Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#26
కొన్ని ఏరియాల్లో కొన్ని అలవాట్లు ఉంటాయి.
ఒక X గారు లేవగానే మౌత్ వాష్ వేసుకుని బ్రష్ చేసుకోవడం అయిపోయిందని పిస్తాడు. ఇంకొకడు బ్రష్ చేసుకుంటాడు. అయితే ఊర్లో వేప పుల్ల లేదా కానుగ పుల్ల తీసుకుని నోరు కడుకుంటారు. వాళ్ళ బాషా వాళ్ళ జీవనం వేరుగా ఉంటుంది.
ఈ ముగ్గురూ ఒకే లాంటి కథ చెప్పమంటే ఒకేలా చెప్పలేరు. 

x గారు ఢిల్లీ నుండి వచ్చిన వారు. ఆయనని కథ చెప్పమంటే....అపార్టుమెంట్లో అంటూ స్టార్ట్ చేస్తాడు. బాగా బలిసిన వాడి పద్దతి వేరు., లేవగానే షార్ట్ వేసుకుని అంటూ మొదలు పెడతాడు. వాడు షార్ట్ వేసుకుంటాడో షాట్ వేసుకుంటాడో ఆ దేవుడికే ఎరుక.

ఇంకొకడు బ్రష్ చేసుకునే వాడు; వాడు కథ మొదలు పెడితే....బ్రష్ మీద ఉన్న పేష్టులో కొంచెం వేసుకుని వాష్ బేసిన్ ముందు అద్దంలో చూసుకుంటూ ఐదు నిముషాలు బ్రష్ చేసుకుని అంటూ మొదలు పెడతాడు.

లాస్ట్ వ్యక్తి ఆంధ్రా అనుకుందాం. పందెం పుల్ల ఏడుంది మామా చెట్టెక్కి నాలుగు కొమ్మలు కొట్టుకోరాదు. ఆడ పిల్లాడికి పాలుగావాల్నంట బేగి పోయి పాలు పిండి తీస్కరా...నోట్లో పుల్ల పెట్టుకుంది సాలు గానీ....బఱ్ఱెలు సాఫ్ చెయ్యి మావా...ఇలా ఉంటుంది.

అంటే....కథ కూడా సగటు ప్రేక్షకుడికి, సగటు ప్లస్ ప్రేక్షకుడికీ, above average, చదువుకున్నవాడికీ అంటూ ఉంటుంది. అందువల్ల కథ అందరికీ ఆదరణ పొందాలని లేదు. అది తెలిసీ మొదలు పెట్టిన కథ మళ్ళీ వ్రాయలేరు. 

ఇంకకడి సంగతి Mr. Perfect, కథని తప్పులు లేకుండా వ్రాసేవాడు. అందులో వాసి ఉండదు రాశి మాత్రమే......అది వాడికి అర్ధమయ్యే సరికి...., Mr. పర్ఫెక్ట్ గొట్టం గాడు అందులో పుల్లలు పెట్టడం వాడి పని. వాడి పని స్టార్ట్ చేస్తాడు.
Note: నేను వ్రాసే కథల్లో కూడా రాశి తప్పా వాసి ఉండదు.

ఇంకో గొట్టంగాడు, వాడు' బాగున్న కథలు దోలాడి వాటిని కంటిన్యూ చేస్తాడు. అది ఏ మహానుభావుడికో నచ్చదు. అందువల్ల దెంగులు దెంగుతారు. దాంతో మొడ్డ ముడుచుకుని కథని ఆపేస్తాడు. ఇదీ ఒక కారణం

మా ఫ్రెండ్ పద్మాలయా., అన్నపూర్ణా స్టూడియోస్ లాంటి వాటి వాళ్లకి tax మేటర్స్ చూస్తాడు. ఈయనకి అక్కడ చాలా గౌరవం ఉంటుంది. అందుకని హీరోయిన్ ల రూమ్స్కి వెళ్ళి రాగలిగే చనువు ఉండేది. అంటే అంతకన్నా ఎక్కువ expect చేయలేము. ఆటను చెప్పిన కథలు అక్కడ విన్నవి అన్నీ మనకు చెప్పినా ఆ కథలని మనకు తెలిసినట్లు వ్రాయగలము. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది కాబట్టి.

