Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#7
ఆ తరువాత రోజు మాములుగా యూనివర్సిటీ కి బయలుదేరాడు అరవింద్.మేఘన కూడా అప్పుడే బయలుదేరడం గమినించాడు. కానీ ఏమి పట్టనట్టుగా మెట్లు దిగి బయటకు నడిచాడు. మేఘన అరవింద్ వెనకాల నడుచుకుంటూ వెళ్తోంది. మేఘన నీడ అరవింద్కి దగ్గరగా ఉంది కాని కొంచెం వెనకగా ఉంది. అలా కొంతదూరం నడిచాక కొంతమంది కుర్రాళ్ళు అటుగా పోతు మేఘన వైపు అరవింద్ వైపు చూస్తూ ఏవో కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది గమనించిన మేఘన నడక ఆపేసింది.అరవింద్ ఆగిన నీడను చూసి వెనక్కి తిరిగి గుడ్లు మిటకరించి చూస్తున్న మేఘనతో "ఏమయిందండి?" అని అడిగాడు. అలానే అరవింద్ వైపు చూస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా అరవింద్ ని దాటుకుని వెళ్ళాక తాను నడవడం ప్రారంభించింది. ఈ సారి అరవింద్ నీడ మేఘనను ఫాలో అవడం మొదలయింది. మళ్ళి కొంతమంది కుర్రాళ్ళు ఇటుగా వెళ్తూ వాళ్ళని చూస్తూ ఏవో కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నడవడం ఆపేసి వెనక్కి తిరిగి చూసింది సీరియస్ గా."మళ్ళీ ఏమైందండి?, ఏమైనా ప్రాబ్లెమా?" అని అడిగాడు."నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావ్?"అని అడిగింది."నాన్ సెన్స్ . నేను ఫాలో అవడం ఏంటి? మీరే కదా నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్లారు?" అన్నాడు"నా వెనకాల రాకండి అంతే" అంది"చుడండి. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు" అన్నాడు కొంచెం కోపంతోనే. అలానే అరవింద్ వైపు చూస్తూ రోడ్ అటు వైపు కి దాటుకుంటూ వెళ్ళింది. అరవింద్ కి చాలా చిరాకుగా అనిపించింది."ఏంటిరా బాబు ఇది" అనుకున్నాడు మనసులో. తను ఏమి జరగనట్టు నడవడం మొదలెట్టింది. రోడ్ కి ఇరువైపుల సమాంతరంగా వెళ్తున్నారు ఇద్దరు. మద్యలో ఎందుకో ఆదమరపుగా మేఘన్ వైపు చూసాడు . ఆమె కూడా చూసింది."ఏంటలా చూస్తున్నావ్?"అడిగింది. సమాధానం ఇవ్వకుండా నవ్వుకున్నాడు. రాజీవ్ అటుగా వెళ్తూ వీళ్ళని గమనించి అరవింద్ దగ్గర బండి ఆపి "ఎక్కు అరవింద్." అన్నాడు. అరవింద్ బండి ఎక్కి వెళ్ళిపోయాడు.బండి మీద వెళ్తూ "ఇంతకి చెప్పనే లేదు ఎక్కడ ఉంటున్నావు?" అనడిగాడు రాజీవ్."అదే మేఘన ఉందే, మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఫై పోర్షన్ లో అద్దెకు ఉంటున్నాను" చెప్పాడు."చచ్చావ్ పో " అన్నాడు రాజీవ్."ఏం? ఎందుకు?" అని అడిగాడు అరవింద్."