Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#8
"నాకేం వద్దు" అని మెల్లిగా చెప్ప, రాత్రి కూడా తినకుండా పడుకొడాం వల్ల కాబొలు పొట్టలొ ఎలుకలు పరిగెడుతున్నయి, అయిన ఆకలి లెదాని చెప్పలేక చెప్పాను. "సరెలె, అది చిన్ని కి ఇచ్చెసి, లేచి తయరయ్యి వెళ్ళు మరి" అని అరిచింది, "చిన్ని నా చెల్లెలు, అది వెంటానె ప్లెట్ లాగెసి తినడం మొదలు పెట్టింది, ఛ ఎంటి మా అమ్మ తినను అంటే తిట్టి, పెడుతుంది అనుకుంటే ఇలా అన్నది, మా అమ్మ కుడా మారిపొయింది అని మన్సులొ అనుకుని లేచి తయరయ్యి కుర్చున్నా మా నాన్న కొసం చుస్తూన్నాను, ఎందుకంటె మేము చిన్నప్పటీ నుండి పక్క లెన్ కి వేళ్ళలన్న మ నాన్న దించల్సిందే.
మా నాన్న వచ్చారు, నేనెమి మాట్లాడకుండా ఉన్నాను. "దాన్ని పద్మ దగ్గర దించి రావాయ్య, అదెదొ ఫెసియల్ చెస్కుంటే మొహం బాగుంటాది" అని చెప్పి గబ గబ పాలు పొంగుతున్నయి అని వెళ్ళిపొయింది. "తిన్నావామ్మా" అని నా మొహం లొకి చుడాకుండా కుర్చిలొ కుర్చుంటూ, "లేదు" అన్నట్టూ తల అడ్డంగా ఉపాను. "తిను, తిన్నాక వెళదాము" అని "చిన్ని నువ్వు తయరవ్వు, అక్కతొ వేళ్ళు" అని అన్నడు. "ఊ" అని ముక్తసరిగ అని చిరగ్గా నా మొహం చుసింది. " నేనెమి తినను పద వెళ్దం నాన్నా" అన్నాను. "అది తినను అని ఇందకే చెప్పింది, వచ్చాక తింటుందిలే తెసుకెల్లండి, మళ్ళి పద్మ ఎక్కడకైన వెళ్తదెమో" అని చెతిలొ ఉన్న బిందెను కింద పెడుతూ. నాన్న నన్ను చెల్లిని అక్కడ దింపి పని అయ్యక ఫొన్ చెయ్యమని చెప్పి వెళ్ళిపొయడూ.
"హయ్, పెళ్ళికుతురా!!! వచ్చావా ని కొసమే చుస్తున్నా, అమ్మ చెప్పింది పంపిస్తా అని నిన్ను, నిన్న వచ్చవ్ అంటా కద???" అని ఒన్ వే ట్రాఫిక్లా మాట్లాడుతునే ఉంది పద్మక్క. "ఆ అవును అక్క, చెప్పు నువ్వు ఎట్లా ఉన్నవ్???" అని ఎదొ అడిగాలి కాబట్టి అడిగా. అది అర్ధం చెసుకున్న అక్క "సరే, రావే ఇలా కుర్చొ, ఎం చెయమ్ంటావు" అని అడిగింది నా మొహం వైపు తీక్షణంగా చూస్తూ. "ఎదొ ఒకటి చెయ్యి అక్క, నాకు పెద్దగా ఇవేవి తెలిదు." అని నీరసంగా ఆ చైర్ లొ చతికిలబడి, కళ్ళు ముసుకున్నాను.
తనేం చెసిందొ తెలిదు కాని ఒక రెండు గంటలు మాత్రం అలానే కుర్చున్నాను. ఆ తర్వత అద్దం ఇచ్చి చుసుకొమ్మంది. పర్వలేదు బాగా ఫ్రెష్గానే అనిపించిన్ంది. తనకి డబ్బులు ఇచ్చెసి నాన్నకి ఫొన్ చెశా, వచ్చి తిసుకెళ్ళారు. ఇంటికి వెళ్ళెసరికి మధ్యహనం అయ్యింది. అమ్మ చుడగానే "బాగా చెసిందే మొహం కళ వచ్చింది, రా కొంచెం తిని పడుకొ కాసేపు" అని కంచం ముందు పెట్టింది. ఆకలి పిచ్చి పిచ్చి గా వెస్తుండడాం తొ మారు మాట్లడకుండా తినెసి రూంకి వెళ్ళీ పడుకున్నాను. రాత్రి నిద్రలేనందునా త్వరగానే నిద్ర పట్టేసింది.
కొద్దిగా తెలివిలొకి వస్తుండగా ఎవరొ మాటలు వినపడుతున్నయి, సరిగ్గ చెవులు రెక్కించి విన్నాను. "ఎక్కడ మర్యద తగ్గనివ్వకండి, అస్సలే అబ్బయి అమ్మకి పట్టింపులు ఎక్కువ, మి అయనకి చెప్పు వాళ్ళ ముందు కుర్చొడం లాంటివి చెయ్యాకని." ఎవరొ ఒక ఆడ గొంతు వినిపించింది. "అయ్యొ మీరు చెప్పాలా మేము ఎం లొటు రాకుండా చుసుకుంటాంగా" అని మా అమ్మ గొంతు వినపడుతొంది.
ఎందుకొ తెలికుండానే నాకు చాలా భయం వేసింది. ఎవరొ ఎదొ నా నుండి లాక్కుపొతున్నా ఫిల్ వచ్చింది. అమ్మయి అంటే, అమ్మయి తల్లిదండ్రులంటే ఎందుకు ఇంత చులకన విళ్ళందరికి. మొదటిసారి నాకు, నా భవిష్యత్తు అంటే భయం కలిగింది.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:22 AM



Users browsing this thread: 1 Guest(s)