Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#14
రోజులు గడుస్తున్నాయి..... ఓ రోజు అరవింద్ రాజీవ్ తో " రాజీవ్, నువ్వు సాయంత్రం ఫ్రీ అయితే నీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు. "ఓకే, ఎక్కడ కలుద్దాం?" "బీచ్ దగ్గర...." "సరే, " అన్నాడు రాజీవ్. ఇద్దరు కలిసి రాజీవ్ బండిపై యూనివర్సిటీ నుండి బయలుదేరారు. సంధ్యా సమయంలో బీచ్ చాలా అందంగా ఉంది. బండి పార్క్ చేసి ఒక రాయిపై కూర్చున్నారు. అలలు వచ్చి ఆ రాయికి కొట్టుకుని వెనక్కి వెళ్తున్నాయి. కనికరించని ప్రియుడి గుండె రాయి అయితే, ప్రియురాలు అలలై ఆ రాయిని కదిలించడానికి కన్నీటితో దరిచేరుతున్నట్టుగా ఉంది. అరవింద్ తన జేబులోంచి మొబైల్ తీసి రాజీవ్ కి ఇచ్చాడు. రాజీవ్ దాన్ని అందుకుంటూ "కొత్త మొబైలా?" అని అడిగాడు. " విషయం అది కాదు. ఇన్ బాక్స్ ఓపెన్ చేసి చూడు " అన్నాడు అరవింద్. రాజీవ్ ఇన్ బాక్స్ ఓపెన్ చేసాడు. నవ్య పంపిన మెసేజ్ ఉంది. అందులో " హాయ్ అరవింద్ అన్నయ్య, నేను రాజీవ్ తో కలిసి ఉంటున్నానే కాని అస్సలు దగ్గరవలేకపోతున్నాను. తనని ప్రేమిస్తున్న విషయం తనికి తెలిసినా కూడా ఎందుకు ఇష్టపడటం లేదో నాకు అర్ధం కావడం లేదు. ఒక అమ్మాయి ఇంతలా సిగ్గు విడిచి చెప్తున్నా సరే రాజీవ్ ఎందుకలా దూరం చేస్తున్నాడో తెలియడం లేదు. నాలో ఏమి నచ్చలేదో ఒక్కటి చెప్పమను అన్నయ్యా , తనకోసం ఏమైనా మార్చుకుంటాను. ఇంతలా అతన్నే ఎందుకు కోరుకుంటున్నావు అంటే నా దగ్గరున్న ఒకే ఒక్క సమాధానం అతన్ని నేను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను" అని ఉంది. దాదాపు నాలుగున్నర పేజీల ఫోన్ మెసేజ్. చదివిన తర్వాత అరవింద్ కి మొబైల్ ఇచ్చాడు. ఏమి మాట్లాడకుండా సముద్రంకేసి చూస్తూ నుంచున్నాడు రాజీవ్.  "ఏమి చెప్పమంటావ్?" అని ప్రశ్నించాడు అరవింద్.  "చచ్చిపొమ్మను...." అన్నాడు రాజీవ్ బదులుగా. పెద్ద అల వచ్చి ఆ రాయికి కొట్టుకుని చెల్లాచెదురైపోయింది. చిన్న చిన్న నీటి తుంపరలు వాళ్ళని తడిపేసాయి. అరవింద్ కనుబొమ్మలు దగ్గరయ్యాయి.  క్షణం తర్వాత "అంతకంటే ఇంకేం చేస్తారు ప్రేమించినవాడు కాదంటే " అన్నాడు రాజీవ్ మళ్ళీ.  "ఫూలిష్ గా మాట్లాడకు రాజీవ్ " కీచుమంది అరవింద్ గొంతు.  "కాకపోతే ఏంటి అరవింద్? నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఇంకా ఏమి ఆశించి నా వెంట పడుతోంది. ఓకే, ఇంతవరకు వచ్చింది కాబట్టి నీకో నిజం చెప్తాను. నిరంజన్, అచ్యుత్ లకు కూడా తెలియని నిజం. అది విన్నాక నువ్వే నవ్యకి నచ్చచెప్పు, నాకు తనకు కుదరని పని అని" అన్నాడు రాజీవ్.  "ఏంటా నిజం?" ప్రశ్నించాడు అరవింద్.  రెండు నిమిషాలు పాటు మౌనం వహించాడు రాజీవ్. గట్టిగా శ్వాస తీసి " మేఘన నా ఎక్స్-గర్ల్ ఫ్రెండ్. తను నేను ఒకప్పుడు ప్రేమించుకున్నాం" అన్నాడు. పెద్ద అల వచ్చి ముఖంపై కొట్టినట్టైంది అరవింద్కి.  "అవునా ? ఇదంతా ఎప్పుడు? " అనడిగాడు అరవింద్. "ఏంటా నిజం?" ప్రశ్నించాడు అరవింద్.  రెండు నిమిషాలు పాటు మౌనం వహించాడు. గట్టిగా శ్వాస తీసి " మేఘన నా ఎక్స్-గర్ల్ ఫ్రెండ్. తను నేను ఒకప్పుడు ప్రేమించుకున్నాం" అన్నాడు రాజీవ్. పెద్ద అల వచ్చి ముఖంపై కొట్టినట్టైంది అరవింద్.  "అవునా ? ఇదంతా ఎప్పుడు? " అనడిగాడు.  "సంవత్సరం క్రితం. తనో మూడిస్ట్. ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. అస్సలు అర్ధమయ్యేది కాదు. ఒకసారి అతి ప్రేమ.. ఒకసారి అతి ద్వేషం. ఒక్కోసారి నేనెవరో తెలీనట్టు ప్రవర్తించేది. ఇంట్లో ఒక్కత్తే అవడం వల్ల తను చెప్పిందే వేదం, ఏలిందే రాజ్యం అన్నట్టుగా ఉండేది. అవన్నీ నాపై రుద్దాలనుకునేది. తను నుంచోమంటే నుంచోవాలి. కూర్చోమంటే కూర్చోవాలి. తన ప్రేమ కోసం ఏది కాదనేవాడిని కాదు. రాత్రి 11 గంటలకు కాల్ చేసి నిన్ను చూడాలని ఉంది అనేది తీరా తను చెప్పిన చోటుకు వెళ్లి ఆమెకు ఫోన్ చేస్తే సారీ నిద్ర పట్టేసింది అనేది. తన బర్త్ డే మర్చిపోయానని నా చేత తన పుట్టిన రోజు తేదిని 1000 సార్లు రాయించింది. తీరా రాసాక నాకు బ్లాక్ ఇంకు అంటే ఇష్టం ఉండదని తెలుసుగా, మరి బ్లాక్ పెన్ తో ఎందుకు రాశావ్ అని అలిగేది. తనతో రెండు మూడు సార్లు వారించాను. మళ్ళీ నేనే సారీ చెప్పేవాడిని. ఇగో ప్రొబ్లెమ్స్, పంతాలు... చిన్న చిన్న మనస్పర్ధలు... కోపాలు.. చివరకు గొడవలు వరకు వెళ్లి ఇంక తనని భరించలేక విడిపోయాము" అన్నాడు.  అరవింద్ అంతా విని సాలోచనగా "మరి నవ్యకి ఈ విషయం చెప్పేయచ్చు కదా?" అనడిగాడు.  "ఎందుకు చెప్పాలి? పి.జి లో మళ్ళీ మేము కలిసే వాళ్ళమే. కాని నవ్య వచ్చి నన్ను ప్రేమిస్తున్నట్టు ముందుగా వెళ్లి మేఘనకు చెప్పింది. ఆ తర్వాత నేను ఒకటి రెండు సార్లు నవ్యతో మాట్లాడడం చూసి మేఘన పూర్తిగా దూరమైపోయింది. మేఘనకు ఎక్స్-బాయ్ ఫ్రెండ్ గా చెలామణి అవడం నాకిష్టం లేదు. అలాంటి అమ్మాయిని వీడేలా ప్రేమించాడు అనే సానుభూతి నాకొద్దు. అందుకే చెప్పలేదు. అందుకే నిన్ను తన ఇంట్లో నుండి ఖాళి చేయమని అడిగాను. నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను ఎక్కడ సాధిస్తుందో అని, " ముగించాడు రాజీవ్.  రాజీవ్ మాటలు పూర్తిగా విన్న అరవింద్ "ఒక రకంగా మేఘనే నీకంటే క్లారిటీతో ఉందిర. ఇంకా చెప్పాలంటే నీ మెంటాల్టినే చాలా తేడాగా ఉంది. ఏమి అనుకోకురా రాజీవ్ ఇలా అంటున్నానని , నువ్వు మంచివాడివా? చెడ్డవాడివా? అని ఆలోచిస్తే నీకే ఆన్సర్ ఉండదు. రెండింటికి మద్యలో కూడా లేవు. నువ్వు వేరే ఏదో! ఒకమ్మాయి నిజంగా ప్రేమనిస్తున్నప్పుడు తీసుకోలేని చేతకానివాడివి. అందుకున్న ప్రేమను నిర్భయంగా చెప్పుకోలేని పిరికివాడివి. అసలు ఎందులోనూ క్లారిటీ లేనివాడివి. ఒక్క విషయం చెప్తాను రాజీవ్, బస్సు మిస్ అవ్వచ్చు. ట్రైన్ మిస్ అవ్వచ్చు. కాని జీవితం మిస్ అవకూడదు. నిన్ను కోరి ఒక అమ్మాయి నీకోసం అన్నీ మార్చుకోడానికి, ఏమైనా వదులుకోవడానికి సిద్ధపడిందంటే అది నీ అదృష్టం. అది అందరికి దక్కదు. నీకోసం జీవితం అంతా ఎదురు చూడమన్నా ఎదురు చూసేంత స్వచ్చమైన పిచ్చి ప్రేమ నవ్యకి ఉంది. అలాంటి ప్రేమని మిస్ అయ్యావంటే నీ అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండడు. ఒక్కసారి నవ్య ప్రేమని ఇవ్వడం ఆపేసిందంటే నువ్వు వెయ్యి జన్మలెత్తినా అలాంటి ప్రేమను పొందలేవు. నీకు ఎక్కడా దొరకదు కూడా!!" ముగించాడు అరవింద్. రాజీవ్ మౌనం వహించాడు. ఇద్దరు అక్కడి నుండి బయలు దేరారు. 

* * *





[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:56 AM



Users browsing this thread: 2 Guest(s)