Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కయ్యావాళ్ళు బేసిక్స్ నేర్పించి ఉండటంతో క్లాస్ లో టీచర్స్ టీచింగ్ కొద్దికొద్దిగా అర్థమవుతూ డౌట్స్ వస్తే క్లాస్ తరువాత వారి వెంటే వెళుతూ క్లారిఫై చేసుకుంటూ మధ్యాహ్నం వరకూ క్లాస్ లోనే ఉన్నాను .

లంచ్ బెల్ కొట్టగానే బ్యాగు అక్కడే వదిలేసి క్లాస్మేట్స్ అందరితోపాటు బయటకు పరిగెత్తాను . 

నాకోసం అక్కయ్యలందరూ లంచ్ బాక్స్ లతోపాటు ఎదురుచూస్తూ నన్ను హత్తుకుని , ఈరోజు మా లంచ్ మా బుజ్జి హీరోతో షేర్ చేసుకునే అదృష్టం కలిగింది అంటూ సంతోషిస్తూ వెళ్లి పార్క్ లో కూర్చున్నాము .



అక్కయ్యలూ మీ అందరికీ థాంక్యూ sooooo మచ్ , మొన్న మీరు రోజంతా టీచ్ చేసినందువలన ఈరోజు క్లాస్ లో కష్టమైనా కొద్దికొద్దిగా అర్థమవుతోంది అనిచెప్పాను.

అక్కయ్యలందరూ సంతోషంతో కాలరెగరేసి మురిసిపోయి లంచ్ బాక్సస్ ఓపెన్ చేసి, అక్కయ్య ఒడిలో కూర్చున్న నాముందు ఉంచి ఏది ఇష్టమో అది తీసుకో హీరో అని చెప్పారు .

నాకు అన్నింటినీ టేస్ట్ చెయ్యాలని ఉంది అంటూ అక్కయ్య బుగ్గపై నవ్వుతూ ముద్దుపెట్టాను . 

ముందు మీ సునీతక్క ఐటమ్ తిను లేకపోతే తన కోపాన్ని తట్టుకోలేము కళ్ళల్లో నీళ్ళు కార్చినా కారుస్తుంది అని అక్కయ్య అందుకోబోతుంటే ,

 లవ్ యు రా వాసంతి ఉమ్మా ........అంటూ ముద్దు విసిరి , ఇంట్లో ఎలాగో తినిపిస్తావు కదే ఇక్కడ నేను తినిపిస్తాను అని బాక్స్ అక్కయ్య చేతిలోనుండి అందుకుంది . 



సునీతక్కా నీఇష్టం కానీ తొలిముద్ద అమ్మది మాత్రమే తింటానని అమ్మకు మాటిచ్చాను కాబట్టి అమ్మ పేరుమీద అక్కయ్య తినిపించాక ............

సరే హీరో నీ ఇష్టమే మాఇష్టం కానియ్యవే అంటూ కాస్త గరుకుగానే బాక్స్ ముందుకు చాపింది .

లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టి అమ్మచేతి ముద్ద అంటూ తినిపించింది .

సునీతక్క సూపర్ అంటూ మళ్లీ ఆ ..........అని నోటిని తెరిచాను .

ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ ఇదిగో అంటూ ముద్దకలిపి తినిపించింది . 

ఆహా ...........అమ్మ చేశారా సూపర్ అమ్మకు నాతరుపున థాంక్స్ చెప్పండి అని కళ్ళుమూసుకుని ఆస్వాధిస్తూ తిన్నాను . 



కళ్ళుతెరిచి అక్కయ్యకు అనిచెప్పడంతో , అక్కయ్యకు కూడా తినిపించింది . 

అవునే సునీత అంటీకి ప్రేమతో థాంక్స్ చెప్పాల్సిందే అని మేము ముగ్గురూ మాట్లాడుతుంటే , మిగతా అక్కయ్యలు అసూయతో సునీతక్కను చూస్తున్నారు .

కాంచన అక్కయ్యా ..........మీరు తినిపించరా , లేక నేనే తినాలా అని అడిగాను .



అమ్మో దానికి మాత్రమేనా ఆశ అంటూ పెదాలపై చిరునవ్వుతో తినిపించింది . 

