Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
26/11
#3
28 నవంబరు, తెల్లవారుజాము 2గంటలు, తాజ్ ప్యాలెస్ హోటల్
మానేసర్ నుంచి మూడు విమానాల్లో బ్లాక్‌క్యాట్ కమెండోలు ముంబయి చేరుకున్నారు. అందులో నుంచి 100పైగా కమెండోలను తాజ్ ఆపరేషన్‌లో మోహరించారు. ఆ హోటల్‌లో దాదాపు 600 గదులు ఉన్నాయి. సీసీటీవీ కవరేజ్ దాదాపు డిస్కనెక్ట్ అయ్యింది.
అంతకన్నా ఆందోళనకర విషయమేమిటంటే తాజ్ ప్యాలస్ సిబ్బంది మొత్తం హోటల్ నుంచి బయటికొచ్చేశారు. దీంతో కమెండోల వద్ద అతిథుల జాబితా కూడా లేకపోవడంతో ఎవరు ఏ గదిలో ఉన్నారో వారికి అర్థం కాలేదు.
ప్రతి గదికి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. కానీ తీవ్రవాదులు ఫోన్ చేస్తున్నారేమోనని భయపడి ఎవరూ కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఓ డాటా ఎంట్రీ మహిళా ఉద్యోగి ఫ్లోరిస్ మార్టిస్ ఒక గదిలో చిక్కుకొని ఉన్నారని తెలిసింది.
దీంతో ఎలాగైనా తాను ఆమెను సురక్షితంగా బయటికి తీసుకొస్తానని మేజర్ ఉన్నికృష్ణన్ చెప్పారు. ఆయన తనతోపాటు ఆరుగురు సభ్యులను లోపలి తీసుకెళ్లారు. ఆయన మెట్లెక్కుతూ పైకి వెళ్లారు.
ఆయనతోపాటు వెళుతున్న సునీల్ యాదవ్‌పై కాల్పులు జరిగాయి. ఉన్నికృష్ణన్ ఎడమవైపు కూడా ఎవరో కాల్పులు జరిపారు. ఆయన కుడివైపు నుంచి ముందుకు వెళ్లి కాల్పులు జరిపే వారిని వెనుక నుంచి పట్టుకుందామని అనుకున్నారు. కానీ కాల్పులు జరిపేవారు అక్కడ కూడా ఉన్నారు.
అప్పుడే ఓ బుల్లెట్ ఉన్నికృష్ణన్‌ శరీరంలోకి దూసుకెళ్లింది. వెంటనే ఆయన రేడియో ద్వారా 'ముందుకు రావద్దు' అని హెచ్చరించారు.
అప్పుడు ఆయన వేగంగా శ్వాస తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన వాకీటాకీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మేజర్ ఉన్నికృష్ణన్ 'మిస్సింగ్' అని చెప్పారు. కానీ ఆయనతో అక్కడకు వెళ్లిన సహచరులు కాల్పులు జరిపే వారిని 'వాసాబి రెస్టారెంట్' దగ్గరే ఉండిపోయేలా చేశారు.
"పైకి వెళ్లడానికి రెండు నిమిషాల ముందే నేను మేజర్ ఉన్నికృష్ణన్‌తో మాట్లాడాను. నేను అతనితో 'టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్' అని కూడా అన్నాను. దీనిపై ఆయన 'ఎవ్రీ థింగ్ విల్ బి ఆల్‌ రైట్ ' అని కూడా సమాధానమిచ్చారు" అని బ్రిగేడియర్ గోవింద్ సింగ్ తెలిపారు.
పరిస్థితి అదుపులోకి వస్తుందని మొదటిసారి బ్లాక్‌క్యాట్ కమెండోలకు అనిపించింది. కానీ దానికి బదులుగా మేజర్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని వారు సమర్పించుకున్నారు.
Like Reply


Messages In This Thread
26/11 - by అన్నెపు - 26-11-2018, 11:43 AM
RE: అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ ల... - by అన్నెపు - 26-11-2018, 11:45 AM



Users browsing this thread: 1 Guest(s)