అదో మెంటల్ కేసు. ఎప్పుడెలా ఉంటుందో దానికే తెలీదు. దాని ఇంట్లో ఉండే బదులు ఏ అండమాన్ జైలులోనో, తీహార్ జైల్లోనో ఉంటే కొంతలో కొంత హ్యాపీగా ఉండచ్చు"చెప్పాడు రాజీవ్."అవును. ఆమెది టిపికల్ మెంటాలిటీ. నేను గమనించాను" అన్నాడు అరవింద్."ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో. ఆ ఇల్లు ఖాళి చేసేయ్. మా ఫ్రెండ్స్ ఇంతకు ముందు అలానే ఉండేవారు. ఒకరోజు పాపం ఒకడికి మోషన్స్ పట్టుకున్నాయ్. మాటి మాటికి బాత్రూంకి వెళ్తున్నాడు నీళ్ళు అయిపోతున్నాయని బాత్రూం తలుపు తాళం పెట్టేసింది. పిచ్చిది. పాపం వాడు అగ్గగ్గలాడిపోయాడు. వాడి బాధ వర్ణనాతీతం. గోడలు పట్టుకుని నడిచాడంటే నమ్ము. తర్వాత వాళ్ళ నాన్నే పాపపరిహారంగా హాస్పిటల్ లో చేర్పించి వైద్యం చేయించాడు." అని చెప్పాడు రాజీవ్.యూనివర్సిటీ చేరుకొని ఎవరి క్లాసు కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం క్లాస్లు ముగించుకుని లంచ్ టైం కి అందరు కాంటీన్ లో కలిసారు. "హాయ్ మౌనిక!" అని పిలుపు వినిపించింది అందరికి.అరవింద్ తల తిప్పి చూసాడు......యూనివర్సిటీ చేరుకొని ఎవరి క్లాసు కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం క్లాస్లు ముగించుకుని లంచ్ టైం కి అందరు కాంటీన్ లో కలిసారు. "హాయ్ మౌనిక!" అని పిలుపు వినిపించింది అందరికి.  అరవింద్ తల తిప్పి చూసాడు.  అందాల బొమ్మ, దేవలోకం నుండి అప్సరస దిగి వచ్చినట్టుంది. ఒక్కొక్క సొగసు ఒక్కొక్క వింతలా అనిపించాయి. రెప్ప వేయలేని అందం ఆమెది. బ్రహ్మ దేముడు 10 ఏళ్ల పాటు అన్నపానియాలు మానేసి తయారుచేసాడేమో అనుకున్నాడు. ఆమెను వర్ణించడానికి తెలుగులో పదాలు లేవు. పాలరాతి శిల్పం అనాలో, పాలతో కడిగిన ముత్యం అనాలో తెలియడం లేదు అరవింద్ కి. "అబ్బ ఏం అందం? ఎవడు చేసుకుంటాడోగాని” అని ప్రతి మగాడు అనుకేనేట్టుగా ఉంది ఆ అమ్మాయి అందం.  "ఇంక చాలు" అన్నాడు రాజీవ్.  "చూస్తున్న కొద్దీ ఏదో కొత్తదనం ఉందిరా ఆమెలో" అన్నాడు అరవింద్.  "ముందు అలానే ఉంటుంది వాళ్ళ అన్నకు తెలిస్తే అప్పుడుంటుంది. వెళ్దామా?" అంటూ లేచాడు నిరంజన్. అందరు అక్కడినుండి బయలుదేరారు.  అరవింద్ ఇంటికెళ్ళేసరికి రాత్రి 9 అయింది. గేటు తీసుకుంటూ లోపలికి వెళ్తుంటే మేఘన గమనించి బయటకు వచ్చి "ఏంటి లేటుగా వచ్చావు?" అని అడిగింది. కొంపతీసి నాకోసం ఎదురుచుస్తోందా ఏంటి? అని అనుకున్నాడు మనసులో.  "రాజీవ్ కి ఏదో డౌట్ అంటే వాళ్ళింటికి వెళ్లి చెప్పి వస్తున్నాను" అని చెప్పాడు.  "భోజనం చేశావా" అని అడిగింది.  