Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
కొన్ని ముఖ్యమైన యెాగములు గురించి తెలుసుకుద్దాము:-

సరస్వతి యెాగము:- శుభ గ్రహము లైన గురు,శుక్ర,బుధలు 1,2,4,5,7,9,10 స్థానములలో ఏ స్థానమున అయినను వుండి గురుడు ఉచ్చ రాశి యందు గాని మిత్ర క్షేత్రము నందు గాని వున్నచో సరస్వతి యెాగము కలుగును.
ఈ యెాగము వలన కవులు,పండితులు,అనేక శాస్త్రములు చదివినవారు,నేర్పు, మంచి కళత్రము లవారును అగుదురు.

త్రిలోచన యెాగము:- రవి,చంద్ర,కుజులు పరస్పర త్రికోణ రాశులలో వుండినచో త్రిలోచన యెాగము వర్తించును.
ఈ యెాగము వలన శతృవులకు సింహస్వప్నం వలె నుండుట,ధన సంపాదన, మానసిక బలము,తెలివి తెలివితేటలు,శతృవులపై విజయము సాధించువారును,మంచి ఆరోగ్యము,ఐశ్వర్యము కలవారును అగుదురు

కేమద్రుమ యెాగము:- చంద్రడున్న స్థానమునకు 2,12 స్థానముల యందు గ్రహములు లేకుండుట వలన కేమద్రుమ యెాగము కలుగ గలదు.
ఈ యెాగము వలన విరుద్దమైన వృత్తులు యందు వుండుట,దుష్ట వేషముల నవలంబించుట,దారాపుత్ర సంపద లేకుండుట,మలినులు,విదేశములందు నివసించు వారునుఅగుదురు.

చంద్రుడున్న స్థానమునకు 2,12 స్థానములందు గ్రహములు లేనప్పటికిని,పాప శుభ గ్రహములలో యేగ్రహములచే నైనను చంద్రడు చూడబడిన కేమద్రుమ యెాగగము భంగమై జాతకులను చక్రవర్తిని,ధీర్ఘాయుష్మంతుని చేయును.
చంద్రుడున్న స్థానమునకు 2,12 స్థానములయందు ఏ గ్రహములు లేనప్పటికీ 4 కేంద్రముల యందు పాప,శుభ గ్రహములు ఏవియున్నను కేమద్రుమ యెగము భంగమై "కల్పద్రుమ"యెాగము కలుగును.ఈ యెాగము వలన జాతకులకు ఎల్లప్పుడూ శుభ ఫలితములు కలుగును.

జన్మకాలమందు తులారాశి లో గురు కుజు లను, కన్యారాశిలో రవి యుండి, మేషరాశి యందుడు చంద్రనకు(బుధ,శని,శుక్రులు)ఇతర గ్రహ ధృష్ఠి వున్నప్పుడు కేమద్రుమ యెాగము భంగమగును. శుక్రుడు,బుధుడు,గురుడు కలసి లగ్నమునకు కేంద్ర స్థానముల యందున్నను,చంద్రుడు పూర్ణుడైనను ఆ చంద్రునకు కేంద్రములందు గ్రహములున్నను కేమద్రుమ యెాగ ఫలితములుండవు.

అనభ యెాగము:-చంద్రుడున్న స్థానమునకు 12 వ యింట రవి,రాహు,కేతువులు తప్ప మిగతా గ్రహములు ఏవైనా వున్నచో అనభ యెగము ఏర్పడును.
ఈ యెాగము వలన స్వయంగా ధనార్జన చేయువాడు,మర్యాద కీర్తి గలవారును,బుద్ధిమంతులు సుఖముగా జీవించువారును,మంచి కార్యములు చేయువారును,మంత్రియు అగుదురు.

సునభ యెాగము :- చంద్రుడున్న స్థానమునకు 2వ యింట రవి,రాహు,కేతువులు తప్ప మిగతా ఏవైనా గ్రహములున్నచో సునభ యెాగము ఏర్పడును.
ఈ యెాగము వలన స్వయంగా ధనార్జన చేయువారును,మర్యాద కీర్తి గలవారును,బుద్ధిమంతులు,సుఖముగా జీవించువారును,మంచి కార్యములు చేయవారును,మంత్రి యగును.

