Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#8
"కాదని ఎవరన్నారు" చెప్పాడు అచ్యుత్.  వాళ్ళు దగ్గరగా వచ్చాక "హాయ్ మేఘనా" అని మేఘనని పలకరించాడు.  మేఘన ఏమి పట్టనట్టు పలకరించకుండా వెళ్ళిపోయింది. అరవింద్ కి అర్ధం కాలేదు.  రాత్రి ఇంటికెళ్ళాక అడిగాడు. "ఏంటి ఫ్రెండ్స్ అన్నావ్? పలకరించినపుడు తెలీనట్టు వెళ్లిపోయావ్?" అని అడిగాడు.  "నువ్వు నన్ను ఎందుకు పలకరించావో నాకు తెలుసు" అంది మేఘన.  "ఎందుకు?" అనడిగాడు... "పక్కన నా ఫ్రెండ్ ఉంది కదా. దాన్ని పరిచయం చేయడం కోసం" అంది  "వాట్???" అరిచాడు.  "వద్దు, చెప్పకు. మీ అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు" అంది  "ఏం తెలుసు?” ప్రశ్నించాడు.  "నాకు అన్ని తెలుసు" అంది సూటిగా చూస్తూ.  "నా ఫ్రెండ్ పేరు మౌనిక. ఆమె అన్న పేరు సుధీర్, కాలేజీ లీడర్. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. చాలా? ఇంటి అడ్రెస్స్ కూడా చెప్పాలా?" అంది తనే మళ్ళి.  "నాకు ఆమె పేరు వరకు తెలుసు" అన్నాడు.  "మరెందుకు కన్ఫర్మేషన్ కోసమా?" అంది  అరవింద్ కి మేఘనతో ఎలా మాట్లాడాలో తెలియలేదు. "అది కాదు మేఘనా నేను నిజంగానే నిన్ను పలకరిద్దామనే హాయ్ చెప్పాను" అన్నాడు.  "అవసరం లేదు" అంది పదునుగా.  "ఏంటి మీ ఫ్రెండ్ తో ఫ్రెండ్షిప్ చేయకూడదా?" అని అడిగాడు  "అదేమంత ఈజీ కాదు. అది అందరితోను ఫ్రెండ్షిప్ చేయదు. నాలాగా బాగా సెలెక్టివ్. అయినా నీకంత సీన్ లేదు" అంది  "ఛాలెంజ్ చేస్తున్నావా?" అని అడిగాడు  అరవింద్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "తనతో ఫ్రెండ్ షిప్ చేస్తావా? చేయాలని ఉందా?" అని అడిగింది.  "నాకంత సీన్ ఉందో లేదో చూపిస్తాను. చూస్తావా?" అన్నాడు  "చేయ్ చూద్దాం!, నీ చదువు అయ్యేలోపు అది నీకు ఫ్రెండ్ అయితే చాలు. టేక్ యువర్ ఓన్ టైం" అంది ధీమాతో.  "15 రోజులు చాలు నాకు. పందెం?" అని అన్నాడు  "సరే నీ ఇష్టం. ఓడిపోతే?" అని అడిగింది.  "నీ ఇష్టం... " అని చెప్పాడు.  "ఓకే 15 రోజుల్లో ఆమె నీతో ఫ్రెండ్ షిప్ చేయాలి. నీకోసం వెయిట్ చేయాలి. నీకోసం నన్ను కూడా ఇగ్నోర్ చేసేంతలా చేయాలి. నేను ఓడిపోతే నువ్వేమి చెప్తే అది చేస్తాను. నేను గెలిస్తే నేను ఏమి చెప్తే అది నువ్వు చేయాలి".అంది మేఘన.  "ఓకే. ఫైన్. ఈ విషయం మనిద్దరి మద్యనే ఉండాలి" అన్నాడు అరవింద్.  "సరే" అంది  "అల్ ది బెస్ట్ చెప్పు మరి నాకు" అన్నాడు  అరవింద్ ని పైనుంచి కిందవరకు చూసి వెళ్ళిపోయింది. 