ఆశ్చర్యపోయాడు తను సరిగ్గానే విన్నాడా లేక తప్పుగా విన్నాడా అని. కానీ వెంటనే తేరుకుని "లేదండి" అన్నాడు. మేఘన ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అరవింద్ మాములుగా మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుని తువ్వాలు దండెంఫై వేయడానికి బయటకు వచ్చాడు. మెట్లు ఎక్కుతూ మేఘన రావడం గమనించాడు.  ఆమె చేతిలో క్యారేజి ఉంది. "ఏంటండి ఇది ?" అనడిగాడు.  "మీరు ఏమి తినలేదన్నారుగా, అందుకే భోజనం పట్టుకొచ్చాను" అంది.  ఆ రోజు పిల్లి పాలు తాగేసింది అంటే పాల ప్యాకెట్ ఉన్న లేదని చెప్పింది. ఈ రోజు అడగకుండా భోజనం తెచ్చిందేమిటి. ఏది ఏమైనా మనసులో ఆమెపై అభిమానం కలిగింది."కూర, పులుసు, పెరుగు కూడా తెచ్చాను తినండి" అంటూ బల్లపై పెట్టి వెళ్లిపోబోతున్న మేఘనతో "మేఘన గారు, కంపెనీ ఇవ్వచ్చుగా మీకు అభ్యంతరం లేకపోతేనే" అన్నాడు. కాసేపు ఆలోచించి అలాగే అని అంది. ఆరుబయటే భోజనం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆమెకు కూడా కుర్చీ వేసి కూర్చోమని చెప్పి, లోపలికి వెళ్లి కంచం మంచినీళ్ళు తెచ్చుకుని కూర్చున్నాడు. వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది.ఆ సమయoలో మేఘన చాలా అందంగా కనిపించింది. ఆమె అహంకారం, అర్ధం కాని మనస్తత్వం కనిపించలేదు. భోజనం చేయడం మొదలెట్టాడు. కూరలో ఉప్పు లేదు. పులుసు కూడా అంత రుచిగా లేదు. పెరుగు పులిసిపోయింది. అయిన కిక్కురుమనకుండా తిన్నాడు. రుచుల గురించి ప్రస్తావిస్తే మళ్ళి ఎలా రియాక్ట్ అవ్తుందో అనే భయంతో ఊరుకున్నాడు. కడుపునిండా తిని చేయి కడుగుకుని "థాంక్స్ అండి" అన్నాడు మనస్పూర్తిగా.  "పరవాలేదు" అంది. చల్లటి గాలి వీస్తోంది. పిట్టగోడకు కాలు ఆన్చి "ఇంకేంటి విశేషాలు?" అని అడిగాడు.  "ఉదయం నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు?" అనడిగింది.  "ఎప్పుడు?"  "యూనివర్సిటీకి వెళ్ళేటపుడు" గుర్తు చేస్తున్నట్టుగా చెప్పింది.  ", అసలు మీరు నాతో నడవడానికే ఇబ్బంది పడ్డారు కదా?" అని అడిగాడు.  "నేను ఇబ్బంది పడ్డాను అని నీతో చెప్పనా?" అని ప్రశ్నిచింది.  "మరి అన్ని సార్లు ఆగి చూడటం ఎందుకు? నన్ను దాటి ముందుకు నడవడం ఎందుకు? రోడ్ కి అవతల పక్కకి వెళ్లి మరీ నడవడం ఎందుకు?"  "నా ఇష్టం" అంది సింపుల్ గా.  అరవింద్ కి ఏమనాలో తెలియలేదు. కాసేపాగి "సరే రేపటినుండి కలిసే వెళ్దాం" అన్నాడు. మేఘన నవ్వుతూ ఫ్రెండ్స్ అంటూ చేయి చాపింది. నవ్వుతూ ఆమెకు కరచాలానం ఇచ్చాడు.  "ఓకే గుడ్ నైట్ " అంది  "గుడ్ నైట్ " అన్నాడు.  మెట్లదాకా వెళ్లి "గిన్నెలు కడిగేసి రేపు ఇచ్చేసేయ్" అని చెప్పి వెళ్ళిపోయింది. అయోమయంలో నవ్వుకున్నాడు. గిన్నెలు కడిగేసి పడుకున్నాడు.  తరవాత రోజు ఇద్దరు కలిసి యూనివర్సిటీకి బయలుదేరారు. దారిలో "అరవింద్, నీకు బ్లూ కలర్ టి షర్టు బాగుంటుంది. అదే ఆ రోజు అద్దె కోసం వచ్చినపుడు వేసుకున్నావ్ చూడు ఆ షర్టు." అంది.  "నీకు బ్లూ కలర్ నటే ఇష్టమా?" అనడిగాడు.  "మ్.. అవును. ఆ ఆకాశం నీలం. ఆ సముద్రం నీలం. ఆ రాముడు నీలం. అసలు ఈ ప్రపంచమంతా నీలంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!" అంది.  మేఘన ఇలా మాట్లాడడం మొట్టమొదటిసారో కాదో తెలీదు కాని అరవింద్ వినడం మాత్రం మొదటిసారి. ఆమె అందానికి తగ్గట్టుగా మాటలు వస్తుంటే అవి ఆమె మనసుకి అద్దం పడుతున్నట్టుగా ఉన్నాయి.  "ఇంకా?" అని అన్నాడు తను మాట్లాడితే వినాలనిపించి.  "నువ్వు ఆదివారం ఫ్రీనా?" అని అడిగింది.  "ఎస్, ఫ్రీగానే ఉంటాను.ఏం?" అని అడిగాడు.  "అప్పుడు చెప్తాను" అంది.  ఇంతలో ఒక స్కూటీ బండి వచ్చి అరవింద్ ని డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది.  అరవింద్ పడిపోతు తనని తాను ఆపుకునే ప్రయత్నంలో రోడ్ అరచేతిలో కొట్టుకుపోయింది. గుద్దేసిన మనిషి కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎవరనేది గుర్తించలేకపోయాడు. బండి నెంబర్ చూసాడు. మేఘన కంగారు పడుతూ “ఏమవలేదు కదా” అంది. “పర్లేదు” అన్నాడు.  మద్యాహ్నం క్లాస్ అయ్యాక ఆ బండి కోసం యూనివర్సిటీ అంతా తిరిగాడు.చివరికి ఆర్ట్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ బండి ఉంది. వెళ్లి దానిపై కూర్చున్నాడు ఆ బండి యజమాని కోసం. బండి అద్దంలో తన గడ్డం చూసుకుంటూ ఉండగా వెనక నుంచి ఏవో నవ్వులు వినిపించాయి. తిరిగి చూసాడు.తెలుపు చుడిదార్ వేసుకుని మెరుపు బొట్టు పెట్టుకుని ఉన్న ఓ అమ్మాయి అక్కడ ఉన్న చిన్నపిల్లలతో ముద్దాడడం చూసాడు. ఆమె కళ్ళు చిన్నగా ఉన్నాయి. కోలా ముక్కు. తెల్లటి ముఖం. ఎర్రటి పెదాలు. సూటిగా చూసే ఆమె చూపు తల తిప్పుకోనివ్వదు. కోటి చంద్రుల కాంతి ఆమె ముఖంలో. కోటి సూర్యుల కాంతి ఆమె మేనిలో. ప్రకృతి ఎంత విచిత్రమైనది. కొన్ని ప్రతి రూపాలను ఇలా అమ్మాయిల రూపంలో తయారుచేస్తుందేమో?! సినిమాల్లో చూపించినట్టుగా కొన్ని సందర్భాలు ఊహాతీతం. దూరంగా ఉన్న సముద్రం హోరు వినిపించింది. ఆకాశం ప్రశాంతతను సంతరించుకుంది. చల్లటి మలయ మారుతం వీచింది. ఏవేవో అర్ధంపర్ధం లేని ఆలోచనలు..