Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#12
నచ్చిందే ఈ మాయ
"అలాంటి వాడిని చేసుకుని ఏం సుఖపడతావ్, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో" కోపంగా అరుస్తున్నాడు చంద్రమోహన్.
"అతనికేం తక్కువో నాకర్థం కావట్లేదు" మరింత గట్టిగా అరిచింది ఆరాధ్య.
"అన్ని తక్కువే, ఏముందమ్మా వాడి దగ్గర, ఒక చదువు లేదు, ఆస్తి లేదు, పెద్ద ఉద్యోగమో, వ్యాపారమో లేదు ఏం పెట్టి పోషిస్తాడు నిన్ను, నేను చూసుకున్నట్టు చూసుకోగలడా??? కాలు కింద పెట్టకుండా, యువరాణిని పెంచినట్టు పెంచుకున్న నిన్ను, అదే నేను తెచ్చిన సంబంధం చేసుకుంటే నిన్ను మహరాణిలా చూసుకుంటాడు" అని హుంకరించాడు చంద్రమోహన్. ఆరాధ్య తల్లి రమ మౌనంగా తండ్రి, కూతుళ్ళ వాగ్వాదం వింటూ నిల్చుంది.
"మీరెన్నిచెప్పిన నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను నాన్నా, అతను మీరిచ్చినంత లగ్జరీ ఇవ్వకపోవచ్చు కానీ మీరు నన్ను ప్రేమించినంత ప్రేమిస్తాడు నాన్న" అని ఖరాకండిగా చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది.
ఆరాధ్య, చంద్రమోహన్, ఒక్కగానొక్క కూతురు. రెండు తరాల తర్వాత పుట్టిన మొదటి ఆడపిల్లని ఎంతో గారాబంగా పెంచారు. చంద్రమోహనుది కన్స్ట్రక్షన్ వ్యాపారం పైగా తాతలనాటి ఆస్తి రైస్ మిల్లులు, పొలాలు కూడా ఉన్నాయి. నల్లగొండలో సంపన్న కుటుంబాలలో, ఒక కుటుంబం వారిది.
ఇక ఆరాధ్య విషయానికి వస్తే ఇంటర్ వరకు తన తల్లి తండ్రుల దగ్గరే పెరిగిన, పట్టుబట్టి డిగ్రీ కోసం హైదరాబాద్ లో ఉంటున్న మేనమామ ఇంట్లో ఉండి చదివింది. ఆ తరువాత ఎంబీఏ కూడా పూర్తి చేసి, ఇటీవలే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
తండ్రి కూతుళ్ళ మధ్య నలుగుతూన్న వాదన కౌటిల్య గురించి. ఆరాధ్య, కౌటిల్య గత మూడు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. వారిరువురి పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. ఆరాధ్య డిగ్రీ కాలేజి దగ్గరలోనే కౌటిల్య ఒక samsung సర్వీస్ సెంటరులో హార్డువేర్ ఎగ్జిక్యూటివుగా పనిచేసేవాడు. అలా ఒకరోజు తన మొబైల్ ఫోన్ చెడిపోవడంతో రిపేర్ కోసం ఆ సెంటరుకి వెళ్ళిన ఆరాధ్యని చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు కౌటిల్య, దానికి కారణం కూడా లేకపోలేదు ఆరాధ్య మొహం చాలా కళగా ఉండడమే కాక కొద్దిగా బొద్దుగా, తెల్లగా, పొడుగ్గా ఉంటుంది. ఆమె మాట తీరు చాలా సౌమ్యంగా, చిరునవ్వు కలగలసి ఉంటుంది.
ఇలాంటి సుగుణాలన్నీ కౌటిల్యకు, ఆరాధ్యని ఆరాదించడానికి దోహదం చేసాయి.
ఇక మనోడి విషయానికి వస్తే ఆరడుగుల పొడుగు, కండ పుష్టితో చూడడానికి చక్కగా ఉంటాడు కానీ అతనికి చిన్ననాటి నుండి ఎందుకో చదువు పెద్దగా అబ్బలేదు. ఇంటర్ అత్తెసరు మార్కులతో పాస్ అయ్యాక, చదువు మానేసి హార్డ్*వేర్ నేర్చుకున్నాడు, అతని తండ్రి పేరు వెంకట్రావు మోతుబరి రైతు, చాలా నెమ్మది మనిషి, వారిది కరీంనగర్ దగ్గర పల్లెటూరు, వాళ్ళుకూడా బాగా ఉన్నవాళ్లే . తల్లి పేరు ఇందుమతి, మాటకారి.
కౌటిల్య ఆరాధ్యను చూసిన క్షణం నుండి ఆమెతో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలే చేసాడు, ఆమె ఇచ్చిన అప్లికేషన్ ఫారం నుండి ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెకు నెంబర్ కలిపాడు, ఆమెను పెళ్లి చేస్కోవాలనుకుంటున్న తన మనసులో మాటని, ఆమె ముందు పెట్టాడు. కానీ మొదటినుండి కొంత క్రమశిక్షణ అలవర్చుకున్న ఆరాధ్య అతన్ని పట్టించుకోలేదు, పైగా ఇంకోసారి అలా ఫోన్ చేస్తే ఆఫీసుకొచ్చి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది కూడా.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:27 AM



Users browsing this thread: 1 Guest(s)