కాంచన అక్కా ఇదికూడా సూపర్ ముందు అక్కయ్యకు తినిపించండి అని అలా అందరి అక్కయ్యల లంచ్ బాక్స్ లోని ఫుడ్ ను వాళ్ళచేతులతోనే కడుపునిండా తినేసి , కాసేపు పార్క్ లో ఆడుకుని స్కూల్ బెల్ కొట్టగానే బై అక్కా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి క్లాస్మేట్స్ ను పరిచయం చేసుకుని నవ్వుకుంటూ క్లాస్లోకి వెళ్ళాను . 

ఫ్రెండ్స్ అయినవాళ్ళు మహేష్ ముందుకు రా ,నా ప్రక్కకు రా అని పిలవడంతో వెళ్లి కూర్చున్నాను . 

రెండు క్లాస్ లు తరువాత ఇంటర్వెల్ లో అక్కయ్యకు చెప్పి మా ఫ్రెండ్స్ తో ఆడుకుని మళ్లీ చివరి క్లాస్ పూర్తిచేసి బ్యాగు వెనుకవేసుకుని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ అక్కయ్యావాళ్లదగ్గరికివచ్చి ఫ్రెండ్స్ ను పరిచయం చేసి అక్కయ్యలతోపాటు రోడ్ మీదకు వచ్చి షాక్ తో అలా చూస్తూ ఉండిపోయాము.



రోడ్ సైడ్ రెండువైపులా పొడవునా కనిపించేంత దూరం వరకూ ట్రాక్టర్లు అందులో ఊరిజనాన్ని చూసి ఆశ్చర్యపోతుంటే ,

రేయ్ మహేష్ అంటూ కృష్ణగాడు పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం కౌగిలించుకుని రేయ్ అమ్మా నాన్న పొలంలో కష్టపడుతున్నారని చెప్పగానే ట్రాక్టర్లు arrange చేసేసావు లవ్ యు రా అంటూ చాలాసేపు సంతోషంతో కౌగిలించుకున్నాడు .



కృష్ణ అన్నయ్య రెండుచేతులతో నమస్కరిస్తుంటే ఆపి అన్నయ్యా నేను చేసిందేమీ లేదు అంతా మనమంటే అభిమానించే ఆ ఊరివాళ్ళ గొప్పదనం అనిచెప్పాను . 



పెద్దయ్య వచ్చి బాబు దున్నడానికి వారం రోజులుపైనే పట్టేదాన్ని నీవలన ఓకేరోజులో పూర్తి చేసేసాము అంటూ అన్నయ్యలతోపాటు పైకెత్తి భుజాలపై కూర్చోబెట్టుకొని కోలాహలంతో ఎగిరిగెంతులేశారు . రేపటి సాయంత్రం లోపల ఊరందరి పొలాలు విత్తుకు రెడీ అయిపోతాయి అంతా నీవల్లనే అంటూ ఊరందరూ వచ్చి చేరుతుంటే , అన్నయ్యా కృష్ణ అక్కయ్యలు జాగ్రత్త అని చెప్పాను . అన్నయ్య కారు తీసుకొచ్చి అక్కయ్యావాళ్లను కూర్చోమనిచెప్పారు . 

అప్పటికిగానీ తేరుకున్న సునీతక్క మన హీరో అంటే ఇంతమందికి అభిమానామా ..........

కాదే సునీత ప్రాణం అని కాంచన అక్క బదులిచ్చి అక్కయ్యతోపాటు ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు . ఒసేయ్ వాసంతి అంత సందడిలోకూడా మన సేఫ్టీ గురించి ఆలోచించాడు మా బుజ్జి హీరో అంటూ ఆనందంతో అక్కయ్యను హత్తుకొంది కాంచన అక్కయ్య .



కాసేపు ఆనందకోలాహలం తరువాత ఊర్లో మీ అమ్మలంతా నీకోసం ఎదురుచూస్తున్నారు బాబు వెళదామా అని ఎత్తుకునే కారుదగ్గరికి తీసుకొచ్చారు .