అలా ఆ అమ్మాయి ఆ పిల్లల్ని ముద్దాడి ఒక్కసారిగా అరవింద్ వైపు తిరిగింది. అంతే, ఒక్కసారిగా అరవింద్ ఆలోచనలు స్తంబించిపోయాయి. ప్రళయం జరుగుతుంది అనుకుంటే ప్రేమ పుడుతుందా? అనిపించింది. ప్రాణంతో ఉన్నప్పుడే ఇన్ని ఫీలింగ్స్ ఉంటాయా? ఇదంతా ఆమెపై నాకు కలిగిన ఆకర్షణా! అసలు ఆకర్షణతోనే ప్రేమ మొదలౌతుందా? లేక ప్రేమ తర్వాత ఆకర్షణ పెరుగుతుందా? మరి స్నేహం పరిస్థితి ఏంటి? నిజంగా 25 ఏళ్ల కుర్రాడికి రావాల్సిన రకరకాల ఆలోచనలు అన్ని కరెక్ట్ గా ఆమెను చూసినపుడు కలిగాయి.  మొట్టమొదటిసారి మేఘనని చూసినప్పుడు, రెండోసారి మౌనికని చూసినపుడు,ఇప్పుడు ఈ అమ్మయిని చూస్తున్నప్పుడు అన్నిటిలోనూ ఒకే అలజడి!!ఆమె దగ్గరగా వచ్చి ఎదురుగా నుంచుని "ఎక్స్ క్యూస్ మి" అంది.  పక్కకు జరిగి నుంచుని "హాయ్, నా పేరు అరవింద్" అంటూ చేయి ఇచ్చాడు.  ఆమె మాములుగా "హాయ్, ఐ యామ్ అంజలి" అంది చేయి కలుపుతూ. చేతికి దెబ్బ ఉండటం వలన అరచేయి మండి "స్ స్ ...అబ్బ "అని వెనక్కి తీసేసుకున్నాడు.  "ఏమైంది?" అని అడిగింది.  "ఉదయం మీరు నన్ను గుద్దేసి వెళ్ళిపోయారు కదా , దానికి సాక్ష్యం."అన్నాడు చేయి చూపిస్తూ.  కొంచెం భయపడుతూ "ఐ యామ్ సారీ" అంది  "పరవాలేదులెండి"  "కాల్ మి అంజలి" అంది నవ్వుతూ.  "ఓకే అంజలి, బాయ్" అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు.  "దెబ్బ ఎలా ఉంది?" అని అడిగింది మేఘన.  "పర్లేదు" చెప్పాడు.  "భోజనం చేసావా?"  "చేసాను" అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు."ఒరేయ్ , ఈరోజు ఎలా అయిన చైతన్యకి నా ప్రేమ గురించి చెప్పేస్తాను. మంచి ముహూర్తం చూడు" అన్నాడు అచ్యుత్.  "ఈరోజు చెప్తాను అని మళ్ళి ముహూర్తం ఏంటిరా?" అని అడిగాడు నిరంజన్.  "నా బొంద చెప్తాడు. గత 3 ఏళ్లుగా ఇదే అంటున్నాడు" అన్నాడు రాజీవ్.  "డోంట్ డిస్కరేజ్మి ర, అసలు నీలాంటి ఫ్రెండ్స్ ఉండటం వల్లే ఇంతకాలం చెప్పలేకపోయాను" అన్నాడు నిందను రాజీవ్ పై వేస్తూ.  "అనరా, నన్నే అను. నేనే కనక నీకు హెల్ప్ చేయకపోయుంటే ఇప్పటికీ ఆమె పేరు కూడా నేకు తెలిసేది కాదు" అన్నాడు రాజీవ్.  అరవింద్ వస్తు "ఏంటి మంచి డిస్కషన్ లో ఉన్నారు?" అని అడిగాడు.  "అంతా లేదు రోజు ఉండే బాగోతమే. వీడు ప్రోపోస్ చేస్తాను అనడం. వాడిని ముహూర్తం పెట్టమని అడగడం. వీడు చెప్పకపోవడం."అన్నాడు రాజీవ్.  "ఏం అచ్యుత్ ఇప్పటివరకు ఒక్కసారికూడా నువ్వు చైతన్యతో మాట్లాడలేదా?" అని అడిగాడు అరవింద్.  "అంతలేదు వీడికి" హేళనగా అన్నాడు రాజీవ్.  "నువ్వు ఉండరా. వాడిని కనీసం మన ముందైన మాట్లాడని" అని ఇంకొంచెం అందిచాడు నిరంజన్.  "వాళ్ళ మాటలకేంగాని నువ్వు మాట్లాడతావా? మాట్లాడాలని ఉందా?" అని అడిగాడు.  "ప్రేమించిన అమ్మాయి ముందు రెండు నిమిషాలు భయపడకుండా నిలబడటమే కష్టంర, నా ఆల్ టైం రికార్డు 8 సెకన్లు. ఎందుకో చైతన్య కనిపిస్తే పక్షవాతం వచ్చినట్టు అయిపోతాను"అన్నాడు నిరాశగా.  "అలా ఏమి ఉండదు. నువ్వు మాట్లాడుతాను అంటే నేను ఏర్పాటు చేస్తాను" అన్నాడు నవ్వుతూ.  ఏదో చిన్న ఆశ చిగురించింది. అరవింద్ పై నమ్మకం అనిపించి, ఓ మూల కొంచెం భయంతోనే సాలోచనగా "సరే" అన్నాడు. "అబ్బ! సార్ డిసైడ్ అయ్యారు" అన్నాడు రాజీవ్ వెటకారంగా.  "ఓకే. గుడ్ , తొందర్లోనే మాట్లాడుతావు. నువ్వు చైతన్య మంచి ఫ్రెండ్స్ అవుతారు" అన్నాడు మాట ఇస్తున్నట్టుగా.  నవ్య అటుగా వెళ్తూ "రాజీవ్" అని పిలిచింది. రాజీవ్ నవ్య వైపు తిరిగి చూసి ఏమి మాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు. "ఎంటిరా వీడు?" అనడిగాడు అరవింద్. "పాపం నవ్య వేడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. వీడికి ఇష్టం లేదు. వీడో మూర్ఖుడు" అన్నాడు అచ్యుత్.  ఆమె దగ్గరకు వెళ్లి "హాయ్ ఐ యామ్ అరవింద్" అన్నాడు.  "హాయ్ అన్నయ్య" అంది.  "నీకు రాజీవ్ అంటే అంత ఇష్టమా?" అనడిగాడు. తలొంచుకునే తలూపింది.  "నీకు మాట్లాడాలని ఉందా?"  అవునన్నట్టుగా తలూపుతూ ఎలా అన్నట్టుగా చూసింది. నవ్య చేయి పట్టుకుని "నీ అన్నయ్య ఉన్నాడుగా, కంగారుపడకు" అన్నాడు అరవింద్.ఓ రోజు సాయంత్రం నిరంజన్ భోజనం చేసి "స్వాతీ, చదువుకుంటున్నావా?" అంటూ చెల్లెలు గదిలోకి వెళ్ళాడు. స్వాతీ కంగారుపడుతూ చదువుతున్న పుస్తకం మూసేసే ప్రయత్నం చేసింది. అది గమనించి "ఏంటది?" అని అడిగాడు.  "ఏమి లేదు అన్నయ్య?"  "ఏది ఇలా ఇవ్వు..." అంటూ ఆ పుస్తకాన్ని లాక్కుని తెరిచి చూసాడు. "ఐ లవ్ యు అశోక్" అని రాసి ఉంది.  "ఎవరే అశోక్?" అని అడిగాడు.  "అదీ ... అదీ ..." చాలా భయపడిపోయింది.  "రేపు సాయంత్రం వీడిని మన ఇంటికి రమ్మని చెప్పు "  "అతను రాడు అన్నయా"  "ఏం? ఎందుకు రాడు?"  "అతనికి ఈ విషయం తెలీదు" చెప్పింది నిదానంగా.  "వన్ సైడ్ లవ్వా?" మాములుగా అడిగాడు.  "అతనంటే నాకు ఇష్టం అన్నయ్య" ధైర్యం కూడగట్టుకుని చెప్పింది.  "ఏం చేస్తుంటాడు?" అని అడిగాడు.  "మా కాలేజీ. మా క్లాసుమేటు." సమాధానం ఇచ్చింది.  "పరీక్షలమీద దృష్టి పెట్టు ముందు. ఇలాంటివేమీ పెట్టుకోకు" చెప్పి వెళ్ళిపోబోయాడు.  "నేను అతన్ని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను" కొంచెం గొంతు పెంచుతూ చెప్పింది.  వెళ్తున్న వాడు ఆగి "ఇప్పుడు నీకు చెప్పినా అర్ధం కాదు స్వాతీ " అన్నాడు కోపాన్ని దిగమింగుతూ.  "నాకు అర్ధం కావాల్సింది ఏమి లేదు. నువ్వు మానసను ప్రేమిస్తే లేదుగాని నేను ప్రేమిస్తే ఆంక్షలా?"  ఇద్దరి మాటలు తూటాల్లా పేలుతున్నాయి."గట్టిగా అరవకు స్వాతీ!" అన్నాడు పళ్ళు పిండుకుంటూ.  "ఏం? నాన్నకు తెలుస్తుందని భయమా?" అంది  "బెదిరిస్తున్నావా ఏం?" కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు.  "కాదు, నా నిర్ణయం చెప్తున్నాను" అంది తల తిప్పుకుంటూ.  "మానస విషయం వేరు నీ విషయం వేరు. అన్నింటిలోను ఆరిందానిలాగా మాట్లాడకు" అన్నాడు కోపంగా.  "నాకు ఇప్పుడు 20 ఏళ్ళు. మేజర్ ని. నాకు తెలుసు ఏది తప్పో? ఏది ఒప్పో?" అంది అంతే కటువుగా.  "ఒక వైపే ప్రేమిస్తూ ఇంత రాద్ధాంతం ఎందుకు?. హా?"  "నాకు నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు. అది నాకు ఇష్టం లేదు"  "సరే, అశోక్ తో నేను మాట్లాడతాను. నాన్నగారికి టైం చూసుకుని అశోక్ గురించి నేనే చెప్తాను" అన్నాడు.  "నువ్వేమి అశోక్ కి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను చాలా మంచి వాడు." అంది  నిరంజన్ కి అసహ్యం వేసింది. చాలా అవమానంగా తోచింది. ఇంకా స్వాతితో మాట్లాడి వేస్ట్ అనుకుని వెళ్లిపోతు గుమ్మం దగ్గర ఆగి "నీ ప్రేమని కాదనే హక్కు నాకు లేదు. నీ జీవితం నీఇష్టం. సమస్యను జటిలం చేయడం నాకు ఇష్టం లేదు. ఇంత జరిగాక నీ ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. జోక్యం చేసుకోను కూడా! ఎప్పుడైనా పరిస్థితులు బాగోకపోతే నీకు ఈ అన్నయ్య ఉన్నాడని గుర్తుంచుకో చాలు" అని చెప్పాడు.  "ఆ అవసరం నాకు రాదు" అంది స్వాతి.  ఆ మాటనగానే నిరంజన్ మనసు చివుక్కుమంది."చూడు స్వాతి నోట్ బుక్ లో ఐ లవ్ యు అని రాసినంత ఈజీ కాదు ఆ మనిషితో జీవితాంతం గడపడం" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.  నిరంజన్ మనసు కకావికలమైపోయింది. చెల్లెలు అలా మాట్లాడుతుందని కలలో కూడా ఉహించలేదు. తన క్షేమం కోరినా అపార్ధం చేసుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. మద్యలో అనవసరంగా మానస పేరు తేవడం ఇంకా బాధనిపించింది.  మొబైల్ తీసుకుని మానసకు మెసేజ్ పంపాడు "ఏమి చేస్తున్నావ్?" అంటూ .  