకుని మొదట కవితక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆగి గౌరవంగా కలిసి జాతరకు తప్పకుండా ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు . 
అంతే ఆయన ఆనందానికి అంతులేనట్లు పెద్దయ్యను కౌగిలించుకుని తప్పకుండా వస్తాము అని బదులివ్వడంతో , మా ఊరివాళ్ళ ఆనందం రెట్టింపు అయ్యింది . 

 అందరూ ఒక్కొక్క ఇంటికి వెళ్లి గౌరవంగా జాతరకు ఆహ్వానించండి అని పెద్దయ్య చెప్పడంతో వెళ్లారు . 
చైర్మన్ గారు పెద్దయ్యతో మాట్లాడుతోంటే ,కవితక్క వచ్చి తమ్ముళ్లూ అంతవరకూ నా రూంలో కూర్చుందాము రండి అని చెయ్యి అందుకొని పిలుచుకునివేలుతూ అమ్మా తమ్ముళ్లకు ఐస్ క్రీమ్ , స్నాక్స్ ..........ఇంకా ఏమేమి ఉంటే అన్నింటినీ పైన నారూమ్లోకి తీసుకురా అని ఆర్డర్ వేసి రూంలోకి పిలుచుకొనివెళ్లి తన బెడ్ పై కూర్చోబెట్టి నా ముందు కూర్చుని , తమ్ముడూ ..............రోజూ నిన్ను చూడాలని ఆశ కానీ తీరదు అని చేతులను అందుకొని ముద్దుచేస్తూ మురిసిపోతోంది .

ఇంతలో అమ్మ అన్నింటినీ తీసుకువచ్చి మహేష్ అన్నీ తినాలి అని మాప్రక్కనే బెడ్ పై ఉంచింది . 
అమ్మా ..........ఇందాకనే ఇంట్లో అమ్మ కడుపునిండా తినిపించింది . 
తమ్ముడూ ఈ అక్కయ్య తినిపిస్తే తినవా అని క్రిష్ణగాడికి పెద్దది అందించి నాకు స్పూన్ తో తినిపించి ఆనందించింది . 
మ్మ్మ్.........బాగుంది అక్కా ఆ..... ఆ ........అని మొత్తం తిని ఇక చాలు అక్కయ్యా please అన్నాను . 
సరే అన్నింటినీ ఒక కవర్లో ఉంచుతాను ఇంటికి తీసుకెళ్లి ఆకలి వేసినప్పుడు తిను అని నన్ను ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకొని బుగ్గలపై మార్చి మార్చి ముద్దులుపెట్టి మురిసిపోతోంది . 

అక్కయ్యతో గంట సమయం క్షణాల్లో గడిచిపోయింది . పెద్దయ్య అంకుల్ ద్వారా కబురుపంపడంతో , అక్కయ్య ప్చ్ ..........అని బాధపడి ముద్దులతో ముంచెత్తి అక్కయ్యను ఆడిగానని చెప్పు అని చెయ్యిపట్టుకొని బయటవరకూ వదిలి కవర్ అందించి టాటా చేసింది . 
బై అక్కయ్యా ..........అనిచెప్పి పెద్దయ్యతోపాటు కాంచన అక్కయ్య ఇంటికివెళ్లి అమ్మను అంకుల్ ను అక్కయ్యా అమ్మ కూడా ఆహ్వానించినట్లు చెప్పాను . 
వస్తాము తమ్ముడూ కాసేపు ఉండొచ్చుకదా ..........
అక్కయ్యా , అమ్మా ఎదురుచూస్తుంటారు అని చెప్పడంతో ,
అవునవును అది నిన్ను చూడకుండా ఉండలేదు అని ముద్దులుపెట్టి రూంలోనుండి చాక్లెట్ లు తీసుకొచ్చి అందించి ట్రాక్టర్ వరకూ వదిలారు .
బై అక్కయ్యా ...........అనిచెప్పి పెద్దయ్య ద్వారా ఎక్కడంతో ట్రాక్టర్ కదిలింది . 

అక్కయ్యకు అమ్మకు ఒక్కొక్కటి ఉంచుకుని కవర్లోని అన్నింటినీ అంకుల్ , అన్నయ్యలకు ఇచ్చాను . సంతోషంతో తిన్నారు . 