* * *
"ఏంటోరా జీవితం అంతా చాలా రొటీన్ గా గడిచిపోతోంది. సినిమాలోలాగా చేసులు, ఉరుకులు, పరుగులు, కత్తులు ఇలా ఒక్కరోజైనా ఉండాలనిపిస్తోంది" అన్నాడు అచ్యుత్.  "ఏరా, బాగున్నావా? రాత్రి ఏమైనా కరిచిందా?" అడిగాడు రాజీవ్.  "అదేం లేదురా.. నిజంగా ఒక్కసారైనా ఆ యాంగల్ చూడాలని ఉంది" అన్నాడు అచ్యుత్.  అరవింద్ అప్పుడే అక్కడికి వస్తు" మీ కలలు పండే రోజు దగ్గర పడింది " అన్నాడు నవ్వుతు.  "ఏంటీ!!!!!" అరిచారు ఇద్దరు కంగారు పడుతూ.  అరవింద్ "అదేరా చైతన్యతో మాట్లాడాలి అన్నావుగా" అన్నాడు ప్రశాంతంగా.  "అవునా ఎప్పుడు?" ఆత్రుతగా అడిగాడు.  "వచ్చేవారం ప్రయత్నిస్తాను. లేకపోతే ఆపై వారం ఖచ్చితం" అన్నాడు దృడంగా. చాలా ఆనందపడిపోయాడు.  "ఇంతకి ఏమి చేయబోతున్నావ్?" అని అడిగాడు రాజీవ్.  రాజీవ్ వైపు చూసి "సస్పెన్స్.. అది సరే ఇంతకి నిరంజన్ ఏడి?" అని టాపిక్ మార్చేశాడు అరవింద్.  "వాడు క్లాసు లో ఉంటాడు. వెళ్ళు." చెప్పాడు అచ్యుత్.  నిరంజన్ మైక్రోబయాలజీ ల్యాబ్ వర్క్ లో ఉన్నాడు. అరవింద్ బయట నుండే పిలిచాడు. ల్యాబ్ అయ్యాక కలవమని చెప్పి వెళ్ళిపోయాడు. ల్యాబ్ వర్క్ అయ్యాక ఇద్దరు కలిసి యూనివర్సిటీ ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్ళారు. పర్మిషన్ తీసుకుని లోపలకి వెళ్లి "గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అరవింద్. మీతో ఒక విషయం మాట్లాడుదామని వచ్చాము" అన్నాడు." చెప్పండి, దేని గురించి " అని అడిగి మళ్ళి "వెయిట్ ఎ మినిట్" అని చెప్పి కూర్చోమన్నట్టుగా సైగ చేసాడు.  ప్రిన్సిపాల్ సన్నగా నల్లగా ఉన్నాడు. ఉన్న నాలుగైదు ఉంగరాల వెంట్రుకలతో బట్టతలను కవర్ చేసాడు. ముక్కు సూదిగా ఉంది. ఆ ముక్కుదాకా గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు వదిలేసాడు. మొదటి రెండు పళ్ళ మధ్యన గుండు సూది పట్టేంత గ్యాప్ ఉంది. రెండు చేతుల ఉంగరం వేళ్ళు బంగారంతో వాచాయి. బ్లూ కలర్ కోటు వేసుకున్నాడు. అదో రకమైన సెంట్ వాసన గుప్పుమని వస్తోంది. ఆయన టేబుల్ అద్దం కింద వివేకానందుని సూక్తుల ఫోటోలు, జీసస్ 10 సూత్రాలు ఉన్నాయి. అరవింద్ ఇవ్వన్ని గమనిస్తూ కూర్చున్నాడు.  ప్రిన్సిపాల్ "ఇప్పుడు చెప్పండి" అన్నాడు పెన్ కేప్ మూస్తూ.  "మేము ఇక్కడ పిహెచ్.డి చేస్తున్నాం సార్. నేను బయోకెమిస్ట్రీ. ఇతను నా ఫ్రెండ్ నిరంజన్ మైక్రోబయాలజీ. మాకో ఆలోచన వచ్చింది సార్. దానిని మీతో చెప్దామని వచ్చాము" అన్నాడు అరవింద్.  "ఏంటా ఆలోచనా ?" అని అడిగాడు ప్రిన్సిపాల్ ముందుకు వాలుతూ.  "మన యూనివర్సిటీ రూల్ ప్రకారం ప్రతి సెకండ్ ఇయర్ లైఫ్ సైన్సు స్టూడెంట్ తప్పని సరిగా ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వాటికి కుడా మార్కులు కేటాయించిన విషయం మీకు తెలిసిందే. అందుకోసం స్టూడెంట్స్ బయటకు వెళ్లి ప్రాజెక్ట్ చేయడం వల్ల చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలా కాకుండా పిహెచ్.