Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చెరువు దగ్గర నుండి మగవాళ్ళంతా మాటల్లో చెప్పలేనంత సంతోషంతో కేరింతలువేస్తూ ఊరిలోకివచ్చి , తమ తమ ఇంటి దేవతలకు ఇక మన కష్టాలు తీరిపోనున్నాయి మన ఊరికి నీళ్లు వచ్చేసాయి . దేవుడే మహేష్ రూపంలో మన ఊరికి వచ్చాడు , ఆ బుజ్జి దేవుణ్ణి తీసుకువచ్చింది దేవత వాసంతి , 

కాబట్టి మేము దేవుణ్ణి మీరు దేవతను కలిసి పండగ చేసుకోవాలి రండి అంటూ ఊరుఊరంతా మా ఇంటివైపు కదిలింది .

నాకు తెలుసు వాడు ఏమైనా సాధిస్తాడని ఇప్పుడు మన ఊరికే దేవుడయ్యాడు అంటూ కృష్ణగాడు గర్వపడుతూ అందరికంటే ముందు నడుస్తున్నాడు . 



అందరూ సంతోషం పంచుకుంటూ ఇంటిదగ్గరకు చేరారు . 

మా ఇల్లు మాత్రం నిర్మానుష్యంగా ఉండటంతో కృష్ణగాడు అందరూ శబ్దం చేయకండి మహేష్ ఇంకా నిద్రపోతున్నట్లున్నాడు , మనవలన డిస్టర్బ్ కాకూడదు అనిచెప్పగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు . ఇంటి తలుపు కొద్దిగా తెరిచినట్లున్నారు నేను లోపలకువెళ్లి చూసొస్తాను అంటూ క్రికెట్ ఆడిన ఫ్రెండ్స్ తోపాటు చప్పుడు చెయ్యకుండా లోపలికివచ్చాడు .



అమ్మ అప్పటికే లేచి బాధపడుతూనే ఇంటిపనులు చేసుకుపోతుంటే , కృష్ణగాడు వెళ్లి  అంటీ మహేష్ ఎక్కడ , ఇంకా పడుకున్నాడా అని నెమ్మదిలో నెమ్మది అడిగాడు .

అవును కృష్ణా నిన్న సాయంత్రం జరిగినడానికి ఏడుస్తూ ఏడుస్తూనే రాత్రి బీజనం కూడా చెయ్యకుండా ఎప్పుడో అర్ధరాత్రి కన్నీళ్లు కారుస్తూనే నిద్రపోయాడు . క్రికెట్ ఆడటానికి వెళుతున్నారా ...........అయితే లేపుతాను పిలుచుకొనివెళ్లండి , ఆటలోనైనా ఈ విషయం మరిచిపోయి ఆనందిస్తాడు అని అమ్మకూడా బాధను దిగమింగుతూ మాట్లాడింది .

అంటీ ...........ఇక బాధపడాల్సిన అవసరం లేదు మన మహేష్ వలన మనఊరికి నీళ్లు వచ్చేసాయి , చుట్టూ ఉన్న చేరువులన్నీ నిండిపోయాయి . ఊరుఊరంతా ఆడ మగ పిల్లా జల్లా............ అందరూ మహేష్ దేవుడంటూ కొలవడానికి వచ్చి బయట ఎదురుచూస్తున్నారు అన్న సంతోషమైన వార్తను చెప్పడంతో ........ 

నిజమా కృష్ణ అంటూ ఆతృతతో వెళ్లి తలుపులు పూర్తి తెరవగానే అమ్మను చూసి అందరూ రెండుచేతులతో నమస్కరించి సంతోషంతో మహేష్ మహేష్ ........అంటూ కేకలువేస్తుంటే .........

కృష్ణగాడు పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరకువెళ్లి ఆగమని , అమ్మ చెప్పినది చెప్పి రాత్రన్తా నిద్రపోకుండా మనకోసమే బాధపడుతూ నిద్రపోయాడని చెప్పాడు .