ఎంత ఎత్తుకు ఎదిగిపోయావు హీరో అంటూ నా నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి , ఇప్పుడు నిన్ను ఆపడం సరికాదు రేపు కలుద్దాము వెళ్లు అని అక్కయ్యలిద్దరినీ కౌగిలించుకుని మిగతా అక్కయ్యలదగ్గరికి వెళ్ళింది సునీతక్క ,



అలాగే సునీతక్క బై అనిచెప్పి అక్కయ్యలిద్దరినీ కారులో కూర్చోమనిచెప్పి , అక్కయ్యా కృష్ణతోపాటు పెద్దయ్యా అన్నయ్యలతో ట్రాక్టర్లో వస్తాను అనిచెప్పాను . 

చాలా సంతోషం తమ్ముడూ అంటూ నా బుగ్గలను అందుకొని మాటల్లో చెప్పలేని సంతోషంతో నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , కృష్ణ ఇద్దరూ జాగ్రత్త అని చెప్పింది .

అన్నయ్యా ..........జాగ్రత్తగా మీరు ముందువెళ్లండి మేము వెనుకాలే వస్తాము అనిచెప్పి కృష్ణగాడి చెయ్యిపట్టుకొని పెద్దయ్య దగ్గరకు వెళ్ళాను . 

మా బుజ్జి దేవుడు మాతో వస్తానంటే మాకు పరమానందం అంటూ ట్రాక్టర్ ఎక్కించారు .

పెద్దయ్యా పెద్దయ్యా .........ఒక్క నిమిషం దింపండి అని రారా అంటూ కృష్ణగాడితోపాటు రోడ్ దాటి అటువైపుకు పరిగెత్తాము . 

బాబు జాగ్రత్త అంటూ పెద్దయ్యతోపాటు అన్నయ్యలందరూ నావెనుకేవచ్చారు . బాబు మేంఉన్నాము కదా మాకు చెప్పు మేము ఎక్కడికైనా తీసుకెళ్తాము అని చెప్పారు .

సరే పెద్దయ్యా ...........కవితక్కయ్య నాకోసం వచ్చి ఇదంతా చూసి వెళ్లిపోతున్నారు అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను . 



మహేష్ ఇలా ఎప్పుడూ రావద్దు అంటూ కవితక్క హత్తుకొని ప్రేమతో ముద్దుపెట్టింది .

ఇంతలో అక్కయ్యావాళ్ళు కారులోవచ్చి దిగి పరిగునవచ్చి కళ్ళల్లో చెమ్మతో నావైపు చూస్తోంది .

అయిపోయాను .............కవితక్క చెయ్యిపట్టుకొని అక్కయ్య దగ్గరకువెళ్లి లవ్ యు అక్కయ్యా ........ఇంకెప్పుడూ ఇలా చెయ్యను ప్రామిస్ అంటూ గొంతు తాకాను .

నీకేదైనా అయితే ఈ అక్కయ్య హృదయం తట్టుకోలేదు అంటూ గుండెలపై హత్తుకొని ముద్దులతో ముంచెత్తింది .  

లవ్ యు అక్కయ్యా .........అంటూ గట్టిగా హత్తుకొని , పాపం కవితక్క మనకోసం వచ్చి నిరాశతో వెనుదిరుగుతోంది .

కవిత మాదగ్గరకు రావచ్చుకదా రా మనం కారులో వెళదాము . వీళ్లంతా ఎవరు .....

ఈ ఊరివాళ్లే నా ఫ్రెండ్స్ తోడుగా వచ్చారు అని వారికి బై చెప్పి పంపించేసి కారులో కూర్చున్నారు . 

ముగ్గురక్కయ్యలూ కంగారుపడుతుంటే ఇంకెప్పుడూ ఇలా చెయ్యనే చెయ్యను అంటూ గుంజీలు తీస్తుంటే నవ్వడంతో , హమ్మయ్యా .........అనుకుని పెద్దయ్యతోపాటు రోడ్ రెండువైపులా చూస్తూ వెళ్లి ట్రాక్టర్ ఎక్కాము . 

అక్కయ్య మా ట్రాక్టర్ వెనుకే పోనివ్వమని చెప్పినట్లు వెనుకే వస్తున్నారు .

పెద్దయ్య ముందు ట్రాక్టర్లకు సిగ్నల్ ఇవ్వడంతో కొన్ని కారు వెనుకకు వచ్చాయి . 



