Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కారు ఎక్కుతూ రేయ్ జ్యూవెలరీ షాప్ కు వెళ్ళమని చెప్పింది అమ్మ . 

దగ్గరే అమ్మా అనిచెప్పి డోర్స్ వేసి ఒక్క నిమిషం అనిచెప్పి పరుగునవెళ్లి మూడు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి అందించారు . 

థాంక్స్ అన్నయ్యా ...........అని తింటూ షాప్ చేరుకున్నాము . 

అప్పట్లో తులం బంగారం 6 వేల రూపాయలు మాత్రమే , రాఖీ ఫెస్టివల్ సందర్బంగా తులం పై 500 రూపాయలు డిస్కౌంట్ ఉండటం చూసి లోపలకువెళ్లి ముందు బంగారు ఉంగరాలు , చెవి రింగ్స్ , గాజులు చూసి నాకు ఇష్టమైనవి సెలెక్ట్ చేసాను . 

అమ్మా పట్టీలు ముఖ్యం అనిచెప్పాను . మహేష్ వీటన్నింటి వెల చూసి మిగిలిన అమౌంట్ తో అందమైన వెండి పట్టీలు తీసుకుందాము అని బదులిచ్చింది . 



వాటి వెల 25 వేలు పైనే అవ్వడం నాలుగు వేల దాకా మిగలడంతో నవ్వుకుని పట్టీలు చూపించమని అడిగింది అమ్మ కొన్నింటిని సెలెక్ట్ చేసి నీకు నచ్చినది తీసుకో మహేష్ అనిచెప్పింది . 

అలాగే అమ్మా అని అక్కయ్య పాదాలకు మరింత అందం తీసుకొచ్చే పట్టీలవైపు వేలుని చూపించాను . 

చాలా బాగున్నాయి మహేష్ ...........ఏమీ తెలియదు అనిచెప్పి మీ అక్కయ్యకు మొత్తం నువ్వే సెలెక్ట్ చేసావు , నేను రాకపోయినా సరిపోయేది అని కురులను నిమిరింది . 



 బిల్ పే చేసి , అమ్మా ఈ చీరతోపాటు అన్నింటినీ ఒకటిగా గిఫ్ట్ ప్యాక్ చేయించమని చెప్పాను . దానిపై వాడు వద్దని చెప్పినా మా ఇద్దరి పేర్లు రాయించాను . 

గిఫ్ట్ తీసుకుని అమ్మా ...........అక్కయ్య కంగారుపడుతుంటుంది ఇక వెళదాము అనిచెప్పాను . 

మహేష్ 7 వందలు మిగిలింది అని అన్నయ్య ఇవ్వబోతే , మూడు పిజ్జాలు తీసుకోమని చెప్పాను . 

ఒకటి అక్కయ్యకు , ఒకటి మా అమ్మకు అని కృష్ణగాడి అమ్మను హత్తుకున్నాను , మూడవది పెద్దయ్యకు అనిచెప్పాను . దారిలో తీసుకుని 20 నిమిషాలలో పెద్దయ్య ఇంటికి చేరుకుని ఇద్దరమూ లోపలకువెళ్లి పిజ్జా ఇచ్చి గోది నైట్ చెప్పి కృష్ణగాడి ఇంటికి చేరుకున్నాము . రేయ్ గిఫ్ట్ ఇక్కడే ఉంచు రేపు నేను తీసుకురమ్మన్నప్పుడు తీసుకునివచ్చెయ్ అనిచెప్పి కారు దిగి వాడికి అన్నయ్యకు అమ్మకు గుడ్ నైట్ చెప్పి పరుగున మెయిన్ గేట్ దగ్గరకు చేరుకుని , విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంటిని చూసి ఆశ్చర్యపోయి , అక్కయ్యా అక్కయ్యా ........ వచ్చేసాను అని ప్రేమతో పిలిచాను . అక్కయ్య అంతే ఆతృతతో గుమ్మం దగ్గర వరకూ వచ్చి మోకాళ్లపై కూర్చిని గుండెలపై హత్తుకుంది . 

మా తమ్ముడిని చూసి 14 గంటలు అవుతోంది అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది . 



