Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#3
నిద్ర బరువుతో కన్రెప్పలు వాలిపోతున్న ఓ అర్ధరాత్రి వేళలో వైదేహీ వివాహ వేడుకకి ఓ అతిధిగా, ఓ ఆహ్వానితుడిగా వెళ్లి గుండెల విసేలా మౌనంగా రోదించిన దృశ్యం ఇప్పటికీ నా మనోఫలకం నుంచి చెదిరిపోలేదు.
కొత్త పెళ్లికొడుకు చేయిపట్టుకుని కొత్త జీవితాన్ని అనుభవించేందుకు ఉన్న ఊరుకి, చిన్ననాటి స్నేహితులకి వీడ్కోలు చెప్తూ ఓ సాయంత్రం నా దగ్గరికి వచ్చింది వైదేహి, అప్పుడు మా ఇద్దరి మధ్య మౌనం తప్ప మాటలు లేవు. గుండెల్లో దిగులు తప్ప మరో అనుభూతి లేదు. ‘ఇక వెళ్లివస్తానంటూ’ నా జీవితం నుంచి శాశ్వతంగా సెలవు పుచ్చుకుంది వైదేహి.
సరిగ్గా అప్పుడే ‘ఇకపై జీవితంలో మరెప్పుడూ కలుసుకో కూడదనే నిర్ణయం తీసుకున్నాం. కాకపోతే... ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకరికొకరు తారస పడితే ముఖాలు మాడ్చుకోకుండా చిర్నవ్వులతో పలకరించుకోవాలని ఒట్టు వేసుకున్నాం.
అంతదుఃఖంలోనూ వీడ్కోలు చెప్పే ముందు మా ఇద్దరి మధ్య ఓ ఆత్మీయ స్పర్శ.... ఓ చిన్నిహగ్….. అనిర్వచనీయం.... అత్యద్భుతం.
అదంతా జరిగిన అయిదేళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకి ఇలా.... ఈ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ఫ్లాట్ ఫారాంపై గోదావరి ఎక్స్ప్రెస్ సాక్షిగా అనుకోకుండా ఒకరి కొకరం ఎదురుపడ్డాం... చిర్నవ్వులతో పలకరించుకుంటూ.
ఈ అయిదేళ్లకాలం వైదేహిలో కించిత్ మార్పు కూడా తీసుకురాలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా పెళ్లయిన వెంటనే కొంత మంది ఆడపిల్లలు బొద్దుగా మారిపోతారు. కానీ... అప్పట్లాగానే సన్నజాజితీవెకు చీరకట్టినటు అందం గానే ఉంది వైదేహి.
"నువ్వేం మారలేదు" నేను.
"నువ్వూనూ అదే హెయిర్ స్టయిల్తో అంతే సన్నగా" తను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య కొద్ది క్షణాల మౌనం.
***
"పిచ్చిపిచ్చిగా ఉంది" అన్నాను నేను. ఆమె కనిపించిన సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాక.
"నాకూ అలాగే ఉంది" అంది తను కళ్లల్లో మెరుపులు గుమ్మరిస్తూ. "అనుకోకుండా భలే కలిశాం!" ఇద్దరిలోనూ ఆనందం, ఆశ్చర్యం.
"ఇవాళెందుకో.... ఆయనతో స్టేషన్కి రావడం మంచిదే అయింది. నువ్వు కనిపించావు" చెప్పింది.
వైదేహి.
"ఔను ఇవాల్టి రోజునే గోదావరి ఎక్స్ప్రెస్కి శ్రీమతి టికెట్ రిజర్వ్ చేయడం ఇంకా మంచిదైంది. నిన్ను చూశాను" అన్నాను నేను. ఆమెని చూస్తుంటే గుండె గూటికి పండుగొచ్చింది. ట్రైన్ వెళ్లిపోయినా ఫాట్ ఫారం నిండా జనాలే. నవ్వుతూ, తుళ్లుతూ, కబుర్లు చెప్తూ, మేమిద్దరం ఇలా కలుసుకున్నందుకు వేడుక చేసుకుంటున్నట్లు సందడి సందడిగా స్టేషన్.
"ఒక్కసారి నీ చేయి పటుకోవచ్చా?" ఆ హడావుడిలోనే ఆమె కళ్లలోకి చూస్తూ కాస్త మొహమాటంగానే ఆ మాట అడిగేశాను. కనిపించిన వెంటనే చిర్నవ్వులు రువ్వుతూ ఆత్మీయ కరచాలనం చేసుకోవడం ఒక్కటే మాకు ముందు నుంచీ తెలిసింది. అందుకు భిన్నంగా చాన్నాళ్లకు కలిసిన వైదేహిని అస్సలు తాకకుండా మాట్లాడుతుంటే నాలో ఏదో వెలితి. అందుకే... ఆమె ఏమనుకుంటుందోననే సంకోచాన్ని సైతం పక్కకునెట్టి నిస్సిగ్గుగా మనసులో మాటని బయట పెట్టేశాను.
"పట్టుకోవాలనుందా?" అడిగింది తను.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 10:38 AM



Users browsing this thread: 1 Guest(s)