Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
జీవిత గమ్యం

అది తిరుపతి రైల్వే స్టేషన్ , సమయం రాత్రి 8:15 , కొండపై స్వామివారి దర్శనం చేసుకుని , ఒక వ్యక్తి తల నీలాలు మొక్కుగా సమర్పించినట్లు గుండుతో తన భార్య మరియు సుమారు 20 సంవత్సరాల కూతురుని కంగారుపెడుతూ ఒసేయ్ ట్రైన్ బయలుదేరాడానికి 15 నిమిషాలు మాత్రమే ఉంది త్వరగా అంటూ లాగేజీతోపాటు పరుగులు తీస్తూ ఫ్లాట్ ఫారం మీదకు చేరుకున్నారు . 

ముందే రిజర్వేషన్ చేసుకోవడంతో తమ బోగీ వెతుకుతూ ఒక్కొక్క బోగీ దాటుతూ ఇదే అంటూ బయట అతికించిన లిస్ట్ లో తమ పేర్లను ఆ వ్యక్తి చూస్తుంటే , ట్రైన్ ఎక్కడ బయలుదేరుతుందోనని ఒక 8 ఏళ్ల పిల్లాడు ఒక చేతిలో టిఫిన్ పొట్లాల బాక్స్ మరియు మరొక చేతిలో టీ క్యాన్ పట్టుకొని కంగారుపడుతూనే పెదాలపై చిరునవ్వుతో పరిగెడుతుండటం చూస్తున్న తల్లీ కూతుళ్లు జాగ్రత్త అనేంతలో కాలుకి ఏదో తగిలినట్లు ధడేల్ మంటూ కిందపడిపోయి అమ్మా అని కేక వేసాడు .

 ట్రైన్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది అని హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా , ఇద్దరూ పరుగునవెళ్లి మొదట పిల్లవాణ్ణి లేపి ప్లాట్ ఫారం బెంచ్ పై కూర్చోబెట్టి బాబు దెబ్బలేమైనా తగిలాయా అంటూ చూస్తుంటే తన తల్లి బాక్స్ మరియు టీ క్యాన్ తీసుకొచ్చి పిల్లవాడి ప్రక్కన పెట్టి , తల్లి పిల్లాడికి ఏమీ కాలేదు కదా అని అడుగుతుండగానే , నామాటాలు మీకు వినిపించడంలేదా అంటూ ఆ వ్యక్తి వచ్చి ఇద్దరినీ లాక్కుని వెళ్లిపోతుంటే , నాన్న పాపం చిన్నపిల్లాడు చేతివెంట రక్తం కారుతోంది........ . ఈ ట్రైన్ వెళితే వెల్లనీ అంటూ పిల్లవాడివైపు బాధతో చూస్తుంటే , అమ్మో ఇంకేమైనా ఉందా చూస్తుంటే వాడు ట్రైన్ లో టిఫిన్ అమ్ముకునేవాడులా ఉన్నాడు వాడికి ఇవన్నీ అలవాటేలే అంటూ ట్రైన్ ఎక్కమని ఆర్డర్ వేసాడు . పిల్లాడు చేతులను దులుపుకుని రక్తం కారుతున్న రెండుచేతులతో వాటిని పట్టుకొని పరుగున వెళ్ళిపోవడం చూసి బాధతో కళ్ళవెంట నీళ్లు కార్చారు .

మరు క్షణమే ఫ్లాట్ ఫారం పై ఎక్స్ప్రెస్ బయలుదేరాడానికి సిద్ధం అని అనౌన్స్ జరగడంతో  హమ్మయ్యా .........అని ఊపిరిపీల్చుకుని ఎలాగోలా సరైన సమయానికే చేరిపోయాము అంటూ వారి సీట్ల దగ్గరకు చేరుకుని లాగేజీని చైన్స్ తో లాక్ చేసి కింద జాగ్రత్తగా పెట్టేసారు .ఏమండీ ఆలస్యం అవ్వడానికి మీరు కూడా కారణమే కదా ట్రైన్ లో ఫుడ్ దొరుకుతుందని తెలిసినా బయటే హోటల్లో పార్సెల్ తీసుకునేదగ్గర గంట సమయం వృధా చేశారు . ఇక్కడ ఫుడ్ కాస్ట్ ఎక్కువ మరియు టేస్ట్ కూడా ఉండదు అందుకే బయట తీసుకున్నది , నేను బాత్రూం కు వెళ్ళొస్తాను తిని పడుకోవాలి అని వెళ్ళాడు.