ఇంటికి చేరుకోగానే అమ్మా అక్కయ్య బయటే మాకోసం ఎదురుచూస్తూ నాన్నా ...........మీ సునీతక్క కుటుంబాన్ని ఆహ్వానించడానికి వెళదాము అని చెప్పడం పెద్దయ్య విని , అమ్మా ఊరితరుపున వారిని ఆహ్వానించాలి ఎలాంటి ఆతిధ్యం ఇచ్చారు ఎప్పటికీ మరిచిపోను అని ఒక ట్రాక్టర్ నిండు జనంతో టౌన్ కు బయలుదేరాలి అని కేకవేశారు . 
అక్కయ్యా ..........నేను కృష్ణగాడు ట్రాక్టర్లో వస్తాము మీరు ముందువెళ్లండి అని చెప్పి వెనుకే ట్రాక్టర్లో సునీతక్క ఇంటికి చేరుకుని పెద్దయ్యతోపాటు లోపలకు వెళ్లి మొదట పెద్దయ్య , తరువాత అమ్మ జాతరకు తప్పకుండా రావాలని ఆహ్వానించారు .

అమ్మ మాతోపాటు బయట ఉన్న అందరికీ టీ పెట్టడంతో , సునీతక్క అక్కయ్యతోపాటు మమ్మల్ని బెడ్రూం లోకి లాక్కెళ్లి తమ్ముళ్లూ ఐస్ క్రీమ్ తింటూ ఉండండి అని బెడ్ పై కూర్చోబెట్టి అందించింది . 
మళ్ళీనా ..........అని ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుంటుంటే , సునీతక్క ముద్దుపెట్టి అక్కయ్యను మానుండి దూరం తీసుకెళ్లి ఈ సెలవుల్లో ప్లాన్ చెయ్యవే ఎలాగైనా please please వె అర్థం చేసుకో అని బుగ్గలను తాకి బ్రతిమాలుతోంది . 
అక్కయ్య ఆపకుండా నవ్వుతూ నో నో నో ..........అని బదులిస్తోంది .
ఇంతలో అమ్మ టీ , మాకు కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చింది . 
అమ్మా ఈరోజుకైతే మావల్ల కాదు అని ఉదయం నుండి తిన్నది చెప్పడంతో అమ్మ నవ్వుకుని సరే అంది . 
ఏంటే వాసంతి నో అంటున్నా అలా బ్రతిమాలుతున్నావు .
ఒసేయ్ అమ్మా టీ అక్కడ ఉంచి వచ్చిన అతిథులను చూసుకోపో అని రూమ్ నుండి బయటకు తోసేసి , మళ్లీ బ్రతిమాలుకోవడం మొదలెట్టింది . 

అక్కయ్యను ఎంతకీ వదలకపోవడంతో , ఇప్పటికి తప్పించుకోవడానికి సర్లేవే వీలైతే చూద్దాము అని చెప్పింది . 
లవ్ యు లవ్ యు sooooooo మచ్ అంటూ మాటల్లో చెప్పలేని సంతోషంతో కౌగిలించుకుని , పరుగునవచ్చి నా ప్రక్కనే కూర్చుని , తమ్ముడూ మీ అక్కయ్య పర్మిషన్ ఇచ్చింది నా అంత అదృష్టవంతులు ఈ భూమి మీద లేరు అని నన్ను చుట్టేసి బుగ్గను కొరికేసింది . 
స్స్స్..........అక్కయ్యా ..........
Sorry sorry ...........తమ్ముడూ అని కొరికిన చోట ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉంది.
అమ్మ రూంలోకివచ్చి సునీత సెలవులు కాబట్టి కాస్త ముందుగానే వచ్చేయి , నీ తమ్ముణ్ణి వదిలి ఉండలేకపోతున్నావు కదా అని చెప్పింది . 
అలాగే అమ్మా జాతర చూడటంతోపాటు చాలా పని ఉంది తమ్ముడితో అని మళ్ళీ బుగ్గను కొరికేసింది . 

తమ్ముడిని వదిలితే ఇక వెళతాము అని టాటా చెప్పి ఊరికి చేరుకున్నాము.