అందరి కళ్ళల్లో చెమ్మతో నిశ్శబ్దం అయిపోయి , మహేష్ వాసంతి కోసం ఎంతసేపయినా ఇక్కడే కూర్చుంటాము అంటూ సంతోషంతో చెప్పారు . 

అమ్మ వెళ్లి గేట్ తెరిచి తన పిల్లలను అభినందించడానికి వచ్చిన ఆడవాళ్ళందరినీ సంతోషంతో లోపలకు ఆహ్వానించింది .

కృష్ణ నీ ఫ్రెండ్ ను లేపుదాము రా అని పిలవడంతో .........

ఊరంతా కృష్ణ అదృష్టాన్ని చూసి గుసగుసలాడుతుంటే ......

వాడి ఆనందానికి అవధులు లేనట్లు మురిసిపోతూ అంటీ మరికొద్దిసేపు నిద్రపోనివ్వండి అంటూనే అమ్మ వెనుక పైన రూంలోకి వచ్చారు .

గువ్వపిల్లలా అక్కయ్య ఒడిలో ముఖంలో అదే ఆందోళనతో పడుకున్న నన్ను చూసి , అమ్మ కృష్ణ ఒకరినొకరు చూసుకుని సంతోషించి , అమ్మ నా ప్రక్కనే కూర్చుని ముందు అక్కయ్యను లేపి ష్ .........అంటూ చిరునవ్వులు చిందిస్తూ ఇప్పటివరకూ జరిగిందంతా గుసగుసలాడింది .

అంతే అక్కయ్య సంతోషానికి అవధులు లేనట్లు కళ్ళల్లో ఆనందబాస్పాలతో నన్ను కౌగిలిలో ముద్దులతో ముంచెయ్యాలన్న కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకుని , అమ్మతోపాటు కురులను ప్రేమతో నిమురుతూ వొంగి అమితమైన సంతోషంతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . ఊరుఊరందరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక తమ్ముడూ తమ్ముడూ అంటూ ముద్దులుపెడుతూ నన్ను నిద్రలేపారు .



మ్మ్మ్.........అంటూ కళ్ళుతెరిచి అక్కయ్యను , అమ్మను మరియు కృష్ణగాన్ని చూసి అక్కయ్య అంటూ లేచి కూర్చుని కన్నీళ్ళతో అక్కయ్య గుండెలపై వాలిపోయి నావల్ల ఎవరికీ ఉపయోగం లేదు అంటూ బాధపడ్డాను .

తమ్ముడూ ఇదేమాట ఒకసారి ఇంటి గేట్ దగ్గరకువెళ్లి చెప్పు అంటూ అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ ప్రాణంలా రెండుచేతులతో నన్ను చుట్టేసి తలపై , నుదుటిపై ఆపకుండా ముద్దులవర్షం కురిపించింది .

అక్క ఆనందాన్ని చూసి నాకు తెలియకుండానే సంతోషం కలిగి పెదాలపై చిరునవ్వు చిగురించి  అక్కయ్యా , అమ్మ , కృష్ణవైపు ఆశ్చర్యంతో చూసాను .



అక్కయ్య కృష్ణవైపు చూసి కళ్లతో సైగ చేయగానే ..........

రేయ మహేష్ నిన్న నువ్వు కొరినట్లుగానే వాళ్ళు మన ఊరికి నీళ్లు వదిలారురా , ఊరి చుట్టూ ఉన్న చెరువులు , చెక్ డ్యామ్ లు మరియు కుంటలు అన్నీ నిండుకుండలా మారిపోయాయి . ఊరుఊరంతా నిన్ను కలిసి పండగ జరుపుకోవడానికి వచ్చి బయట వేచి చూస్తున్నారురా అని సంతోషంలో తడబడుతూ మాట్లాడాడు . 

నిజమా అక్కయ్య అని లోలోపలే ఆనందిస్తూ అడిగాను .

నాకు ఎప్పుడో తెలుసు నాతమ్ముడు ఏదైనా సాధిస్తాడని అంటూ రెండుచేతులతో బుగ్గలను అందుకొని ఆనందబాస్పాలతో నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి నా కన్నీళ్లను తుడిచింది .



