Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మా అక్కయ్యా .........కృష్ణ పిలుస్తున్నాడు అయితే ఏమీ పర్లేదు రండి అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని వచ్చి తలుపుతీసాను .

నన్ను చూసి ఇంతచిన్న పిల్లాడు అంటూ ఆశ్చర్యపోయి , మేము దగ్గరకు వెళ్ళొచ్చా అని అడిగి లోపలకువచ్చి , బాబు ఉదయం నువ్వు కాపాడిన వాళ్ళందరూ మా ప్రాణానికి ప్రాణం , ఇప్పుడు నిన్ను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలుపకపోతే మా పిల్లలు మాతో మాట్లాడము అని కూర్చున్నారు . 

మాపిల్లలను ఆ వెధవల బారినుండి కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబు అంటూ తనను తాను పరిచయం చేసుకుని అందరి తరుపున చైర్మన్ నా చేతులు కలపడానికి ముందుకువచ్చారు . 



ఒక్క నిమిషం బస్ లో ఉన్న అక్కయ్యలందరూ వాళ్ళ వాళ్ళ నాన్నలతో మాట్లాడమని మొండిగా ఉన్నారు అంటారు .

అవును బాబు ............ నిన్ను కలిసి థాంక్స్ చెప్పకపోతే నాకూతురైతే తన అమ్మతో కలిసిపోయి నాకు ఫుడ్ కూడా పెట్టమని బయటకు తోసేశారు అని ఎవరికీ వినిపించకుండా నా చెవిలో చెప్పాడు .



ఒహ్ .........అలానా మీకు మంచి జరిగింది కాబట్టి మన ఊళ్ల మధ్య గొడవలున్నా .........మా ఊరివాళ్లపై కోపం ఉన్నా ఇంత దిగివచ్చారు . 



మరి అంతచేసిన నాకు మీ ఇంటి ఆడపడుచులను క్రూరమైన మానవ జంతువుల నుండి కాపాడినా జస్ట్ థాంక్స్ చెప్పి వెళ్లిపోతారా ............రుణం తీర్చుకోవాలని లేదా అని అడిగాను .

నీకు ఏమిఇచ్చినా తక్కువే బాబు చెప్పు ఏమి ఇవ్వమంటావు , డబ్బు నగలు .........అని అందరూ నన్ను చుట్టూ చుట్టేసి చెప్పు బాబు చెప్పు అని అడిగారు .



మా ఊరివాళ్ళంతా ఎంత డబ్బు నగలు అడుగుతాడో అని గుసగుసలాడుకుంటూ మావైపు చూస్తున్నారు .



చెప్పు బాబు ఎంతైనా ఇస్తాము ............

మాట తప్పరు కదా .........

బాబు నేను ఊరి చైర్మన్ , ఇతడు సర్పంచి..........

అక్కయ్యవైపు చూస్తూ నీళ్లు కావాలి అని అడిగాను .

నీళ్ళా............. అని వచ్చినవారంతా ఆశ్చర్యపోతుంటే .........

అక్కయ్యకు మాత్రం మొత్తం అర్థమైపోయి కళ్ళల్లో నీళ్లతో , yes yes తమ్ముడూ అంటూ తల ఊపింది .



అవును మా ఊరి పొలాలు తడవటానికి నీళ్లు కావాలి , ఆ నీళ్లు మీరు వదిలితేనే వస్తాయని మా అక్కయ్య ద్వారా తెలుసుకున్నాను . ఆ పొలాలను చూసి మా అక్కయ్య మరియు మా ఊరివాళ్ళంతా బాధపడని రోజులేదు , మీ పొలాలకు కావాల్సిన నీటిని డబల్ తీసుకుని మిగిలిన నీటిని మాఊరికి వదలండి , అప్పుడు నేనే మీకు చేతులెత్తి నమస్కరిస్తాను అనిచెప్పాను . ఎవరో రాజకీయ స్వార్థం కోసం స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి అన్నదమ్ముల్లా కలిసున్న మనం ఇలా గొడవలు పడటం భావి తరాలకు మంచిది కాదని చెప్పాను. పంటలు సరిగ్గా పండకపోవడం వలన గత కొన్ని సంవత్సరాలుగా మా ఊరి వాళ్లంతా మా ఊరి అమ్మకు జాతర కూడా జరిపించలేదు .