నేను మాత్రం మా అక్కయ్యను కొన్ని గంటల ముందే చూసేసాను అని సంతోషన్గా చెప్పాను .

అప్పుడు కారులో ..............మీరే కదా ............

అవునక్కయ్యా ..........కారులోనే వెళ్లి కారులోనే వచ్చాము . మాకోసం కారుని పంపించారు అనిచెప్పాను .

మరి నా తమ్ముడు ఊరంతటికీ బుజ్జి దేవుడు కదా అని మురిసిపోయింది .

అక్కయ్యా ............. ఇంటికి కొత్త శోభ వచ్చింది . 

ఇప్పుడేమీ చూశావు తమ్ముడూ రేపు చూస్తావుకదా ............ 365 రోజులలో వందలాది పండుగలలో నాకుమాత్రం రేపు అత్యంత పవిత్రమైన పండుగ అని ప్రాణంలా గుండెలపై హత్తుకొంది . 



అమ్మ బయటకువచ్చి అక్కయ్య మాటలువిని సంతోషంతో నాకు కూడా .......నా ప్రాణం కంటే ఎక్కువైన బంగారాలు జరుపుకునే పండుగ అని ఇద్దరికీ ప్రేమతో ముద్దులుపెట్టి , తల్లి బయట చలిగా ఉంది లోపలకు వచ్చి తలుపేసి మీఇష్టం అని చెప్పడంతో ,

లవ్ యు అమ్మా ..........అని లోపలకువచ్చి అక్కయ్య డోర్స్ వేసి లాక్ చేసేసింది . 

అమ్మా వొళ్ళంతా ఏదోలా ఉంది స్నానం చేయించు అనిచెప్పాను . 

ఇక అమ్మ ఆనందానికి అవధులు లేవు . ముగ్గురమూ పైకివెళ్లి లోచెడ్డీతో మాత్రమే బాత్రూమ్లోకి వెళ్ళాను .



తమ్ముడూ సూపర్ కొరుక్కుని తినేస్తాను అని ఆడ చిరుతలా నోటితో సైగ చేసింది . 

 అమ్మా ........అంటూ సిగ్గుపడుతూ వెళ్లి చిరునవ్వులు చిందిస్తూ అమ్మ అక్కయ్యలకు ముద్దులుపెడుతూ ఒంటిపై రెండు రోజుల మట్టి చెమట ఎగిరిపోయేలా శుభ్రన్గా స్నానం చేయించారు.

అక్కయ్యను అమ్మను బయటకు గెంటేసి చెడ్డీ తీసేసి నీళ్లు పోసుకుని టవల్ తో తుడుచుకుని నైట్ డ్రెస్ వేసుకుని బయటకువచ్చాను . 

తమ్ముడూ డ్రెస్ ఎప్పుడు తీసుకున్నావు .........ప్చ్.........అని నిరాశతో ప్రక్కనే కూర్చోబెట్టుకొని కురులను మరొక టవల్ తో తుడిచింది . 

నాకు తెలుసు అక్కయ్యా ...........అందుకే లోపలే వేసుకున్నాను అని తియ్యదనంతో నవ్వుకున్నాను . 

అయినా రాత్రి కి నా ఇష్టం కదా అప్పుడు ఎలా ఆపుతావో చూస్తాను అని బుగ్గని కొరికేసింది .



అమ్మా .........స్స్స్ ........అని అరిచాను . 

వచ్చేసాను నాన్నా ............కొరికేసిందా అని అక్కను కొట్టబోయి , మరొక ప్రక్క కూర్చుని మరొకవైపు బుగ్గను కొరికేసింది . 

షాక్ లో నోరుతెరిచి మోసం అని రెండు బుగ్గలనూరుద్దుకుంటుంటే ,

మరి ఏమిచెయ్యమంటావు నాన్నా ............నీ బుగ్గలు అలా ఉన్నాయి మరి అని నవ్వుతూ కొరికిన చోట ప్రేమతో ముద్దులుపెట్టి , 

నాన్నా ............రేపటి కోసం మీ అక్కయ్య నీకు 5 డ్రెస్ లు తీసుకొచ్చింది చూడు అని బెడ్ పై పరిచింది . 