బయట అందరూ రేయ్ నిన్ను బుజ్జి దేవుడు అని , నిన్ను తన తమ్ముడిగా తీసుకొచ్చిన అక్కయ్యను దేవతగా భావిస్తున్నారు అని చెప్పాడు .

అక్కయ్యతోపాటు నవ్వుకుని నేను కాదు మా అక్కయ్యే , నా తమ్ముడే ........దేవత బుల్లి దేవుడు అంటూ ఒకేసారి అంటూ నవ్వుతుంటే ,



అమ్మ ఆనందానికి అవధులు లేక మా ఇద్దరినీ ప్రాణంలా హత్తుకొని , కృష్ణగాన్ని కూడా బెడ్ పైకి లాగి ముగ్గురినీ హత్తుకొంది .



అక్కయ్యా ...........ఊరంతా మనకోసం ఎంతోసేపటినుండి వేచిచూస్తున్నారు అని చెప్పాను .

అవును వాళ్ళను మరింత వేచిచూడేలా చెయ్యకూడదు , నా తమ్ముడి మనసు బంగారం అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి కిందకు దిగాము . 

అప్పటికే ఇంట్లొఉన్న ఆడవాళ్ళందరూ ముఖ్యన్గా అక్కయ్య స్నేహితులు సంతోషంతో చుట్టుముట్టి తమ ఆనందాన్ని పంచుకోవడానికన్నట్లు నా బుగ్గలను గిల్లడానికి , ముద్దులుపెట్టడానికి చూడటంతో ..........

అక్కయ్య వెనుక దాక్కొని నో టచింగ్స్ , నా బుగ్గలు మా అక్కయ్యకు మరియు అమ్మకు మాత్రమే అని చెప్పాను .



అందరూ అమ్మో అంటూ షాక్ లో ఆశ్చర్యపోతుంటే .......

అమ్మ , అక్కయ్య మరియు కృష్ణగాడు ఆనందంతో నవ్వుతూ , విన్నారుకదా చెయ్యిపడిందోచెయ్యిపడిందో కట్ చేసేస్తాను అని సోమయ్యను పిలిచి నన్ను జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లు అని అక్కయ్య చెప్పింది .



అక్కయ్యా నేను కూడా ప్రక్కనే ఉంటాను మీరేమీ కంగారుపడకండి అని కృష్ణగాడు నాచేతినిపట్టుకుని బయటకు నడిచాడు .

అందరూ అక్కయ్య చేతులను అందుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే మురిసిపోతూనే నావెనుకే తలుపు దగ్గరవరకూ వచ్చి నిలబడి చూస్తోంది .



నేను కృష్ణగాడితోపాటు బయటకు అడుగుపెట్టగానే కూర్చున్నవాళ్ళంతా లేచి మహేష్ మహేష్ ...........అంటూ జయజయనాధాలు పలుకుతూ , ఇన్ని సంవత్సరాలలో ఎవ్వరి చేతకానిది వచ్చిన రోజుల్లోనే సాధించావు బాబు , ఆ తిరుమలలో వెలసిన దేవుడే మాకోసం నిన్ను అక్కడి నుండే పంపించాడు , మా ఊరి దేవత వాసంతి ఈ బుజ్జి దేవుణ్ణి ప్రాణంలా తీసుకొచ్చింది అంటూ అక్కయ్యకు చేతులెత్తి దండాలు పెట్టి , అక్కయ్య సంతోషానికి మరింత ఆనందంతో నన్ను అమాంతం పైకెత్తేసి సంతోషాన్ని పండుగలా పంచుకుని , మా బుజ్జి దేవుడే మా పొలాలకు కాలువల ద్వారా నీళ్లు చేరేలా గేట్లు ఎత్తాలనేది మా ఆశ అని కోరిక కోరారు .