నామాటలను విని మా ఊరు ఊరు మొత్తం ఒకరొకరిని చూసుకుని షాక్ లో ఉండిపోయారు .

 బాబు అధితప్ప ఏదైనా అని .........చెప్పబోయి , మాటిచ్చామని గుర్తుకువచ్చి ఆగిపోయి , తలదించుకొని ఒక్కమాటకూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు .



 అక్కయ్యా ..........అంటూ కళ్ళల్లో నీళ్లతో వెళ్లి మనవల్ల కూడా కాలేదు అక్కా అంటూ హత్తుకొని ఏడవడం మొదలెట్టాను . 

అక్కయ్య ఎలా ఓదార్చాలో తెలియక నానా తలపై చేతులువేసి స్పృశించింది .

రేయ్ మహేష్ నీ ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నానురా అంటూ భుజం పై చేతిని వేసి ఓదార్చాడు .

అమ్మ తన కన్నీళ్లను తుడుచుకుని లోపలకువెళ్లి తాగడానికి నీళ్లు తీసుకొనివచ్చి తలపై ప్రాణంలా స్పృశించింది .



ఇక మా ఊరివాళ్ళందరి కళ్ళల్లో నీళ్లతో మావైపు దండం పెట్టి బాధపడుతూ వెళ్లిపోయారు .



అమ్మ అక్కయ్య ఓదారుస్తూ లోపలికి పిలుచుకొనివెళ్లారు .

కృష్ణ కూడా మావెంటే వచ్చి చాలాసేపు ఉండి వెళ్ళిపోయాడు .

తరువాత ఊరిలో ఉండే అక్కయ్య ఫ్రెండ్స్ , అమ్మకు తెలిసిన వాళ్ళకు విషయం తెలిసి ఇంటికి వచ్చారు . 

రాత్రి అమ్మ ప్లేటులో వడ్డించుకొని వచ్చి తినిపించబోయినా ...........అక్కయ్యా ....నాకు తినాలని లేదు అంటూ అక్కయ్య గుండెలపై వాలిపోయి ఏడుస్తూ ఏడుస్తూనే ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోయాను .



తెల్లవారకముందే నిద్రమబ్బుతో చెంబు చేతబట్టుకొని చెరువు గట్టుకు వెళ్లిన ఊరివాళ్లకు , నీళ్ల చప్పుడు వినిపించి చెరువు వైపు చూస్తే చెరువు మొత్తం నీళ్లతో నిండిపోయి పొలాలవైపు చిన్న చిన్న కాలువల్లోకి వెళుతుండటం , ఆ నీళ్లన్నీ ముందు ఊరినుండి పెద్ద కాలువలో వస్తుండటం చూసి చెంబుని అక్కడికక్కడే వదిలేసి ఊరిలోకి వచ్చి , ఊరంతా వినిపించేలా చెరువు మొత్తం నీటితో నిండిపోయింది లేవండ్రా బాబు అని అరవడంతో అందరూ ఉలిక్కిపడి లేచి బయటకువచ్చి విషయం తెలుసుకుని చెరువు దగ్గరకు పరుగులుతీశారు .



దగ్గరవుతున్న కొద్దీ నీళ్ల చప్పుడుకు పెదాలపై చిరునవ్వుతో గట్టుమీదకు చేరి నీళ్లతో కలకళలాడుతుండటం చూసి ఆనందంతో పరవశించిపోయి , రేయ్ ఇకనుండి మన అదృష్టం మారబోతోంది అంటూ గెంతులేశారు , మరి కొందరైతే ఏకంగా నీళ్ళల్లోకి దుంకేసి ఈతాడారు .



 అన్నా ఇక అన్ని పొలాల్లోకి వదులుదామా అని ఒకరు అడిగాడు .

తమ్ముడూ ఇలా చెరువు మొత్తం నిండిందంటే దానికి కారణం ఎవరో తెలుసుకదా ....... రేయ్ పదండ్రా మహేష్ ఇంటికి , మహేష్ ద్వారానే అన్ని పొలాలకు నీళ్లు వెళ్లేలా చిన్న కాలువల గాట్లు తెరిపిద్దాము , కొంతమంది పూజ ఏర్పాట్లు చెయ్యండి అంటూ ఊరంతా కదిలింది...............
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-12-2019, 10:07 AM



Users browsing this thread: 11 Guest(s)