సూపర్ అధిరిపోయాయి , లవ్ యు అక్కా...........అని గట్టిగా హత్తుకున్నాను . మరి మా అక్కయ్యకు అని అడిగాను . 

అమ్మా నాకు చాలా కొత్తవి ఉన్నాయి , నా డ్రెస్ కొనే డబ్బులతో తమ్ముడికే తీసుకో అని మొత్తం 5 తీసేసుకుంది . అయినా సరే మీ అక్కయ్యకు తీసుకుందామని పర్సు చూస్తే డబ్బు ఇంట్లోనే మరిచిపోయాము అని తెలుసుకున్నాము . అంతకు ముందే రేపటి decoration కోసం చాలా కొనేసాము అని బదులిచ్చింది . 



కళ్ళల్లో చెమ్మతో అక్కయ్యను హత్తుకున్నాను . 

నా తమ్ముడు కొత్తబట్టలు వేసుకుంటే నేను వేసుకున్నట్లు కదా అని ప్రాణంలా గీన్డేలపై హత్తుకొని నుదుటిపై పెదాలను తాకించింది .

తల్లి ............నువ్వు అంత ప్రేమ చూపిస్తే ఓడిలోనే నిద్రపోతాడు . తిన్నాక మీఇష్టం ఉండండి అని డ్రెస్ లు మడతపెట్టి , కిందకువెళ్లి ప్లేటులో తీసుకొచ్చి ప్రేమతో తినిపించి నీళ్లు తాగించి వెంటనే పడుకోవద్దు కాస్త అటూ ఇటూ తిరిగి పడుకోండి అనిచెప్పి అమ్మ గుడ్ నైట్ కిస్ పెట్టి , పొద్దున్నే తొందరగా లేచి అన్నీ రెడీ చేసి పూజ చేయాలి అని వెళ్ళిపోయింది.



నాకోసం అక్కయ్య తనకు ఎంతో ఇష్టమైన రోజుకు కొత్తబట్టలు తీసుకోకుండా మొత్తం నాకే తీసుకొచ్చి సంతోషింస్తోంది అని అక్కయ్యను ప్రాణంలా హత్తుకొని బాధపడుతూ , కొత్త చీర గిఫ్ట్ ఇవ్వబోతున్న విషయం గుర్తుకువచ్చి , దేవుడా ఇదంతా మీరు ఆడుతున్న నాటకం కదూ .........., నాచేతులతో మా అక్కయ్య అదే నా ప్రాణమైన దేవతకు చీరను గిఫ్ట్ గా ఇచ్చేలా ప్లాన్ చేశారు , ఇక అప్పుడు అక్కయ్య ఆనందానికి అవధులే ఉండవు . God is great అని మనసులో అనుకుని పెదాలపై చిరునవ్వుని చిందించాను .



హమ్మయ్యా ..........నవ్వావా .........ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉంది తమ్ముడూ ...........లవ్ యు లవ్ యు soooooo మచ్ అని హత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది . 



ఆ ముద్దుల మాధుర్యానికి మత్తుగా మైకం కమ్మేస్తోంది . రెండు రోజులపాటు తెల్లవారకముందే లేచి పొలాల్లో కష్టపడటం వలన అలసిపోయినట్లు అక్కయ్యా నిద్రవస్తోంది అని కళ్ళు మూతలు పడుతున్నట్లు చెప్పాను . 

తినగానే పడుకోరాదు అని అమ్మ చెప్పింది కదా ...........రా అలా కారిడార్ లో కొన్ని రౌండ్స్ వేద్దాము నా మంచి తమ్ముడు కదూ అని లేచి హత్తుకొని నడిపించుకుంటూ తిప్పి , నీళ్లు తాగించి బాత్రూమ్లోకి వదిలి , నిద్రమత్తులో అడుగులువెయ్యడం చూసి తియ్యగా నవ్వుకుని రాగానే బెడ్ పై పడుకోబెట్టి భుజాలవరకూ దుప్పటి కప్పి AC on చేసి లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి దుప్పటిలోకి దూరిపోయి వెనుక నుండి హత్తుకొని గుడ్ నైట్ తమ్ముడూ హాయిగా నిద్రపో అని బుగ్గపై వెచ్చని ముద్దుపెట్టింది.