అంతకుముందు మా అక్కయ్య కొరికల్లో భాగంగా మనం ఆ ఊరివాళ్లను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలుపుకుని ఇక జీవితంలో మన ఊర్ల మధ్య ఇక ఏ గొడవలు రాకుండా , రెండు ఊర్లలో జరిగే పండుగలను , జాతరలను కలిసి జరుపుకునేలా కలిసిపోదాము ఏమంటారు అని అడిగాను .

అంతే అందరి కళ్ళల్లో చెమ్మ మరియు ఆనందబాస్పాలతో మా శ్రేయస్సు కోసమే నువ్వు మా ఊరు వచ్చావు మహేష్ , కాదు కాదు మా దేవత వాసంతి తీసుకొచ్చింది.జీవితాంతం ఇక ఏ కష్టాలు లేకుండా చేస్తాను అని దేవుడే వరమిస్తుంటే ఈ భక్తులు కాదంటామా ...........రేయ్ ట్రాక్టర్లు తియ్యండ్రా మన బుజ్జి దేవుడు మరియు కృష్ణ కోసం కారు రెడీ చెయ్యండి అని కేకలు వెయ్యడం ఆలస్యం పరిగెడుతుంటే ...........

కిందకు దిగి పెద్దయ్యా , అన్నలూ ..........మేమూ మీవెంటే ట్రాక్టర్లో వస్తాము , ఏంటావురా కృష్ణ అంటూ భుజం చుట్టూ చేతినివేశాను .



అందరూ మరింత ఆనందంతో మాఇద్దరినీ పైకెత్తేసి మళ్లీ దేవుడని నిరూపించుకున్నావు మహేష్ .

తలుపు దగ్గర నుండి చూస్తున్న అమ్మ అక్కయ్యల ఆనందానికి అవధులే లేకపోయాయి . 

ఊరిలో ఉన్న ట్రాక్టర్లు అన్నీ తేవడంతో ............గుంపులో ఒక వ్యక్తి మనలో ఒక 10 మంది ఇక్కడే ఉండి మనం వచ్చేలోపు చెరువు దగ్గరే అందరికీ వంట చేస్తే ఇంకా పండుగలా ఉంటుంది అని మాట్లాడాడు .

అవును అవును అవును ............అంటూ ఒక్కొక్కరే ఊరు జనమంతా సపోర్ట్ ఇచ్చి వెంటనే టవల్ కిందపరిచి ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వమని కోరారు .

అంత ఆనందంలో జనం ఉత్సాహంతో ముందుకువచ్చి డబ్బును టవల్ లో వేస్తున్నారు . 

కృష్ణ అంటూ అమ్మ పిలిచి అమ్మ అక్కయ్యతోపాటు ఆడవాళ్ళందరూ కలెక్ట్ చేసిన డబ్బుని ఇచ్చిపంపారు . 

టవల్ లో ఒక కుప్ప డబ్బు చూసి అందరూ సంతోషంతో ఆశ్చర్యపోయి ఊరిలోని వంట వాళ్లకు అందించి ఊరంతటికీ వండాలి వంటలు అధిరిపోవాలి అనిచెప్పి , మహేష్ ట్రాక్టర్ ఎక్కించమంటావా బాబు అని మీసాలు తిరిగిన పెద్దయ్య అడిగారు .



ఒక్క నిమిషం పెద్దయ్యా ...........అంటూ పరుగున లోపలకువెళ్లి అమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను . 

అంతా మంచే జరుగుతుంది నాన్న అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టింది .

లవ్ యు అమ్మా .........అంటూ అక్కయ్య దగ్గరకువెళ్లి , అమితమైన సంతోషంతో అక్కయ్యా ..........అంటూ నడుమును చుట్టేసాను . 

నా తమ్ముడు కోరిక తీరాలి అంటూ మోకాళ్లపై కూర్చుని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి జాగ్రత్తగా వెళ్ళిరా అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని పంపించింది . 

లవ్ యు soooooo మచ్ అక్కా అంటూ హత్తుకొని వెళ్ళొస్తాను , నువ్వు ఏమాత్రం కంగారుపడకు కృష్ణగాడు ఉన్నాడు , పెద్దయ్యలు ఊరుఊరంతా ఉన్నారుకదా అంటూ వదిలి కృష్ణతోపాటు ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నాము . 