ధురుధురా యెాగము :- చంద్రడున్న స్థానమునకు 2,12 స్థానములందు రవి రాహు కేతువులు తప్ప మిగతా గ్రహములున్నచో ధురుధురా యెాగమగును.
ఈ యెాగము వలన ధనము,వాహనములు,భూములు కల్గి సుఖములనుభవించెదరు.శతృవులను జయంచువారును,అందమైన స్త్రీ,పురుషులను పొందువారును,మంచి నేత్రములు కలవారును అగుదురు.

అఖండ సామ్రాజ్య యెాగము:-లగ్నము స్థిర లగ్నమై 2 వ భావాధిపతి చంద్ర లగ్నాత్తు కేంద్రమునందుడుట వలన ఈ యెాగము వర్తించును.
ఈ యెాగము వలన ప్రపంచము ఏలగల శక్తి,అధిక ధన సంపదలు,పేరు ప్రఖ్యాతులు,అందరిలో తగిన గౌరవ మర్యాదలు కలుగ గలవు.

నీచ భంగ రాజ యెగము:-ఒక ఉచ్చ గ్రహము నీచ గ్రహము కలిసి వుండిన గ్రహము యెక్క నీచ దోషము పోయి శుభత్వము కలుగ గలదు.
ఈ యెాగము వలన చాలా అదృష్టము, మంచి కీర్తి,సుఖ సంతోషములు, చేయు పనులు కచ్చితమైనవిగా నుండును.చాలా ఆరోగ్య సంపదులు కలిగినవారగుదురు. మంచి కీర్తి ప్రతిష్ఠలు కలుగ గలవు.

పంచ మహాపురుష యోగములు

ఈ అయిదు యోగములు కుజ, బుధ, గురు, శుక్ర, శని, గ్రహములవలన కలుగును.
ఆ యోగములు. 1) రుచిక మహాపురుష యోగము, 2) భద్ర మహాపుష యోగము,
3)హంసమహా పురుష యోగము, 4) మాళవ మహాపురుష యొగము
5) శశ మహాపురుష యొగము. పైన చెప్పిన అయుదు గ్రహములు,
కేంద్రములందుండవలెను. అట్లు కాక ఆ రాశులు, ఆయా గ్రహములకు,
స్వ, ఉచ్చ, క్షేత్రములై ఉండవలెను. జాతాక పారిజాతమున,
మూల త్రికొణములయందున్నను, సకల బలములు గలిగి ఉండవలెననిరి.
అందరూ అంగీకరించనది ఈ సూత్రములే.

రుచిక మహాపురుష యోగ జాతకులు, ధైర్య సాహసములుచెసి, ధనము సంపాదించెదరు
బలవంతులు, శత్రువులను జయించు వారు అగుదుగురు, సేనానాయకులు కాగలరు.
భద్ర మహాపురుష యోగ జాతకులు,సంపూర్ణ ఆయుష్షు విద్యాధికుడు పరులచే
ప్రశంసించబడిన వాడు బుద్ధిమంతుడు అగును.

హంస మహాపురుష జాతకులు, మంచి గుణములు కలిగి, రాజ సమానులు, సుందరాకారము
కలిగి, చెతులలొ, శంఖ చక్ర, పద్మ ముద్రలు, గలిగి ఉందురు. భొజన ప్రియులు, ధార్మికులు అగును.
మాళవ్య మహాపురుష యోగజాతకులు దృధమైన శరీరము వాహనములు, ధనము,
భార్యా సంతానము, అదృష్ఠము మొదలగు శుభ లక్షణములు కలవాడగును.
శశ మహాపురుష యొగమున జన్మించిన వారు, సర్వజనములకు ప్రియుడు, గ్రామ పెద్ద,
సెనాని, అగును కాని ఇట్టివారు, వ్యసనములు కలిగి, పరధన భోగి, అగును.

ఈ అయుదు యోగములు రాజప్రదములు, ఉన్నతొద్యోగములు కలుగును.
ఇందులో ఏ ఒకటి రెందు కలిసినను మహారాజ యోగము పట్టును.
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 25-12-2019, 11:15 AM



Users browsing this thread: 1 Guest(s)