మ్మ్మ్........గుడ్ నైట్ అక్కయ్యా .........అని చేతిని నా గుండెలపై రెండుచేతులతో పట్టుకుని నిద్రలోకి జారుకున్నాను . 



అదే చేతితో జోకొట్టి ముద్దులుపెడుతూ అక్కయ్యకూడా నిద్రపోయింది.

******************



అక్కయ్య సడెన్ గా మేల్కొని సమయం చూస్తే 5 గంటలు అయ్యింది. నేనేంటి ఇంకా పడుకున్నాను .......... ఇలాంటి రోజుకోసం నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎదురుచూస్తున్నాను . ఈ రాఖీ పండుగను ఇన్ని సంవత్సరాల బాధను మరిచిపోయి ఇక నుండి సంతోషన్గా జరుపుకునేలా అద్భుతమైన ఏర్పాట్లు చెయ్యాలి అని మనసులో అనుకుని పెదాలపై చిరునవ్వుతో మురిసిపోయింది .



రెండురోజులపాటు కష్టపడటం వలన అలసిపోయి ఘాడంగా నిద్రపోతున్న నా కురులను ప్రేమతో స్పృశిస్తూ నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , తమ్ముడూ నీవలన మీ అక్కయ్య జీవితంలో తొలిసారి రాఖీ సెలబ్రేట్ చేసుకోబోతోంది అని రాఖీ శుభాకాంక్షలు తమ్ముడూ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది .

మ్మ్మ్.........అక్కయ్యా .........అంటూ అక్కయ్యవైపు తిరిగి గుండెలపై గువ్వపిల్లలా వొదిగిపోయాను . 

అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని ఆనందబాస్పాలతో ఒక తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు తెలిపితే ఇంత పారవశ్యం కలుగుతుందా అని నా ముఖమంతా ముద్దులతో ముంచేసి పరవశించిపోయింది . 

తమ్ముడూ ......... నువ్వు సంతోషంతో ఆశ్చర్యపోయేలా ఏర్పాట్లు చెయ్యాలి నువ్వు హాయిగా నిద్రపో అనిచెప్పి భుజాలవరకూ దుప్పటి కప్పి బుగ్గపై గుడ్ మార్నింగ్ కిస్ పెట్టి బాత్రూమ్లోకివెళ్లి బ్రష్ పై పేస్ట్ అంటించుకొని పళ్ళుతోముకుంటూ కిందకువచ్చింది.



అప్పటికే అమ్మ లేచినట్లు వంట గదిలో స్పెషల్ వంటకాల ప్రిపరేషన్ పనిలో పడిపోయింది . సోమయ్య మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఇంటి బయట రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు .

వంట గదిలోకివెళ్లి అమ్మను వెనుక నుండి హత్తుకొని నోట్లో బ్రష్ తోనే లవ్ యు అమ్మా .........అనిచెప్పి ,హాల్ లోకివచ్చి జర్కీన్ వేసుకుని బయటకు వెళ్లి చూసి wow అంటూ రెండుచేతులతో నోటిని మూసుకుని సంతోషంతో పొంగిపోతోంది .



సోమయ్యా ............ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అక్కయ్య అడిగింది .

 పెద్ద అమ్మగారు 3 గంటలకే రమ్మని నిన్నే చెప్పారు అమ్మగారు , మేము వచ్చేటప్పటికి అమ్మగారు లేచి ఉన్నారు . ఈ పూలన్నీ మన తోటలోనివే ......ఇదేమి చూసారు అమ్మగారు లోపల దీనికంటే అధిరిపోవాలి అని అమ్మగారు చెప్పారు . మరికొద్దిసేపట్లో బయట మొత్తం పూర్తి అయిపోతుంది వెంటనే లోపాలకువచ్చి 7 గంటలకల్లా మొత్తం పూర్తి చేసేస్తాము మీరు నిశ్చింతగా ఉండండి అనిచెప్పాడు .