అర గంటలో ఊరికి చేరుకున్నా పెద్దయ్యా ముందు కవిత , కాంచన అక్కయ్యలను వాళ్ళ ఊర్లో వదిలేసి వద్దాము అని చెప్పాను .

ఒక్కమాట కూడా మాట్లాడకుండా సిగ్నల్ ఇవ్వడంతో మరొక అర గంటలో ఆ ఊరికి చేరుకుని కవితక్క ఇంటిదగ్గర కారు ఆగేలా ట్రాక్టర్లను ఆపారు.



పెద్దయ్య దిగి కిందకు దింపారు . వెళ్లి కారు డోర్ తెరిచాను ముగ్గురక్కయ్యలూ నవ్వుతూ దిగి , వాసంతి కాంచన మహేష్ లోపలకు రండి అమ్మకూడా మిమ్మల్ని చూడాలని చాలా ఆశపడుతోంది అని ఆహ్వానించింది .

కవితక్కా అక్కయ్యలను లోపలకు పిలుచుకొనివెళ్లండి పెద్దయ్యా  అన్నయ్యలూ నా ఫ్రెండ్ గాడు ఉన్నారుకదా నేను ఇక్కడే ఉంటాను అనిచెప్పాను . 



ఇంతలో చైర్మన్ గారు మరియు ఊరివాళ్ళు వచ్చి మా ఊరిలో కూడా ఆగకుండా సరాసరి ఇక్కడికే వచ్చారని తెలుసుకుని ఆనందించి , తల్లి మన రెండు ఊళ్ల దేవుడిని బయటే నిలబెట్టావు ఏంటమ్మా ..........

బాబు మహేష్ మేము ఇక్కడే ఊరివాళ్ళతో మాట్లాడుతుంటాము మీరు వెళ్ళండి అని పెద్దయ్య చెప్పారు . 

మీరు కూడా రండి కృష్ణ నువ్వు కూడా అంటూ లోపలికి పిలుచుకొనివెళ్లారు . 

అమ్మా ఎవరొచ్చారో చూడు అని కవితక్క కేకవేసింది . 

తల్లి ఎవరు అంటూ వచ్చి చూసి మహేష్ కదా అంటూ సంతోషిస్తుంటే వెళ్లి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను .  

ఇంత చిన్న బుజ్జికి ఎంత సంస్కారం అంటూ లేపి మురిసిపోయి , నీవలన ఊరుఊరంతా మనఃశాంతితో ఉంది బాబు చాలా చాలా ఋణపడి ఉంటాము అనిచెప్పారు .

అమ్మా మీరు కవితక్క చైర్మన్ గారిని బెదిరించపోతే ఇదంతా జరిగేది కాదు అని బదులిచ్చాను . 

అంతే అందరూ సంతోషంతో నవ్వుకుని కూర్చోమనిచెప్పి ఒకటి తరువాత ఒకటి మర్యాదలు చేస్తుంటే .........

బయట ఉన్న అన్నయ్యలు .............

బాబు బయట కూడా అన్ని ఇళ్లల్లో నుండి ఇలాగే వస్తున్నాయి , మన వాళ్లంతా హ్యాపీ అని పెద్దయ్య చెప్పడంతో మేము కూడా తిన్నాము జ్యూస్ తాగాము . 

కవితక్క మమ్మల్ని పిలుచుకొని ఇల్లంతా చూపించి తన రూం కు పిలుచుకునువెళ్లి ప్రేమతో చూసుకుంది . 

కవితక్కా ఊర్లో కూడా అమ్మావాళ్లు ఎదురుచూస్తున్నారంట వెళ్ళొస్తాము అనిచెప్పాను .

మహేష్ అక్కడ నాకోసం ఏదైతే చేసావో దానిని నా జీవితాంతం మరిచిపోను లవ్ యు soooooo మచ్ , ఇది కూడా నీఇల్లే ఎప్పుడైనా రావచ్చు వాసంతి మళ్లీ ఖచ్చితంగా రావాలి అని నా నుదుటిపై ముద్దుపెట్టి ఆకజయ్యను కౌగిలించుకుంది . 