అందరి సంతోషమైన కేరింతలతో బయలుదేరాము . అక్కయ్య పరుగున గేట్ దగ్గరకువచ్చి యార్న్ అయ్యేంతవరకూ అక్కడే నిలబడి చూస్తుండిపోయింది.





 ట్రాక్టర్లో ఉత్సాహంతో ప్రయాణిస్తూ రేయ్ మహేష్ ఊరంతా ఇంత సంతోషంతో ఉండటం నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూడలేదురా అంటూ నా చేతిలో చెయ్యిని పెనవేసి మురిసిపోయాడు కృష్ణగాడు .

వాడితోపాటు ఆనందించి పెద్దయ్యా పెద్దయ్యా ...... అని ఇద్దరమూ దగ్గరకువెళ్లి , పెద్దయ్యా .........నీటిని వదలదానికి కూడా ఆ ఊరిపెద్దనే ఆహ్వానించండి . అప్పుడు మన బంధం ఇంకా బలపడుతుంది అనిచెప్పాను .

కానీ మహేష్ మనఊరివాళ్ళంతా మా బుజ్జి దేవుడితో గేట్లు తెరిపించాలని ఆశపడుతున్నారు .

పెద్దయ్యా చాలా సంతోషం , మనమంతా ఒక్కటే ఇప్పుడు మనకు కావాల్సింది మాతరం పిల్లల వరకూ కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం , అలా జరగాలంటే ఆ ఊరివాళ్లను మరింత తృప్తిపరచాలి అని బదులిచ్చాను .

మాకోసమే వచ్చావు మహేష్ అంటూ ఆనందంతో నా తలనిమిరి ట్రాక్టర్లో ముందు వెనుక ఉన్న ట్రాక్టర్లలో ఉన్న వ్యక్తులందరికీ విషయం తెలిసేలా చేసి ఆనందించారు .



ఊరు చేరుకొని ట్రాక్టర్లను నేరుగా చైర్మన్ ఇంటిదగ్గర ఆపారు . మా ఆనందాన్ని చూసి ఆ ఊరి జనాలంతా కూడా అక్కడికి చేరుకున్నారు .

చైర్మన్ గారు బయటకువచ్చి ఏమప్పా బుజ్జి మహేష్ అనుకున్నది సాధించావు సంతోషామా...........అని అడిగారు .

నాతోపాటు అందరూ సంతోషంతో నమస్కరించి నేను సైగ చేయగానే వెళ్లి ఆయనను సంతోషంతో కేకలువేస్తూ ఎత్తుకుని రెండు ఊర్ల జనాల మధ్యలోకి తీసుకొచ్చారు . ఆ ఊరి జనాలంతా కూడా కలిసిపోవడం కోసమే ఎదురుచూస్తున్నట్లు ఒకరిభుజాలపై మరొకరు వేసుకొని సంతోషంతో గెంతులేశారు .



చైర్మన్ ను కిందకుదించి మా పొలాలకు చేరువునీటిని తమచేతులమీదుగా వదలాలి అయ్యగారు , అందుకే ఊరిజనమంతా సంతోషంతో ఆహ్వానించడానికి వచ్చాము అని పెద్దయ్య చెప్పారు .

ఆ మాటలకు చైర్మన్ తోపాటు ఆ ఊరి జనమంతా ఆనందించారు .

ఏదీ మన బుల్లి హీరో ఎక్కడ అంటూ మాదగ్గరకువచ్చి ఒక్క రోజులో మా రెండు ఊర్లమధ్య గొడవలను మరిచిపోయేలా చేసి కలిపావు . ఇంకా చూస్తున్నారేంటి మహేష్ ను ఎత్తి భుజాలపై కూర్చోబెట్టుకొని ట్రాక్టర్లు తియ్యండి బయలుదేరుదాము అని కెకెయ్యడంతో .........మొత్తం సంబరంలా మారిపోయింది .