పట్టరాని సంతోషంతో గుమ్మంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా పరుగున వంట గదిలోకివెళ్లి మా అమ్మ బంగారం అంటూ ప్రాణంలా హత్తుకుంది . 

అమ్మ వెనుకకు తిరిగి అక్కయ్య బుగ్గలను అందుకొని ఈ రోజు కోసం నా బంగారుతల్లి ఎన్ని సంవత్సరాల నుండి ఎదురుచూస్తోందో నాకు తెలియదా ....... అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , నీ ముద్దుల తమ్ముడు లేచాడా అని అడిగింది.

లేదమ్మా ............గువ్వపిల్లలా వొదిగిపోయి హాయిగా నిద్రపోతున్నాడు , నేను లోపల decoration ఎక్కేక్కడ చెయ్యాలో చూపిస్తాను అని బుగ్గపై ముద్దుపెట్టి హాల్ లోకి వచ్చింది .



అంతలో వాళ్ళు పెద్ద మొత్తంలో పూలు లోపలికి తీసుకొచ్చారు . 

సోమయ్యా ............ఇక్కడ హాల్ మధ్యలో రాఖీ కట్టేది కాబట్టి ఇక్కడ పూలతో అలంకరించండి . నిన్న టౌన్ వెళ్లి decoration వస్తువులను తీసుకొచ్చాము వాటితో ఇలా ఇలా అంటూ చుట్టూ ఎక్కేక్కడో చూపించి అందంగా అలంకరించండి అని బ్యాగులను తెచ్చిచ్చి దగ్గరుండి చూసుకుంటోంది . 



అప్పుడే ఊరి నుండి వచ్చిన నాన్న ఇల్లుమొత్తం విద్యుత్ కాంతులతో పూలతో పచ్చని మామిడాకుల తోరణాలతో వెలిగిపోతుండటం చూసి లోపలకు వచ్చి వాసంతి ఏంటి ఏమైనా ఫంక్షనా అని అడిగారు . 

నాన్న ఈరోజు రాఖీ పండుగ అందుకే ఈ arrangements .

వాసంతి రాఖీ పండుగ అంటే నీకు ఇష్టం లేదు కదా ......... ఈరోజు అసలు రూంలో నుండి బయటకు వచ్చేదానివి కాదు అని అడిగారు .

అవును నిజమే నాన్న అప్పుడు వేరు ఇప్పుడు వేరు , ఇపుడు మన ఇంటికి బుజ్జి తమ్ముడు వచ్చాడుకదా ..........తొలి రాఖీ పండుగ ఇన్నాళ్ల బాధను నా బుజ్జి తమ్ముడికి ప్రాణంలా రాఖీ కట్టి అక్కయ్య తమ్ముడూ అనే మధురమైన బంధానికి ప్రాణం పోస్తాను అని బదులిచ్చింది .

తమ్ముడు అని అక్కయ్య పలుకగానే ఇష్టం లేనట్లు నాన్న మాట కూడా మాట్లాడకుండా రూంలోకి వెళ్లిపోయారు.

అక్కయ్య అదేమీ పట్టించుకోకుండా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది . గంట తరువాత నాన్న ఫ్రెష్ అయ్యి నేరుగా వంట గదిలోకివెళ్లి కాస్త కోపంతోనే బయటకు వెళ్లిపోబోతుంటే , అమ్మ వెనుకే వచ్చి ఏమండీ ఇప్పుడే కదా వచ్చారు . తల్లి తన జీవితంలో తొలి రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆశపడుతోంది . ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అడిగింది .

అది చూడలేకే వెళ్లిపోతున్నాను అని గుసగుసలాడి , ముఖ్యమైన పని ఉంది గుంటూరులో వెళ్ళాలి , అలాగే సాయంత్రం హైద్రాబాద్ వెళుతున్నాను బ్యాగు రెడీ చేసి ఉంచు అనిచెప్పి మరొక్కమాట కూడా వినకుండా వెళ్లిపోయారు . 