మా ఫ్రెండ్ చిన్నప్పుడు కాలువలో కొట్టుకుపోయాడు. కొన్ని రోజుల నెలల తరువాత మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కి దొరికాడు. అప్పటికే వాడు కాలువలో కొట్టుకుపోయి పొయ్యాడు అనుకున్నారు. 

వాడికి మళ్ళీ 16 ఏళ్ళ సమయంలో మళ్ళీ కాలువలో పడి కొట్టుకు పొయ్యాడు. ఈ సారి అతని లైఫ్ మారిపోయింది. అప్పటి వరకూ అంత ఎత్తులో ఉన్నవాడు కాస్తా...బికారి అయిపోయాడు. మిల్లులో వాళ్ళ నాన్న పని చేస్తూ....వాళ్ళ కుటుంబాన్ని పోషించాడు. ఇక్కడ వాడికి పెళ్లి జరిగింది కూడా మా క్లాసుమేట్ కళ్యాణితో.....తాను మాకు 8th లో క్లాస్మెట్. స్కూల్ తరువాత తన సంగతి నాకు తెలుసు, ఆమె అనుభవాలు నాకు తెలుసు. కానీ మా ఫ్రెండ్ గాడికి చెప్పలేను. అదీ నా బాధ. ఇలాంటి నిజాలు వ్రాయాలంటే....కథ కన్నా కథాసారం స్క్రీన్ ప్లే ముఖ్యం. అప్పుడే కథ సక్సెస్ అవుతుంది. కానీ ఇలాంటి కథని ఎవ్వరూ ఆదరించరు. 
ఇప్పుడు చెప్పండి ఇన్ని మూళ్ళ మధ్య గులాబీని కొయ్యడం ఏ విధంగా సాధ్యం., అలానే మిగిలిన పూలన్నీ గులాబీలు అవ్వచ్చు కాకపోనూ అవ్వచ్చు. అన్ని గులాబీలూ ముళ్ళ మధ్యన ఇరుక్కుని ఉండకపోవచ్చు.

వారి వారి ఇంటి పరిస్తితులూ.......అనుభవాలు., జీవితం అన్నీ సహకరించకపోవచ్చు.

నాకు ఒక అక్క ఒక అన్నయ్యా., ఒక తమ్ముడు., మా అక్కకి వివాహం జరిగి ఒక పాప ఆమెకి మానసికంగా బాగుండదు. తనని మా ఇంట్లో వదిలి వేసి US వెళ్ళిపోయింది. మా మేనకోడల్ని మేమె చూస్తూ ఉండాలి. తన కోసమే నేను వివాహం చేసుకోలేదు. అనారోగ్యం తగ్గుతుందో లేదో తెలియదు. నాకు డిపార్ట్మెంట్ ఇచ్చే మెడికల్ అసిస్టెన్స్ ఏమీ ఉండదు. ప్రతి రూపాయీ నేను జాగ్రత్త పడవలసి ఉంటుంది. అయినా నేను అందరికీ హెల్ప్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. అది జాతకాలు కావచ్చు; వేరే విధంగా అయినా సరే మధ్యలో కథలు ఒక వ్యాపకం మాత్రమే....కానీ నాకు కూడా టార్చెర్ కామన్. నేను కూడా అతీతం కాదు.

ఈ మధ్యలో ఒకే కులం వాడో మతం వాడో అమ్మాయిలకి ఆరాద్యుడవుతాడంటూ కథలు వ్రాసే వాళ్ళు గుప్పిస్తూ ఉంటారు. నిజానికీ, వాస్తవానికి దూరంగా ఉండే ఈ విషయాల వల్ల మనసు చాలా దెబ్బతింటుంది. 
Low aspiration is the severe crime. 
Caste and Community are making this low aspiration alive.
[+] 2 users Like kamal kishan's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే.... - by kamal kishan - 23-01-2020, 11:30 PM



Users browsing this thread: 1 Guest(s)