పెద్దయ్య చిన్న మొబైల్ తీసి వంట వాళ్లకు కాల్ చేసి విషయం చెప్పి డబల్ వండమని చెప్పారు .

లోపలినుండి చైర్మన్ ను పిలవడంతో ఇంట్లోకివెళ్లి కాస్త భయంతోనే వచ్చినట్లు కనిపించారు .

రెండు ఊర్లవాళ్ళు కలిసిపోయి నన్ను ఎత్తుకుని భుజాలపై కూర్చోబెట్టుకొని సంతోషంతో కేరింతలువేస్తూ ట్రాక్టర్లలో బయలుదేరి , అందరూ కలిసిపోయి సంతోషంతో అప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటూ నేరుగా చెరువు కట్టకు చేరుకున్నాము .

అక్కడ అంతా శుభ్రం చేసి జలాలను పూజ జరిపించడం పూలతో అలంకరించారు . మరొకప్రక్క షామియానాలు వేయించి దానికింద వంట ఏర్పాట్లు చేస్తున్నారు .



మొత్తం చూసి ఆ ఊరివాళ్ళంతా మురిసిపోయి ఒకరికొకరు కలిసిపోయి పూజ జరిగే ప్రదేశం చేరుకున్నాము .

చైర్మన్ గారు , సర్పంచి గారు అని మా ఊరు సర్పంచి పెద్దయ్య పూజ జరిపించడానికి ఆహ్వానించారు .

మనం ఇంత సంతోషంతో కలిసిపోవడానికి కారణం మన బుజ్జి హీరో మహేష్ కాబట్టి అతనితోనే పూజ జరిపించడం మన అందరికీ మంచిది , నాకు మరీ మంచిది అని నాదగ్గరకు వచ్చిమరీ చేతిని అందుకొని పిలుచుకొనివెళ్తుంటే ........

మీకు హీరో అయితే మా మహేష్ మా ఊరి బుజ్జి దేవుడు అయ్యా అంటూ మరింత సంతోషంతో కేరింతలు కొట్టారు .



చైర్మన్ గారు మీరు పెద్దవారు పూజ మీచేతులమీద జరిగితే అందరికీ మంచిది అని చెప్పాను .

హీరో ట్రాక్టర్ ఎక్కుతూ మాఇంటిలో నుండి కబురు వస్తే వెళ్ళాను కదా ..........లోపల ఏమిజరిగిందో వీళ్ళెవరికీ తెలియదు నీకుమాత్రమే చెబుతాను , పూజ మరియు పొలాలకు నీటిని నీచేతులమీద జరిపించకపోతే మళ్లీ కథ మొదటికి వచ్చేలా ఉంది అని చెవిలో కంగారుపడుతూ గుసగుసలాడారు .

నాకు ఒక్కసారిగా నవ్వు వచ్చేసింది .

ష్ ష్ .........ఎవ్వరికీ తెలియకూడదు నా పరువు మొత్తం హుష్ కాకి అంటూ నాతోపాటు నవ్వుతూ వచ్చి , పంతులుగారు చెప్పినట్లు నీటిలో మూడుసార్లు మునిగివచ్చి పూలతో జలానికి శాంతిచేసి టెంకాయ కొట్టడం ఆలస్యం ఆకాశం మొత్తం దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లు పైనుండి దేవుళ్ళు మా రెండు ఊర్లను ఆశీర్వదించినట్లు వర్షం పడింది .

రెండు ఊర్లవాళ్ళు మాటల్లో చెప్పలేనంత సంతోషంతో వర్షం లో తడుస్తూ వచ్చి నన్ను పైకెత్తేసి సంబరాలు చేసుకున్నారు .

మహేష్ గంగమ్మ నీవలన శాంతించి మమ్మల్ని ఇలా కలిసిపోవడం చూసి కరుణించింది , ఎన్ని సంవత్సరాలయ్యింది ఇలాంటి కుండపోత వర్షం చూసి అంటూ పరవశించిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-01-2020, 10:28 AM



Users browsing this thread: 7 Guest(s)