Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#8
తెల్లటి లంగా, ఆకుపచ్చ ఓణీ, పొడవాటి వాల్జడతో ఓరోజు సాయంత్రం మావయ్య పొలం చూడ్డానికి బయలుదేరింది అనన్య. కన్నార్పకుండా తన వైపే చూస్తున్న శ్రవణ్*ని ‘ఏంటి బావా కొరుక్కు తినేస్తావా?’ అంటూ నవ్వింది అనన్య. ‘ఈ లంగా ఓణీలో ఎంత సూపర్*గా ఉన్నావో తెలుసా’ బైకు తీస్తూ అన్నాడు శ్రవణ్*. ఆ మాటలకు మనసులోనే ఆనందపడింది అనన్య. వెనుక కూర్చుని భుజం మీద చెయ్యివేసి ‘ఊ.. పద బావా’ అనడంతో ఇద్దరూ పొలంకేసి బయలుదేరారు.

పొలంగట్ల మీద నడుస్తున్న అనన్య అమెరికా విశేషాలు ఎంతో ఉత్సాహంగా చెబుతోంది. ఆకాశం నల్లటి మబ్బులతో నిండి, జోరుగా వాన కురిసేందుకు సిద్ధంగా ఉంది. బలంగా వీస్తున్న గాలికి వరి పైరులు తలలు ఆడిస్తూ ఆనందంగా ఊగుతున్నాయి. పచ్చటి పరుపుల్లాంటి ఆ పంట పొలాలు చూసి మైమరిచిపోయింది. ‘బావా ఇంతచక్కటి వాతావరణాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు’ అంటూ అటునుండి ఇటువైపు బోదెగట్టుమీద గెంత బోయింది.
కాలుజారి బోదెలోపడి పూర్తిగా తడిసి పోయింది. ‘అందుకే అనన్యా, చేల గట్లమీద జాగ్రత్తగా నడవాలి’ అంటూ ఆమెకు చెయ్యిచ్చి పైకిలేవ దీయబోయి శ్రవణ్* కూడా బ్యాలెన్స్* తప్పడంతో ఇద్దరూ ఒకరిమీద మరొకరు పడిపోయారు. అలా పడ్డంలో అనన్యమీద పడ్డాడు శ్రవణ్*. ‘అమ్మ బావా! నువ్వింకా ఎంతో అమాయకుడి వనుకున్నా. పర్వా లేదే నీకు తెలివుంది’ అంటూ అతని అధరాలను తన పెదవులతో మెల్లిగా స్పృశిస్తూ అంది అనన్య. అయ్యో నాకా ఉద్దేశం లేదు. నన్ను నమ్ము అంటూ కంగారుగా లేవబోయిన శ్రవణ్*ని కదల నివ్వకుండా ఇంకాగట్టిగా వాటేసుకుని ‘అబ్బా బావా నీకంతా కంగారేం, ఇక్కడెవరున్నారని భయపడు తున్నావు. మరేం ఫర్వాలేదు. నేను ఎవరికీ చెప్పనులే’ అంటూ అతని బుగ్గమీద మరోసారి ముద్దు పెట్టింది అనన్య. ‘అయ్యో బావా ఇప్పుడెలా? వాన మొదలైంది’ అంది భయంగా. ‘నువ్వేం కంగారు పడకు పద. పక్కనే మంచె ఉంది’ అంటూ ఆమెను ‘మంచె కాడకు’ తీసుకొచ్చాడు శ్రవణ్*. తడిసిన బట్టల్లో ఆమె ఒంటి అందాలు చూస్తూ నోటమాట రాని వాడిలా ఉండిపోయాడు.
బావ చూపులు ఎక్కడెక్కడో గుచ్చుకున్నాయి అనన్యకు. ‘ఏంటి చూపులతోనే తినేస్తావా’ అంది సిగ్గు పడుతూ.‘నీతో పరిచయం ఇంత చక్కగా మొదలౌతుందని నేను ఏనాడూ ఊహించలేదు. చాలా థాంక్స్* బావా! అంది. అతని చేయిపట్టుకుని మంచెకింద మంచం దగ్గరకు వెళుతుంటే, అంతలోనే ఓ పెద్ద శబ్దం చేస్తూ మెరుపు మెరిసింది. భయపడి అతని గుండెలకు హత్తుకుపోయింది. ఆర్తిగా అతన్ని వాటేసుకుని ‘బావా ఇప్పుడెన్ని ఉరుములురిమినా నాకింక భయంలేదు’ అంది. మెల్లిగా మంచం మీదకు తోస్తూ అతన్ని ముద్దులతో ముంచెత్తింది.