Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#24
ఎంటి ఇలా ఆలోచిస్తున్నా ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతది కదా, మొబైల్ లో తన నెంబర్ కి డయిల్ చేసా రింగ్ అయ్యింది, ఆగిపోయింది, మళ్ళీ చేసా రింగ్ అయ్యి ఆగిపోయింది, మళ్ళీ చేసా, ఈ సారి అందుబాటులో లేదంటొంది.
నాకు ఏడుపు తన్నుకొచ్చింది, నా మనసాంత బాధతో నిండి పోయింది ఏమి చెయ్యలి, అస్సలు గొడవకి కారణాలు వెతికా, ఎమి గుర్తురాలేదు.
ఆ!!! ఆ!!! తను నన్ను పెళ్ళి అయ్యాక ఎక్కడ ఉందాం అని అడిగాడు నేను "హైదరబాద్" అని ఠక్కున చెప్పా, "అదేంటి బెంగళూరుకి రావా" అన్నాడు 'రాను నాకు నచ్చదు, నువ్వు రీలొకేట్ చేసుకుంటా అన్నావు గా' అన్నాను. "అన్నాను కాని అవకపొతే " అన్నాడు, 'ఉద్యోగం మానేసి ఇక్కడ వెతుక్కో' అన్నాను, "అదేదో నువ్వే మానేసి ఇక్కడ వెతుక్కో' అన్నాడు" 'నేనెందుకు మానెయ్యాలీ' అని నేను అంటే 'నేనెందుకు మానెయ్యాలి ' అని తను అన్నాడు, ఇలా చాలా విషయాలు మధ్యలోకి వచ్చి తిట్టుకున్నాం 'నువ్వు అడిగినండుదుకు అయిన రాను" అని తెల్చేసాడు.
"అయితే నాకు నువ్వు అక్కరలేదు" నేను తత్తరపాటులో అనేసాను.
"సరే, వదిలెయ్యి అయితే, నాకు విసుగొచ్చింది, తెంచేదాకా తీసుకొస్తావు నన్ను, ఈ ప్రేమలోకి వచ్చాక నాకు మనశ్శాంతి లేదు" అని అరిచాడు. 'ఏం మాట్లాడాలో అర్దం కాలేదు ఫొన్ పేట్టేసాను, తను మళ్ళీ చెయ్యలేదు.
ఈ రెండేళ్ళలో మాకు చాలా సార్లు గొడవ అయ్యింది కాని ఎప్పుడు తను అలా మాట్లాడలేదు. అలా ఏడుస్తూ ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు.
పొద్దున లేచేసరికి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కోపంగా ఉండి తిరిగి చెయ్యలేదు. స్నానం చేసి తయారయ్యి ఆఫిస్ కి బయలుదేరాను. ముభవంగా తల కిందకి వేసి వెళ్తున్నా, నాకు తను కనిపించాడు.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:35 AM



Users browsing this thread: 1 Guest(s)