ట్రాక్టర్ దిగి పెద్దయ్యకు థాంక్స్ చెప్పి ఇంటికి చేరుకుని కృష్ణగాడితోపాటు నలుగురమూ సోఫాలో కూలబడిపోయాము . అక్కయ్యా మరిచిపోయాను మీకు అమ్మకు ఇవ్వమని కవితక్క , కాంచన అక్కయ్యలు బోలెడన్ని చాక్లెట్ లు ఇచ్చారు . మీకోసం ఒక్కొక్కటి ఉంచుకుని ట్రాక్టర్లో అందరికీ పంచేసాను అని అందించాను , కృష్ణగాడికి కూడా. 
మంచిపనిచేశావు తమ్ముడూ .............లవ్ యు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి చాక్లెట్ లు ఓపెన్ చేసి ఇద్దరూ ముందు నాకు తినిపించబోయారు . 
ముందు మా అక్కయ్యా , అమ్మ అని ఒక్కొక్క చేతిని అందుకొని ముద్దులుపెట్టాను . 
అలాగే అని ముందు వాళ్ళు తిని , ఎంగిలి అంటూ మరొకవైపు తినిపించబోతే , తియ్యని కోపంతో చూసి ఆమ్ ...........అంటూ అక్కయ్య కొరికినచోట కొరికి మ్మ్మ్ మ్మ్మ్..........బాగుంది అంటూ తిన్నాను . 
లవ్ యు తమ్ముడూ ..............అంటూ నన్ను ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దుచేస్తూ చాక్లెట్ తింటున్నాము.

 ఊరిలోని అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంటికివచ్చారు .
Hi అక్కయ్యా , hi అక్కయ్యా ..........అని పలకరించి లేవబోతుంటే ,
తమ్ముడూ మిమ్మల్ని వేరుచెయ్యడానికి రాలేదు మీ అక్కయ్య మీదనే కూర్చో మేమేవస్తాము అని ఒక్కొక్కరే నా బుగ్గపై ముద్దులుపెట్టి చాక్లెట్ అందించి సోఫాలో కుర్చీలలో కూర్చున్నారు . 
అమ్మ అందరికీ కాఫీ చేసుకొస్తాను అని వెళ్లారు .
అందరూ వచ్చినందుకు చాలా సంతోషమే అని మురిసిపోతూ నన్ను మరింత గట్టిగా హత్తుకుంది .

రేపటి నుండి నవరాత్రులు మొదలవ్వబోతున్నాయి కదా వాసంతి , ప్రతి సంవత్సరం లానే తెల్లవారకముందే లేచి రెడీ అయ్యి అమ్మవారి గుడిలో ఉన్న బన్ని చెట్టుకు పూజ చేసి రావాలి . 
అవునుకదా 4:30 కల్లా తలంటు స్నానం చేసి బయలుదేరాలి కదూ. తమ్ముడూ .........
వెళదాము అక్కా ............ప్రతి సంవత్సరం వెళుతున్నారుకదా మా అక్కయ్య కోసం 12 గంటలకైనా నేను రెడీ అని బదులిచ్చాను .
మా తమ్ముడు బంగారుకొండ అని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి ఏకమయ్యేలా హత్తుకొని ఆనందిస్తోంది .

తమ్ముడూ కూడా మనవెంట వస్తున్నాడు ...........అని అక్కయ్యాలంతా సంతోషం వ్యక్తం చేసుకుంటుంటే , ఒసేయ్ వాళ్ళు ఇద్దరు కాదే ఒక్కటే అని తెలియదా అని తలపై మొట్టికాయ వేసింది మరొక అక్కయ్య . కదా అని అందరూ సంతోషంగా నవ్వుకున్నాము . అమ్మ కాఫీ స్నాక్స్ తీసుకురావడంతో తాగి తమ్ముడూ , వాసంతి రేపు ఉదయం అందరమూ ఇక్కడి నుండే బయలుదేరుదాము అని మళ్ళీ నాకు ముద్దులుపెట్టి వెళ్లారు . 
రేయ్ విన్నావుకదా రెడీ అయ్యి వచ్చెయ్ అని కృష్ణగాడికి సగం చాక్లెట్ లు ఇచ్చాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 05-04-2020, 06:13 AM



Users browsing this thread: 64 Guest(s)