Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#2
మంచెకాడ

మీ నారాయణమూర్తి మావయ్య కూతురు పల్లవి పెళ్ళి. మనందర్ని తప్పకుండా రావాలని ఒకటికిపదిసార్లు ఫోనుచేసి మరీ చెప్పాడు మీ మావయ్య. యూఎస్*లో ఎమ్మెస్* చేస్తున్న కూతురు అనన్యతో ఎంతో ఆనందంగా అన్నాడు కృష్ణమూర్తి.‘అబ్బా.... డాడీ....! నాకు ఇండియా రావడమంటే పరమబోర్*. పైగా నేదునూరు శుద్ధ పల్లెటూరు. నేను రాను. ప్లీజ్* కావాలంటే మీరు వెళ్ళండి’ వాట్సప్* మెసేజ్* చూసుకుంటూ అంది అనన్య.‘ఇప్పుడు ఇండియాలో పల్లెటూర్లు నువ్వను కున్నట్లు లేవమ్మా! ఎంతో డెవలప్* అయ్యాయి. మన నేదునూరు కూడా చాలా మారిపోయింది. ఎప్పుడో నీ చిన్నప్పటికీ, ఇప్పటికీ నేదునూరులో చాలా మార్పు వచ్చింది’ మెల్లగా కూతురికి నచ్చచెప్పాడు కృష్ణ మూర్తి. ‘అమ్మా! కోనసీమ అందాలే వేరు. చక్కటి పంట పొలాలు, కొబ్బరిచెట్లు, చిన్నచిన్న పిల్లకాలువలు. అబ్బా మళ్ళా ఎన్నాళ్ళకో మనఊరి ‘మట్టివాసన’ చూడ బోతున్నాను. పల్లవి పెళ్ళికుదిరిందని తెలిసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళదామా అని నేనూ అమ్మా తెగ ఎదురుచూస్తున్నాం. అంతేకాదు మేనకోడలకి అప్పుడే మీ అమ్మ ఎన్నెన్ని నగలు కొందో నువ్వే చూడు’ అంటూ అక్కడే ఉన్న భార్య సునీతను ఆటపట్టిస్తూ అన్నాడు కృష్ణమూర్తి.‘అనన్యా! నాన్న నన్ను అంటున్నారేగానీ మీ మావయ్యకోసం ఇదిగోచూడు ఎన్నెన్ని గిప్టులు కొన్నారో.
అలాగే నీ బావ శ్రవణ్*కోసం ఐఫోన్* కొన్నారు’ నవ్వుతూ అంది సునీత.‘అమ్మా...! ప్లీజ్* ఆపండి. అయినా ఇప్పుడు మనం లక్షలు ఖర్చుపెట్టి ఇండియాకి వెళ్ళకపోతేనేం. ఇండియా రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదని మీకు తెలుసు. ముఖ్యంగా పల్లెటూరి వాళ్ళు కంట్రిబ్రూట్స్*లా ప్రవర్తిస్తారు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను జీన్స్*వద్దు లంగాఓణీ వేసుకోమని బలవంత పెడతారు’ కాస్త చిరాగ్గా అంది అనన్య.‘అమ్మా అనన్యా...! దయచేసి డబ్బుకి, ప్రేమాభి మానాలకు ముడిపెట్టకు. వాళ్ళ ఆదరణ, ఆప్యా యతల ముందు మనకున్న ఈ కోట్లు దిగదుడుపే. ఎప్పుడో నీ చిన్నప్పుడు మన తాతగారి ఊరెళ్ళాం. తర్వాత నీ చదువు వంకతో ఎక్కడికీ వెళ్ళలేకపోయాం. నీ చదువు కోసం మా కోరికలు కూడా చంపుకున్నాం’ కాస్త కోపంగా అనడంతో ‘సారీ...డాడ్*.. ఐకెన్* అండర్*స్టాండ్* యువర్* ఫీలింగ్స్*. ఓకే, నేనూ మీతో వస్తాను’ అంటూ అనన్య కోపంగా తన రూములోకి వెళ్ళిపోయింది.‘ఎందుకండీ దానితో అలా మాట్లాడారు. ఇప్పుడు మనం ఇండియా వెళుతున్నది నా మేనకోడలు పెళ్ళితోపాటు మనమ్మాయి పెళ్ళి నా మేనల్లుడు శ్రవణ్*తో జరిపించే విషయం కూడా మాట్లాడదా మనే కదా! మరిప్పుడు దాన్నిలా బెదిరిస్తే అది మన మాట ఇంక అస్సలు వినదు’ బాధగా అంది సునీత.
నిజమే, నేనంతదూరం ఆలోచించలేదు. అయినా మన శ్రవణ్*కి ఏం తక్కువని కాదంటుంది. అగ్రి కల్చర్* ఎమ్మెస్సీలో గోల్డ్*మెడలిస్టు. మన ఊళ్ళో ఉంటూనే హాయిగా ఆర్గానిక్* కెమికల్స్* ఉపయోగిస్తూ చక్కగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ కాలం యువతకు ఎంతో ఆదర్శంగా ఉన్నాడు. సునీతా, మీ నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకోకపోతే మీ అన్నయ్యే మీ నాన్నగారికి నచ్చచెప్పి మనపెళ్ళి జరిగేలా చేశాడు. అటువంటి గొప్పవాడు అనన్యకి మామగారైతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? గొప్పకాదుగాని మన శ్రవణ్*కి కూడా అన్నీ వాళ్ళ నాన్నపోలికలే వచ్చాయి. మనమ్మాయే కనక శ్రవణ్*ని చేసుకుంటే అది జీవితంతో ఎంతో సుఖపడుతుంది’ భార్యతో మాట్లాడుతూ కృష్ణమూర్తి బెడ్రూములోకి వెళ్ళి మంచంమీద వాలి పోయాడు. చిన్ననాటి రోజులు, సునీతతో ప్రేమ వివాహం... ఒకదానివెంట మరోటి సినిమా రీళ్ళలాగా మనసులో తిరిగాయి.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యాను�... - by LUKYYRUS - 20-11-2018, 10:30 AM



Users browsing this thread: 1 Guest(s)