Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#6
నువ్వేం కంగారు పడకు. అయినా వాడికేం తక్కువని? చదువుకు చదువు, అందానికి అందం. అచ్చు నవమన్మ థుడిలా ఉంటాడు. అనన్య అక్కడకు వెళ్ళిన తర్వాత శ్రవణ్*ని చూసి తప్పకుండా పెళ్ళికి ఒప్పుకుంటుం దనే నమ్మకం నాకుంది’ ధీమాగా చెప్పాడు మూర్తి. కుటుంబ సమేతంగా స్వగ్రామానికి ఆనందంగా బయలుదేరాడు.

ఆకుపచ్చని పంటపొలాలు, కాలువగట్టుమీద ఏటివారగా కొబ్బరిచెట్లనీడలో పరుగెడుతున్న మావయ్య పంపిన గుర్రబ్బండి. ఆ బండిలో తాతగారి ఇంటికి వెళుతున్న అనన్య ఆ అందమైన వాతావరణం చూసి పులకించిపోయింది. ‘అమ్మా, ఏదో అనుకున్నా గాని తాతగారి ఊరు ఆసమ్*గా ఉంది’ తల్లితో అంటూ ఆ పరిసర ప్రదేశాలను తన హ్యాండీ కామ్*లో బంధిస్తున్న కూతుర్ని చూసి ‘భగవంతుడా ఎలాగైనా నా కూతురిపెళ్ళి నా మేనల్లుడితో జరిగేలా చూడు స్వామీ’ అనుకుంది సునీత. ఊరి రామాలయం దగ్గర బండి ఆపించి మరీ దేవుడికి మొక్కుకుంది. కాసేపట్లో ఇల్లు రావడంతో ఆనందంగా బండి దిగింది.
ఏం వదినా, ప్రయాణం బాగా జరిగిందా? ఏమే కోడలుపిల్లా ఎలా ఉన్నావు? మా ఊరు నచ్చిందా’ అంటూ నవ్వుతూ వాళ్ళందరికీ దిష్టితీసింది అనన్య అత్తయ్య. ‘అత్తా బాగున్నాను, మీరెలా ఉన్నారు?’ అని నవ్వుతూ సమాధానమిచ్చి ఇల్లంతా కలయ దిరిగింది. ‘అబ్బ! నిజంగా పచ్చటి పంట పొలాల మధ్య ఆ ఊరి లాగే ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంది ఇల్లు’ అనుకుంది.
ఏం అత్తయ్యా కులాసాగా ఉన్నావా’ అంటూ నవ్వుతూ అమ్మని పలకరించిన బావ శ్రవణ్*ని చూసి నోటమాట రానిదానిలా ఉండిపోయింది అనన్య. ‘అబ్బా బావ ఎంత బావున్నాడు. అచ్చు మిల్కీ బాయ్*లా ఉన్నాడు. ఇతనిమీద ఈ ఊళ్ళో ఎంత మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారో’ అని అను మానంగా అతనికేసి చూసింది. ‘బావా! నేను వచ్చా, ఇంక నీ ఆటలు సాగవు’ అని మనసులోనే నవ్వుకుని తనకు కేటాయుంచిన గదిలోకి వెళ్ళింది. ఆ గది చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. చిన్నప్పుడు బావకు తను పంపిన బొమ్మలు, గ్రీటింగ్* కార్డులను ఇన్ని సంవత్సరాలైనా ఒక్కటికూడా పారెయ్యకుండా ఎంతో చక్కగా, దాచిపెట్టాడు ఆ రూములో. తనంటే బావకు ఇష్టమేనన్నమాట అనుకుంటూ మనసులోనే పొంగిపోయింది అనన్య.
ఆరోజు రాత్రి భోజనాలయ్యాక వెన్నెల్లో డాబా మీద ఒంటరిగా ఉన్న శ్రవణ్* దగ్గరకొచ్చిన అనన్య ‘అవును బావా నువ్వు గోల్డ్* మెడలిస్టువని అమ్మ చెప్పింది. హాయిగా ఎంబీఏ చేసి మంచి ఉద్యోగం చేసుకోకుండా ఎందుకీ వ్యవసాయం’ అని నవ్వుతూ అడిగింది. ‘చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం అనన్యా. అందరూ ఉద్యోగాలు చేస్తే ఇంక పంటలు పండించేదెవరు?’ నవ్వుతూ అన్నాడు శ్రవణ్*. ‘వావ్*! యు ఆర్* గ్రేట్* బావా!’ అంటూ షేక్*హ్యాండ్* ఇచ్చింది అనన్య.
ఆకుపచ్చని పంటపొలాలు, కాలువగట్టుమీద ఏటివారగా కొబ్బరిచెట్లనీడలో పరుగెడుతున్న మావయ్య పంపిన గుర్రబ్బండి. ఆ బండిలో తాతగారి ఇంటికి వెళుతున్న అనన్య ఆ అందమైన వాతావరణం చూసి పులకించిపోయింది. ‘అమ్మా, ఏదో అనుకున్నా గాని తాతగారి ఊరు ఆసమ్*గా ఉంది’ తల్లితో అంటూ ఆ పరిసర ప్రదేశాలను తన హ్యాండీ కామ్*లో బంధిస్తున్న కూతుర్ని చూసి ‘భగవంతుడా ఎలాగైనా నా కూతురిపెళ్ళి నా మేనల్లుడితో జరిగేలా చూడు స్వామీ’ అనుకుంది సునీత. ఊరి రామాలయం దగ్గర బండి ఆపించి మరీ దేవుడికి మొక్కుకుంది. కాసేపట్లో ఇల్లు రావడంతో ఆనందంగా బండి దిగింది.

[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply

Messages In This Thread
RE: మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యాను�... - by LUKYYRUS - 20-11-2018, 10:33 AM

Users browsing this thread: 1 Guest(s)