తల్లి ............ ,

అమ్మా నేనైతే ఈరోజు బాధపడను . నాన్నకు మొదట నుండి తమ్ముడు అంటే ఇష్టం లేదు . జరుగబోవు సంతోషాన్ని కోపంతో చూడటం కంటే వెళ్లిపోవడం మంచిది . ఈ విషయం తమ్ముడికి అస్సలు తెలియకూడదు అనిచెప్పి సోమయ్యా .......మీరు కానివ్వండి అనిచెప్పింది . 

హమ్మయ్యా .........నా తల్లి ఎక్కడ బాధపడుతుందో అని కంగారుపడ్డాను . మీ నాన్న లేకపోతేనేమి సంబరంలా జరుపుకుందాము . ఇక్కడ ఏర్పాట్లు రెడీ అయ్యేలోపు నీ బుజ్జి తమ్ముడు లేచాడో లేదో చూసి నువ్వు తల స్నానం చేసిరా , నీ తమ్ముడు ఎల్లప్పుడూ సంతోషన్గా ఉండేలా ఈరోజు నువ్వే పూజ చెయ్యి అనిచెప్పింది .

లవ్ యు అమ్మా ........అని సంతోషంతో కౌగిలించుకుని పైకి వచ్చింది .



నేను ఇంకా పడుకునే ఉండటం చూసి , హమ్మయ్యా .........నాన్న మాటలు వినలేదు అని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి టవల్ అక్కయ్యకు ఇష్టమైన లంగా ఓణి తీసుకుని బాత్రూం లోకి వెళ్ళి తలంటు స్నానం చేసి బట్టలు వేసుకుని అందంగా అలంకరించుకొని కిందకువచ్చి చూసి సంభ్రమాశ్చర్యాలతో అలా చూస్తుందిపోయింది. అమ్మా అమ్మా అమ్మా .........అని సంతోషంతో కేకలువేసి వెంటనే నాకు ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని నోటిని మూసేసి సూపర్ అంటూ వేళ్ళతో సైగ చేసి ఎగిరి గెంతులేసినంత పనిచేసింది . 

 దేవకన్యలా ఉన్నాఅవు తల్లి లంగా ఓణీలో , ఈ సంతోషం చూడటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది తల్లి అని పరవశించిపోయి దిష్టి చుక్క పెట్టి , తల్లి పూజ గదిలో అన్నీ రెడీగా ఉన్నాయి పూజ చెయ్యి అనిచెప్పింది .



అమ్మా తమ్ముడు ఇంకా లేవలేదు అనిచెప్పింది . 

లేవగానే రాఖీ కట్టాలి కదా కాబట్టి భక్తితో పూజ జరిపించి హారతిని హాయిగా నిద్రపోతున్న నీ ప్రాణానికి ఇవ్వు అని బుగ్గలను ప్రేమతో స్పృశించి చెప్పింది .

అలాగే అమ్మా లవ్ యు అని హత్తుకొని చిరునవ్వులు చిందిస్తూ పూజ గదిలోకివెళ్లి పూలతో దేవుళ్ళ ఫోటోలను పూలతో అలంకరించి కుంకుమ పెట్టి నా తమ్ముడు ఇలాగే ఎప్పుడూ సంతోషన్గా ఉండాలి అని ప్రార్థించి పూజ జరిపించి హారతిని నేరుగా పైకి తీసుకెళ్లి పడుకున్న నాకు చేతితో తలపై స్పృశించి కిందకువచ్చి అమ్మకు ఇచ్చింది . 

హారతిని పూజ గదిలో ఉంచి సమయం 8 గంటలు అవుతుండటం చూసి ఆనందంతో చేతులు కాళ్ళు ఆడనట్లు , రాఖీ కట్టడానికి ఏమేమి అవసరమో అమ్మను పదే పదే అడుగుతూ అటూ ఇటూ తిరుగుతూ అన్నింటినీ తీసుకెళ్లి పూలతో అలంకరించిన సెట్ లోపల టీ టేబుల్ ఉంచి దానిపై ఉంచింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-02-2020, 10:35 AM



Users browsing this thread: Shiva@123, 67 Guest(s)