ఇంట్లో సోఫాలో కుర్చుని టి.వి చూస్తున్న మానస మెసేజ్ చదివి "హాయ్ ఏంటి సడన్ గా గుర్తొచ్చాను? ఏమి లేదు టి.వి చూస్తున్నాను " రిప్లై ఇచ్చింది.  "ఏమి లేదు మాట్లాడాలనిపించింది" రిప్లై ఇచ్చాడు.  "అబ్బ! అలా అయితే కాల్ చేయచ్చు కదా. ఉండు, నేను కాల్ చేస్తాను. బట్ ఒక కండిషన్ చదువుగురించి మాట్లాడకూడదు" అని మెసేజ్ పంపింది.  "ఓకే " అని చెప్పాడు.  పది నిమిషాల తర్వాత మానస ఫోన్ చేసింది." చెప్పురా ఏంటి?" అని అడిగింది.  "ప్చ్.. ఏమి లేదు ." అన్నాడు  "ఏమి అయింది? అంతా ఓకే కదా? "సమాధానం ఇవ్వలేదు. "ఏమైందో చెప్పరా నువ్వు డల్ గా ఉంటే నాకు నచ్చదు " అంది మళ్ళి. మౌనం వహించాడు. హలో అని పిలిచింది. "మ్... అని ''కొట్టాడు.  "ఏమైంది??” మళ్ళి అడిగింది. " అబ్బ! ఏమైంది నీకు, ఐ లవ్ యు రా బుజ్జి చెప్పరా కన్నా ప్లీజ్ రా " అని ప్రేమగా బ్రతిమాలింది.  "స్వాతి ఫస్ట్ టైం ఎదురించి మాట్లాడింది. అర్ధం చేసుకోకుండా ఏవేవో అనేసింది. చాలా బాధ అనిపించింది" అంటూ జరిగిందంతా చెప్పుకొచ్చాడు. చెప్పినదంతా విన్నాక "ఓస్ ఇంతేనా. ఒకసారి నువ్వే అశోక్ తో మాట్లాడు" అంది.  "నాకు దాని విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు" నిర్ణయం తీసేసుకున్నట్టుగా చెప్పాడు.  "సరే, ఏమి ఆలోచించకుండా హాయిగా పడుకో. రేపు యూనివర్సిటీ లో కలుద్దాం" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.  ఆ తర్వాత రోజు నిరంజన్ చాలా డల్ గా కనిపించాడు. ఎవరు అడిగినా ఎవరికీ ఏమి చెప్పలేదు. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయాడు. మానస రాగానే తనతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న నిరంజన్ ని చూస్తూ "ఏంటిరా, ఏమైంది నిరంజన్ కి ఈ రోజు అలా ఉన్నాడే "అని అడిగాడు అరవింద్. తెలీదు అన్నట్టుగా తలూపారు ఇద్దరు.  కనుచూపు మేరలో మౌనిక రావడం చూసి "ఎలా పుడతారురా బాబు. కనుచూపు మేరలో మౌనిక రావడం చూసి "ఎలా పుడతారురా బాబు ఇంత అందంగా?" అన్నాడు అరవింద్. రాజీవ్ అచ్యుత్ లు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.  నవ్య అటుగా రావడం గమనించిన సంజీవ్ "ఓకే ఐ యామ్ లీవింగ్, బాయ్" అని చెప్పి వెళ్ళిపోయాడు. మౌనిక తో పాటుగా అటుగా వెళ్తున్న మేఘన కలిసి ఇద్దరు నడచుకుంటూ రావడం గమనించాడు.  "ఏంటి వీళ్ళిద్దరూ స్నేహితులా?" అని అడిగాడు ఆశ్చర్యపోతూ. 
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:50 AM



Users browsing this thread: 1 Guest(s)