Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
#92
దృక్, సూర్య సిద్ధాంత పంచాంగాలు

భారతదేశంలో సుమారు 2వేల సంవత్సరాల నుంచి వెలువడే పంచాంగాలు దృక్, సూర్య సిద్ధాంతాల ఆధారంగా గణించబడుతున్నాయి. ఈ విధానం ఒక్క భారతదేశంలోనే కనిపిస్తుంది. దృక్ సిద్ధాంతం, సూర్య సిద్ధాంతాల మూల వ్యాఖ్యల మీద గత 150 సంవత్సరాలలో అనేక భాష్య, కారణ, దర్పణ, తిక ఇత్యాది గ్రంధాలు విలువడ్డాయి. ఈ మూల గ్రంధాలో కాని, లేదా వీటి సవరణ, భాష్య గ్రంధాల ఆధారంగా పంచాంగ గణితం చేసి పంచాంగాలు ప్రటిస్తున్నారు.

భారతదేశంలోని వివిధ ప్రాంతీయ భాషలలో దాదాపు 30 పంచాంగాలు ప్రతి సంవత్సరం వెలువడతాయి. వీటన్నింటికి మూలం - దృక్, సూర్య సిద్ధాంత గ్రంధాలే. విభిన్న ప్రాంతీయ ఆచారలను బట్టి ఈ గ్రంధాలు, తదనుగుణ ఉపలబ్ధ భాష్యాలు ప్రమాణంగా వాడుతున్నారు. సూర్య సిద్ధాంతం - కాల శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి తదనుగుణ గణిత సాధనలకు ప్రమాణ గ్రంధం.

భారతంలోని కేరళ రాష్ట్రానికి చెందిన అతి విశిష్ట పర్యవేక్షక ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత కోవిదుడు పరమేశ్వర క్రీ.శ. 1431లో దృక్ గణిత పద్ధతి ని నెలకొల్పాడు. అప్పటిదాకా ప్రమాణంగా వాడబడుతున్న 'పరహిత' పద్ధతికి తన పర్యవేక్షక అనుభవాలను అనుసంధానం చేసి దృక్ గణిత సిద్ధాంత పద్ధతి కి కారణ భూతులైయ్యారు.

ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ఖగోళశాస్త్రం, గణితశాస్త్రాలలో ఉద్దండ మహా పండితులు. ఊహకే అంతుపట్టనంత దుస్సాధ్యమైన గ్రహ గతులను పరిశీలించి తెలుసుకోవడమే కాక సూర్యుడి ప్రభావంతో విభిన్న గ్రహ గతులు ఎలా ప్రభావితం అవుతాయో పరిశోధనతో అవగతం చేసుకున్నారు. గ్రహ గతులు గణించడానికి ప్రత్యేక గణిత పద్ధతులను వివరించారు.

సూర్య సిద్ధాంతం భారతీయ ఖగోళ-గణిత శాస్త్రానికి ప్రమాణిక గ్రంధం. 1700 ఏళ్ళకు పైగా ఇది భారతదేశ జనపదాలలో అతి విస్తృతంగా ఉపయోగంలో ఉన్న ఖగోళ-గణిత (ఆస్ట్రో-మేథమెటికల్) శాస్త్రంగా వ్యవహారంలో ఉంది. ఇంత సుదీర్ఘ కాలం పాటు మరే ఖగోళ-గణిత శాస్త్ర గ్రంధం ప్రాచుర్యంలో లేదు. కాలానుగుణంగా - భటోట్పల (క్రీ.శ.966), దివాకర (క్రీ.శ.1606), కేశవ, విజయనంది, చిత్రభాను, శ్రీ రంగనాథ, మకరంద, నరసింహ ఇత్యాడి గణిత-ఖగోళ శాస్త్ర వైజ్ఞానికులు ప్రకటించిన సూర్య సిద్ధాంత భాష్యాలు, విభిన్న ప్రాంతాలలో వాడుకలో ఉన్నాయి. భాస్కరాచార్య, క్రీ.శ. 1150 లో రచించిన " సిద్ధాంత శిరోమణి " గ్రంధంలో సూర్య సిద్ధాంతంలోని సంఖ్యలను ఉటంకించారు.

క్రీ.శ. 1178 లో ఖగోళ శాస్త్ర వైజ్ఞానికుడు, మల్లికార్జున సూరి రచించిన సూర్య సిద్ధాంత భాష్యం బహుళ ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ గ్రంధం అటు సంస్కృతంలోనూ, ఇటు తెలుగులో కూడా ప్రకటించబడ్డాయి. దాదాపు 600 సంవత్సారాల క్రితం తెలుగులో వెలువడిన గ్రంధం ఒక ప్రాంతీయ భాషలో వెలువడిన మొట్టమొదటి ఖగోళ శాస్త్ర గ్రంధం. గణిత, ఖగోళ శాస్త్ర కోవిదులు దీన్ని ప్రామాణిక గ్రంధంగా ఉపయోగిస్తూవచ్చారు. ఈ ఉపయుక్త గ్రంధాల ఆధారంగానే పంచాంగ గణితం చేసి, ప్రతి ఏడాది పంచాంగాలు ప్రకటిస్తున్నారు.

సూర్య సిద్ధాంతం, ఆర్యభటీయం, బ్రహ్మస్పుట సిద్ధాంతం - ఈ మూడు ప్రాధమిక శాస్త్ర గ్రంధాల ఆధారంగా - గణాంకము, గణిత సాధనా పద్ధతుల ద్వార రూపొందించడమే కాక - అరేబియా, ఇరాన్, ఇరాక్, సిరియా, తజైకిస్తాన్, ఉత్తర ఆఫ్రికా, స్పేయిన్, పిరనీస్ పర్వత ప్రాంతం, ఫ్రాన్స్, ఇటలీ ఇత్యాది దేశాలకు విభిన్న అనువాధ గ్రంధాల రూపేణా (ట్రాన్స్లేషన్స్ గా), తర్జుమా ఐన గ్రంధాలుగా, లేదా భాష్యాలతో ప్రసారమయ్యాయి.

1858 లో సూర్య సిద్ధాంత గ్రంధాన్ని రెవరెండ్ ఎబినిజెర్ బర్జెస్స్ (క్రైస్తవ మిషనరీ) ఆంగ్లంలోకి.. 'సూర్య సిద్ధాంత - ఏ టెక్ష్ట్ బూక్ ఆఫ్ హిందూ ఆస్ట్రానమీ'గా పండితుల సహాయ సహకారాలతో తర్జుమా చేసి పుస్తకంగా రూపొందించి ప్రకటించారు.
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 14-12-2019, 12:42 PM



Users browsing this thread: 1 Guest(s)