అసలే వానకితడిసి వణుకుతున్న శ్రవణ్* ఒంటికి జతకలిసిన ఆమె వెచ్చదనం హాయి నిచ్చింది. ఆమెనింకా తనమీదకు లాక్కుంటూ ఆమె అధరాలు చుంబిస్తూ మునివేళ్లతో నడుమును మీటుతూ ఆమెను ఇంకా రెచ్చగొట్టాడు.ఆ చలిలో తనువులవేడి పంచుకుంటూ ఆత్రంగా ఒకరినొకరు పెనవేసుకుంటూ ఎంతో ఆనందం అనుభవిస్తున్నారు. ‘బావా ప్లీజ్* డు మి సంథింగ్*’ అంటూ అతని చెవిలో హస్కీగా అంది అనన్య. ఏదో చెయ్యబోతున్న సమయంలో సడన్*గా ఆమెను పక్కకునెట్టి మంచంమీదనుండి లేచి నిలబడ్డాడు శ్రవణ్*. ‘బావా.. వాట్*హేపెండ్*.. కమాన్*, డోన్ట్* స్టాప్*...!’ అంటూ చొరవగా అతని చేయి పట్టుకుంది అనన్య. చేతిని విదిలించుకుని ‘సారీ అనన్యా... ఐయామ్* రియల్లీ సారీ.. ఇలా ప్రవర్తించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది’ చొక్కా గుండీలు పెట్టుకుంటూ అన్నాడు శ్రవణ్*.‘వాట్*.. ఇందులో సిగ్గు పడేందుకేముంది... మనిద్దరం వయసులో ఉన్నాం. దట్సాల్*.. డోన్ట్* బి పూలిష్*’ భుజా లెగరేస్తూ క్యాజువల్*గా అంది అనన్య.
విదేశాల్లో పెరిగిన నీకు ఇది తప్పు కాకపోవచ్చు. కానీ పెళ్ళి కాకుండా ఇలా ఓ అబ్బాయి అమ్మాయి కలవడం మన దేశంలో చాలా తప్పు. భారతీయ స్త్రీకి ‘శీలం’ ముఖ్యం. అందుకే దాన్ని ఎంతో పవిత్రంగా కాపాడు కుంటూ, పెళ్ళైన తొలిరేయి భర్తకు ఆనందంగా అర్పించుకుంటారు’ చెప్పాడు శ్రవణ్*. ‘వావ్* బావా నువ్వు చాలా గ్రేట్*. అందివచ్చిన అవకాశం వినియోగించుకోకుండా భారతీయ సంస్కృతి గొప్పదనం మరోసారి రుజువుచేశావు. ఇదే మరొకరైతే.. అమ్మో తలుచుకోవడానికే భయంగా ఉంది. ఓకే, నువ్వు చెప్పినట్టు నీ కోసం అన్నీ పదిలంగా దాచి, మన పెళ్ళైన తర్వాత ఆనందంగా అర్పిస్తాను సరేనా..’ అంది అనన్య నవ్వుతూ. ఆమె మాటలు అర్థం చేసుకుని ‘సరే అప్పుడే చూపిస్తాను ఈ పల్లెటూరి అబ్బాయి తడాఖా’ అన్నాడు శ్రవణ్* నవ్వుతూ. ‘బావా! నీకో విషయం చెప్పనా! మేం అమెరికాలో ఉన్నా మన కట్టుబాట్లు మర్చిపోలేదు. అమ్మా నాన్నా నీ గురించి ఎంతో గొప్పగా చెబుతుంటే ఏమో అనుకున్నాను. కాని అది నువ్వు ఇవాళ రుజువు చేశావు. థాంక్స్* బావా, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు’ అనడంతో హాయిగా నవ్వుకున్నారు ఇద్దరూ. అంత వరకూ తాము అనుభవించిన తడిపొడి ముద్దుల తియ్యదనాన్ని తల్చుకుంటూ, తడిపొడిగా ఇంటికి బయలుదేరారు.



***  THE END  ***

[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యాను�... - by LUKYYRUS - 20-11-2018, 10:35 AM



Users browsing this thread: 1 Guest(s)