ఇంతలో అమ్మవచ్చి అవును వాసంతి మాబుజ్జిదేవుణ్ణి తీసుకుని మళ్లీ రావాలి అని ముద్దుపెట్టి బయటవరకూ వచ్చి వదిలారు .



అక్కయ్య ఒకటే కదా బాబు కారులో రా అని పెద్దయ్య చెప్పడంతో కృష్ణగాడిని ముందు కూర్చోబెట్టి అక్కయ్యలతోపాటు మధ్యలో కూర్చున్నాను .

దారిలో కాంచన అక్కయ్య ఇంటిదగ్గర ఆపమని అక్కయ్య చెప్పింది . 

ఒసేయ్ నేను ఆపమని చెప్పానా ..............ఈ బుజ్జి దేవుణ్ణి వదిలి రేపటివరకూ ఉండటం నావల్ల కాదు అని హత్తుకుంది .

చాలమ్మా చాలు కాలేజ్ లో ఏమో అది , ఇక్కడేమో నువ్వు నా తమ్ముడిని కొరుక్కుని తినేసేలా నానుండి దూరం చేస్తున్నారు . రేపు ఉదయం వరకూ నేను నాతమ్ముడు అంతే అంటూ కాంచన అక్కయ్యను దిగమని ఆర్డర్ వేసింది . 

నేను ముసిముసినవ్వులు నవ్వుతుంటే ఉండవే రేపు నీపని చెబుతాను అంటూ నా తలపై ముద్దుపెట్టి బై చెప్పి దిగింది . 



లవ్ యు అక్కయ్యా అంటూ గుండెలపై వాలిపోవడంతో లవ్ యు తమ్ముడూ అంటూ ప్రాణంలా హత్తుకొని ముద్దులుపెడుతూ ఊరికి చేరుకున్నాము .



కారు నేరుగా ఊరి అమ్మలందరూ ఇంటిదగ్గరే ఉన్నట్లు తీసుకొచ్చి అపాడు .

గేట్ దగ్గర అమ్మ కనిపించగానే అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కారుదిగి అమ్మా ....... అంటూ పరుగునవెళ్లి అమ్మను హత్తుకున్నాను . 

నా బంగారం అంటూ బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , బుజ్జి నాన్నా నీకోసం నిన్ను చూడటం కోసం ఎంతమంది అమ్మలు వచ్చారో చూడు అని చుట్టూ చూపించింది . 

కృష్ణగాడి అమ్మ వచ్చి మహేష్ ఈ అమ్మలు పొలంలో పడుతున్న కష్టాన్ని చూసి అడగకముందే వరాన్ని ప్రసాధించావు అంటూ మోకాళ్లపై కూర్చుని మనసారా గుండెలకు హత్తుకొని మా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్లు సంతోషంతో ఉండు అని దీవించింది .

అమ్మలందరూ చుట్టుచేరి సంతోషంతో అలాగే దీవించారు .



అమ్మా ఉదయం నుండి సాయంత్రం వరకూ స్కూల్ కి వెళ్ళొచ్చాడు , ఆ ఊరికి కూడా వెళ్ళొచ్చాడు ,బాగా అలసిపోయి ఉంటాడు కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి తరువాత మీఇష్టం అని కృష్ణగాడు తనతల్లికి చెప్పాడు . 



లక్ష్మీ......... మహేష్ అంటే నీకొడుకుకి ఎంత ప్రేమ , చాలా సంతోషం తను చెప్పినట్లే చేద్దాము మన బుజ్జి దేవుడికి గాలి ఆడనివ్వండి , వాసంతి తల్లి దేవుడిని ఊరికి తీసుకొచ్చావు లోపలికి పిలుచుకొనివెళ్లమ్మా అని చెప్పారు . 

అక్కయ్య సంతోషంతో పరవశించిపోయి అలాగే అత్తయ్యలూ అంటూ కౌగిలించుకుని అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు , కృష్ణగాడు కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను ఆడుకుందాము అనిచెప్పి వెళ్ళిపోయాక ,

అక్కయ్య అమ్మ చేతులను పట్టుకుని ఊపుతూ ఇంట్లోకి వెళ్ళాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 23-01-2020, 10:24 AM



Users browsing this thread: 66 Guest(s)