డి చేస్తున్న మా దగ్గర వాళ్లకు సరిపోయేటట్టు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిని మన యూనివర్సిటీలోనే మన ప్రొఫెస్సొర్స్ ఆద్వర్యంలో చేయడం వల్ల వాళ్లకు మేలు కలుగుతుంది. అలాగే మన యూనివర్సిటీకి మంచి ప్రాజెక్ట్స్ చేసిన రికార్డు ఉంటుంది." అని చెప్పాడు.  నిరంజన్ అందుకుంటూ "అంతే కాదు సార్, ఇలా చేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది. రికార్డు బైండింగ్ తో సహా అన్ని పనులు ఆన్ టైం లో పూర్తి అవుతాయి. ఆ తరువాత మిగిలిన సమయంలో వాళ్ళు సెమినార్ కి ప్రిపేర్ అయ్యి బాగా ప్రెసెంట్ చేస్తారు. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ అండ్ బయోకెమిస్ట్రీ వంటి అన్ని డిపార్ట్మెంట్ల స్టూడెంట్స్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రాజెక్ట్ ని మూడు పార్ట్శ్ కింద విడగొట్టి దానిని ముగ్గురు వేర్వేరు డిపార్ట్మెంట్ల స్టూడెంట్స్ కి ఇస్తాము. దానిని వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత అంతా కలిపి వాళ్ళ థీసెస్ లో పెట్టుకుంటారు. వాళ్ళు చేసినదే కాకుండా మిగిలిన వాటిలో కూడా అవగాహన ఏర్పడుతుంది." ముగించాడు. అరవింద్ కొనసాగిస్తూ " స్టూడెంట్స్ అందరు ఇలా చేయడానికి సిద్ధంగానే ఉంటారని నా అబిప్రాయం. మీరు ఒప్పుకుంటే అమలు చేద్దామని ఉంది సార్. దీనికి సంబందించిన వివరాలు, ప్రోటోకాల్స్, ప్రొసీడింగ్స్ అన్నీ ఈ డాక్యుమెంట్ లో ఉన్నాయి " అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ అందిచాడు.  ప్రిన్సిపాల్ దానిని అందుకుని ఆ డాక్యుమెంట్ ని చూసి "మీ ఆలోచన చాలా బాగుంది. కాని ఈ విషయంపై డిపార్ట్మెంట్ హెచ్.ఓ.డిలతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి ఏ విషయం చెప్తాను" అన్నాడు.  "సరే సార్ " అంటూ ఇద్దరు లేచారు.  "ఓకే" అన్నాడు ప్రిన్సిపాల్.  "థాంక్ యు సార్ " అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాక "అదేం కంపురా బాబు కడుపులో తిప్పేసింది" అన్నాడు నిరంజన్. "నాక్కూడా , చెప్పాలనుకున్న చాలా పాయింట్స్ మర్చిపోయాను." అన్నాడు అరవింద్.  "వర్క్ అవుట్ అవుతుందా మరి?"  "ఎందుకవదు? తప్పకుండా అవుతుంది. ప్రాజెక్ట్స్ మనవి అన్నాం కనక మన ప్రొఫెసర్స్అందరు భారం అంతా మనపై పాడేస్తారు. వాళ్ళు రిలాక్స్ అయిపోతారు"  "అది ఓకే రా , డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కలిసి చేయడం కుదురుతుందా?"  “అది కూడా సమస్యేం కాదు, ప్రొఫెసర్స్ చెప్పాక చేయను అనకూడదు. ఒప్పుకోవాల్సిందే.




[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:51 AM



Users browsing this thread: 1 Guest(s)