Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#7
ఏం వదినా, ప్రయాణం బాగా జరిగిందా? ఏమే కోడలుపిల్లా ఎలా ఉన్నావు? మా ఊరు నచ్చిందా’ అంటూ నవ్వుతూ వాళ్ళందరికీ దిష్టితీసింది అనన్య అత్తయ్య. ‘అత్తా బాగున్నాను, మీరెలా ఉన్నారు?’ అని నవ్వుతూ సమాధానమిచ్చి ఇల్లంతా కలయ దిరిగింది. ‘అబ్బ! నిజంగా పచ్చటి పంట పొలాల మధ్య ఆ ఊరి లాగే ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంది ఇల్లు’ అనుకుంది.

ఏం అత్తయ్యా కులాసాగా ఉన్నావా’ అంటూ నవ్వుతూ అమ్మని పలకరించిన బావ శ్రవణ్*ని చూసి నోటమాట రానిదానిలా ఉండిపోయింది అనన్య. ‘అబ్బా బావ ఎంత బావున్నాడు. అచ్చు మిల్కీ బాయ్*లా ఉన్నాడు. ఇతనిమీద ఈ ఊళ్ళో ఎంత మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారో’ అని అను మానంగా అతనికేసి చూసింది. ‘బావా! నేను వచ్చా, ఇంక నీ ఆటలు సాగవు’ అని మనసులోనే నవ్వుకుని తనకు కేటాయుంచిన గదిలోకి వెళ్ళింది. ఆ గది చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. చిన్నప్పుడు బావకు తను పంపిన బొమ్మలు, గ్రీటింగ్* కార్డులను ఇన్ని సంవత్సరాలైనా ఒక్కటికూడా పారెయ్యకుండా ఎంతో చక్కగా, దాచిపెట్టాడు ఆ రూములో. తనంటే బావకు ఇష్టమేనన్నమాట అనుకుంటూ మనసులోనే పొంగిపోయింది అనన్య.
ఆరోజు రాత్రి భోజనాలయ్యాక వెన్నెల్లో డాబా మీద ఒంటరిగా ఉన్న శ్రవణ్* దగ్గరకొచ్చిన అనన్య ‘అవును బావా నువ్వు గోల్డ్* మెడలిస్టువని అమ్మ చెప్పింది. హాయిగా ఎంబీఏ చేసి మంచి ఉద్యోగం చేసుకోకుండా ఎందుకీ వ్యవసాయం’ అని నవ్వుతూ అడిగింది. ‘చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం అనన్యా. అందరూ ఉద్యోగాలు చేస్తే ఇంక పంటలు పండించేదెవరు?’ నవ్వుతూ అన్నాడు శ్రవణ్*. ‘వావ్*! యు ఆర్* గ్రేట్* బావా!’ అంటూ షేక్*హ్యాండ్* ఇచ్చింది అనన్య.
మనసుకు ఇష్టమైనవారితో అందమైన వెన్నెల్లో గడపడంలో ఎంతో థ్రిల్లుందన్న విషయాన్ని డాబా మీదకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే తెలుసుకుంది అనన్య. ‘నిన్నొక విషయం అడుగుతాను, ఏమనుకోవుగా బావా’ అంది నవ్వుతూ. ‘ఏ విషయమైనా నాకు తెలిస్తే తప్పకుండా చెబుతాను’ నవ్వుతూ సమాధానమిచ్చాడు శ్రవణ్*. ‘అబ్బా బావ నవ్వుతుంటే అచ్చు హీమాన్* నవ్వు తున్నట్టుంది’ మనసులో అనుకుని, ‘ఏం లేదు బావా ‘ప్రేమ’ గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఎటో చూస్తున్నట్టు సిగ్గుగా ప్రశ్నించింది. ‘అబ్బో ఇది చాలా ఫాస్టే!’ మనసులోనే అనుకున్న శ్రవణ్* ‘చూడు అనన్యా ప్రేమంటే ఓ రెండు మనసుల కలయిక. అలాగే ఇద్దరు కలిసి చేసే ఓ జంట ప్రయాణం. ఆ ప్రయాణానికి గమ్యంకన్నా గమనం ముఖ్యం. అర్థంచేసుకుని నడిచి నప్పుడే వారిప్రేమ కొత్త చిగుళ్ళు వేస్తూ, అను నిత్యం కొత్తగా, నూతనంగా కనబడుతుంది. రోజు రోజుకి ఎంతో బలపడుతుంది.ప్రేమ బంధానికి పునాది నమ్మకం. అది లేన ప్పుడు దానికి అర్థం లేదు. ఇంక ఆ ప్రేమికుల మధ్య ఏ అనుబంధమూ లేనట్లే. సూర్యోదయానికీ, చంద్రోదయానికీ ఓ టైము ఉంటుంది. అలాగే నక్షత్రాలు కనిపించడానికీ ఓ టైముంది. కానీ ప్రేమ కలగడానికి ఓ టైమంటూ ఉండదు. అదే ప్రేమలోని గొప్ప దనం. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా ఎందుకు పుడుతుందో చెప్పడం చాలాకష్టం. అందుకే నా దృష్టిలో ప్రేమంటే ఓ ‘భావన’. అన్నదమ్ముల ప్రేమ, భార్యా భర్తల ప్రేమ, ప్రేమికులమధ్య ప్రేమ... ఇలా ప్రేమ ఎన్నో రకాలు. అసలు ప్రేమంటే స్వార్థం లేకపోవడమే. ప్రేమను పంచితే పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తరగదు’ నవ్వుతూ చెప్పాడు శ్రవణ్*.
అవునూ, ఏంటి సంగతి ప్రేమ గురించి తెలుసు కోవాలనుకుంటున్నావు! కొంపదీసి ఎవరినైనా ప్రేమిస్తున్నావా?’ మళ్ళీ తనే కొంటెగా అడిగాడు. ‘నిన్నే ప్రేమిస్తున్నాను బావా’ అని చెబుదామనుకున్న అనన్యకు ధైర్యం చాల్లేదు. ‘అబ్బే అదేం లేదు. ఊరికే సరదాగా అడిగాను అంతే!’ అంది. ‘ఔను, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా’ అంది కాస్త భయంగా. ‘ఇంతవరకులేదు, అయినా పెళ్ళిముందుకన్నా, పెళ్ళైన తర్వాతే అసలైన ప్రేమ పుడుతుంది. అటువంటి ప్రేమ కలకాలం ఉంటుంది కూడా’ అన్నాడు శ్రవణ్*. ‘అబ్బో! పల్లెటూరి వాడైనా ప్రేమగురించి ఎంత చక్కగా చెప్పాడు. నిజమే, ప్రేమన్నది ఒక భావనే’ అనుకుంటూ మెచ్చుకోలుగా చూస్తూ ఉండిపోయింది అనన్య. ఇంకా ఏదో అడగాలనుకున్నంతలో, ‘అన్నయ్యా అత్త పిలుస్తోంది’ అంటూ పల్లవి పానకంలో పుడ కలా రావడంతో ‘ఆ వస్తున్నా’ అంటూ వెళ్ళిపోయాడు శ్రవణ్*. ఇక అతని మనసులో భావాలు అప్పటికి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది అనన్యకి.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యాను�... - by LUKYYRUS - 20-11-2018, 10:33 AM



Users browsing this thread: 1 Guest(s)