Thread Rating:
  • 5 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పారా త్రిషార్* BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5
ఓ రెండు నిమిషాలకు విఠల్* తమాయించుకున్నాడు. పాత సినిమా అయితేనేం, డొక్కు థియేటర్* అయితేనేం, రొమాన్సు చేసుకోవడానికి. ఆ మాట కొస్తే అవే బెటరు. అరవదేశంలో హిందీ సినిమాకు వచ్చేవాడెవడు? బాల్కనీలో ఓ మూల కూచుంటే కాస్త సరసం వెలగబెట్టవచ్చు. మేట్నీకి వెళితే సరి. ఆ టైములో యిక్కడ వుండి బావుకునేది ఏదీ లేదు.
సినిమా చూస్తూండగా కథలో లీనమై పోయాడు విఠల్*. హీరోయిన్*కు చిన్నప్పుడే ఓ పక్క మొహం కాలిపోయింది. ఆమె నెత్తిమీదనుండి ముసుగులా వేసుకుని కాలిపోయిన సగభాగం జనాలకు కనబడకుండా మేనేజ్* చేస్తూ వుంటుంది. హీరో కూడా బాగున్న భాగమే చూసి మోహించాడు. పెళ్లి చేసుకున్నాడు. కాపురం చేశాడు. తర్వాత ఎప్పుడో అసలు రూపం బయటపడింది. కానీ అప్పటికి ఏం చేస్తాడు? ప్రేమబంధం, వివాహ బంధం చిక్కబడింది. వదిలి పోగలడా?
విఠల్*కి హఠాత్తుగా విశాల వింతప్రవర్తనకు సమాధానం తోచింది. తనకు కూడా ఏదో చర్మరోగం వుండి వుండవచ్చు. లేదా కాలిపోయి వుండవచ్చు. చీరా జాకెట్టు శరీరంలో చాలా భాగాల్ని కప్పేస్తాయి కదా, మిగతా భాగాల్లో వుందేమో - బొల్లి? శోబి? సోరియాసిస్*? - ఏమో ఏదైనా కావచ్చు. చీకట్లో ఏం కనబడుతుంది! అందుకే పగలనే మాటేమిటి, దీపం వెలుతురులో కూడా తనను తాను చూపించుకోదు. ఇలా చీకట్లో కొంతకాలం కాపురం చేశాక తను ఎలాగూ విడిచిపెట్టలేడు. సిగ్గు అనేది నాటకం మాత్రమే. దుప్పట్లో దూరాక ఎంత ఫ్రీగా వుంటుందో చూశాడుగా. సిగ్గున్నవాళ్లు అలాగ వుంటారా?
విశాల భుజం చుట్టూ వేసిన చేతిని విఠల్* హఠాత్తుగా వెనక్కి లాక్కోబోయాడు. విశాల దాన్ని అదిమి పట్టుకుంటూ - ''ఆ హీరోయిన్* పేరేమిటండీ? చాలా అందంగా వుంది.'' అని అడిగింది.
''జీనత్* అమాన్* అని. ఈ సినిమాలో అందాలు ఆరబోసేసిందిగా. మా బాబాయి చెప్పాడు - వాళ్లంతా యీ సినిమా చూసి వెర్రెక్కిపోయారట. ఈ పోస్టర్లన్నీ గదుల్లో అతికించుకునే వారట.'' కోపాన్ని అణుచుకుంటూ చెప్పాడు విఠల్*.
''జీనత్* అమాన్* అంటే... పోయిన వారం టీవీలో కనబడింది కదండీ..ఆవిడేనా? ఇలాగ లేదే!'' ఆశ్చర్యపడింది,
విఠల్* విసుక్కున్నాడు - ''నీ మొహం, యిలాగెందుకుంటుంది? ఈ సినిమా తీసి ముప్ఫయ్యేళ్లు దాటింది. అప్పటికి నువ్వూ నేనూ పుట్టలేదు...''
''...ఎంతైనా అంత తేడానా?''
''మనిషన్నాక మార్పు రాదా? నీకూ ఓ యాభై యేళ్లు వచ్చి అమ్మమ్మయ్యాక కూడా యిలాగే వుంటావనుకుంటున్నావా? అందులోనే ఆవిడకి మొగుడితో ఏవో కష్టాలూ అవీ వచ్చాయి. గొడవలు, విడాకులు, కష్టాలు.. వాటి వల్ల మొహం యింకా పాడై వుంటుంది...''
''..గొడవల వల్ల కొంత ఎక్కువ మారి వుండవచ్చనుకోండి. కానీ ఎంతైనా.. యీ అందమంతా అలా కరిగిపోతుందా?''
''కరగక..? అలాగే వుండిపోతుందా? ఇంకా నయం. వాళ్లు సినిమా స్టార్లు కాబట్టి ఆనాటి అందాన్ని కెమెరాలకు ఎక్కించి యిలా సినిమారీళ్లలో ప్రిజర్వ్* చేసి వుంచారు. తరతరాలకూ ఆమె అందం ఒకప్పుడు ఎలావుండేదో తెలుస్తుంది. మనలాటి అనామకుల కేముంది? ముసలితనం వచ్చేసరికి ఒకటో, రెండో ఫోటోలు మిగులుతాయి - అవీ బిగుసుకుని పోయి తీయించుకున్నది. ఈ వంపులూ, సొంపులూ అన్నీ రికార్డవుతాయా? మనకే గుర్తుండవ్*...''
విశాల బెదురుతూ విఠల్* చేతిని గట్టిగా పట్టుకుంది.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పారా త్రిషార్* BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 10:28 AM



Users browsing this thread: 1 Guest(s)