Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
గృహప్రవేశము ఎలాచేయాలి....?

శ్లో "అకవాట మానాచ్చన్న మభుక్త బలి భోజనం
గృహం న ప్రవిశేద్ధిమానా పదమా కరంహి తత్"
వాస్తురాజవల్లభం

ద్వారాలులేకుండా, ,పైకప్పులేకుండా,వాస్తుశాంతి,వాస్తుహోమములేకుండా,8 దిక్కులలో బలిలేకుండా,భదువులకు భోజనాలు పెట్టకుండా గృహప్రవేశము చేయరాదు సత్యనారాయణ వ్రతం రోజుయినా భోజనాలు పెట్టాలి

శాంతికమళాకారము,బృహద్వా స్తుమాలా,ధర్మ సింధు,నిర్ణయసింధూ,కాలామృతము, మొదలైన గ్రంధాలలో గృహప్రవేశము ముందు వాస్తుశాంతులు చేయకుండా యజమాని గృహప్రవేశము చేయరాదని గ్రంధాలు చెబుతున్నాయి

ఎందుకంటే ఇల్లునిర్మాణము చేసేటప్పుడు క్రిమికీటకాలహింస,చెట్లు నరికినదోషము,అంతర్గత శల్యదోషాలు,ఆయాది దోషము, ముహూర్తదోషము,కాకిప్రవేశ దోషము, భూతప్రేతపిశాచ ప్రవేశము పోవాలంటే వాస్తుదోషాలకు ,తగిన శాంతి హోమాలుచేసి తరువాత శుభమూహర్తంలో గృహప్రవేశము చేయాలి ఇదిశాస్త్రము ఈవిధంగా తెలంగాణ,రాయలసీమ ప్రాంతాలలో కొన్నిప్రాంతాలలో చేస్తారు ఈనాడు గృహప్రవేశాలు మరిదారుణంగా చేస్తున్నారు
శుభముహూర్త సమయంలో ముందుగా గోవు, దంపతులు గృహంలో కుడికాలుపెట్టి లోపలికి వెళ్ళాలి కానీ ముందు ఫోటోగ్రాఫర్ వెళ్తున్నాడు ఆదిిచెప్పులతో ఇలా అందరుకాదు కొంతమంది
గుమ్మందగ్గరే చెప్పులు,బియ్యము గ్లాసు కాలితోతన్ని లోపలికి పోవటం ఇవిిదోషము, సాంప్రదాయవస్త్రాలు ధరించకుండా,ఆడవారు కాలికి పసుపురాయకుండా గృహప్రవేశం చేసేస్తున్నారు,ఆగ్నేయంలో వంటగదిలో పొంగించవలసిన పాలు నట్టింట్లోపొంగించడం చేస్తున్నారు ,సింహద్వారానికి పసుపురాసి బొట్లుపెట్టకుండా,మామిడిఆకులు కట్టకుండా ప్రవేశం చేస్తున్నారు

కొంతమందిపుణ్యాహవాచనము,ఏకాశీతి పదవాస్తుమండపారాధన చేయకుండా పూజముగిస్తున్నారు

గృహప్రధానద్వారాము తలుపులు ముహూర్త సమయానికి తెరిచి ప్రవేశము చేయాలి అంతవరకు మూసిఉంచాలి ప్రవేశం ముందు దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండటానికి
రాత్రి గృహప్రవేశము ఐతే ఉదయమునూతన గృహంలో వాస్తుశాంతి చేయవలెను వాస్తుశాంతి రాత్రి,సాయంత్రము చేయరాదు

గృహప్రవేశము,రాత్రి పూట,పగటిపూట చేయవచ్చు ఎక్కువగా పగలు చేయకపోవడానికి కారణము మంచి శకునంకాజాలదని,రాత్రి ఎవ్వరు తిరగరని ఎక్కువగా రాత్రి గృహప్రవేశం చేస్తున్నారు గృహప్రవేశము చేసినవారు రాత్రిఅంతా జాగరణ చేయాలి సూర్యోదయం వరకు నిద్రపోరాదు ఎందుకంటే ఆగృహము కూడా నిద్రావస్థను పొదుతుందని పెద్దలు చేెప్పినారు
మూడురోజులు తప్పకుండా ఉదయము సాయంత్రము నూతన గృహంలో దీపారాధన చేయవలెను ఒకవేళ మైలసోకిన 5 రోజులు ఆపివేసి మరల చేయవలెను

పాలు పొంగించడానికి తొడబుట్టిన చెల్లెలులేదా అక్కచేత పాలుపొంగించవలెను వారులేకపోతే పెళ్లయిన కూతురు చేత పాలుపొంగించవలెను వారులేకపోతే సోదరివరస ఐనవారు ఎవరైనా పాలుపొంగించాలి పాలుపొంగించినవారికి పసుపు కుంకుమతో వస్త్రాలు పెట్టవలెను
వాస్తుశాంతి పూజ విధానము
గణపతిపూజ,పుణ్యాహవాచనము, పంచగవ్యసంస్కారము,ఏకాశీతి పదమండల వాస్తుపూజ,నవగ్రహ మండపారాధన,లక్ష్మీ గణపతి,రుద్ర,నవగ్రహ,వాస్తు,హోమాలు,వాస్తుపర్యగ్నికరణ, బ్రాహ్మణులకు నవగ్రహ దానాలు మొదలైన పూజలు చేయవలెను
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 09-01-2020, 10:31 AM



Users browsing this thread: 2 Guest(s)