కొన్ని నిమిషాల తరువాత ట్రైన్ కదిలినా కూతురు మాత్రం ఇంకా బాధపడుతూనే కిటికీలో నుండి రెండువైపులా పిల్లాడి కోసం చూస్తోంది . తల్లి ఇంకా ఆ పిల్లాడి గురించే ఆలోచిస్తున్నావా ........... నొప్పిలేనట్లు పరిగెత్తుకుంటూనే వెళ్ళిపోయాడు కదా నువ్వు బాధపడొద్దు అని తన చీర కొంగుతో తన కూతురి కన్నీళ్లను తుడిచింది . 

ఎందుకో అమ్మా చిరునవ్వులు చిందిస్తున్న వాడిని చూడగానే ఇక్కడ ఎంత సంతోషం వేసిందో ...........వాడు పడిపోగానే నాకు నొప్పివేసినట్లు గుండె కొన్ని క్షణాలపాటు ఆగిపోయింది . నాకు తమ్ముడు కానీ ఉండి ఉంటే వాడిలాగే ఉండేవాడేమోనని అనిపించింది అని మరింత బాధతో తల్లి గుండెలపై వాలిపోయింది . అవును తల్లినాకు కూడా అలానే అనిపించింది , ఈ క్షణం కానీ ఆ పిల్లాడు మన ముందర  ఉంటే నేరుగా పిల్లవాణ్ణి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్లి నా కొడుకుగా దత్తత తీసుకుని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేస్తాము మావెంట పంపుతారా అని కాళ్ళమీదైనా పడి బ్రతిమాలేదాన్ని , నీకు తమ్ముడు లేడని ప్రతి రోజూ ఎంత బాధపడుతున్నావో నాకు తెలీదా తల్లి , వాడి అక్కడితో నీకు తమ్ముడు లేని లోటునీ, నాకు కొడుకు లేని లోటునీ తీరిపోయేది అని తన కూతురితో పాటు కన్నీరు కార్చింది.

తన తల్లి మాటలకు బాధతో కన్నీరు కారి వెంటనే కోపంతో ఇప్పుడా ఆమాట చెప్పేది , తమ్ముడు అమ్మా అంటూ తల్లడిళ్లిపోతుంటే , క్షమించు తల్లి అంటూ మనసారా గుండెలకు హత్తుకొని ఇద్దరూ చాలా బాధపడ్డారు .

తండ్రి ట్రైన్ టాయిలెట్ నుండి వచ్చి బాధపడుతున్న ఇద్దరినీ చూసి ఏమైంది అని అడిగారు .
ఏమండీ పిల్లాడి గురించి నా బంగారుతల్లి బాధపడుతోంది . మనకు పుట్టిన బిడ్డ చనిపోకుంటే మన కొడుకు ఇప్పటికే అంత వయసులో ఉండేవాడు . 
మనకు ఒక బిడ్డ చాలు అని నేను ముందే చెప్పాను , నువ్వే వినలేదు అలా జరిగింది . నాకు సంతోషమే అని ఫుడ్ ప్యాకెట్ తీసి సంతోషంతో తినడం చూసి , 
ఇద్దరూ కోపంతో చూసి మరింత బాధపడ్డారు . ఆ పిల్లాడు మళ్లీ కనిపిస్తే మీకు ఇష్టమైన కాకపోయినా , నా బంగారుతల్లికి వాడిని తమ్ముడిని చేస్తాను అని ఎర్రటి కళ్లతో చెప్పింది .
తన భర్తకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా , ఆ పిల్లవాడు మళ్లీ కనిపించినప్పుడు కదా , వాడు ప్లాట్ ఫోరమ్ మీద టీ అమ్ముకుంటూ అక్కడే ఆగిపోయి ఉంటాడు అని రాక్షస నవ్వు నవ్వుతూ తింటున్నాడు.
మరింత కోపంతో అతడివైపు చూసి ఇద్దరూ కళ్ళుమూసుకుని రెండు చేతులను జోడించి పిల్లాడికోసం మనసారా ప్రార్థించారు .

నెక్స్ట్ మినిట్ ఆ బోగీలో మాత్రమే పవర్ కట్ అవ్వడం ప్రార్థిస్తున్న అమ్మాయి ఎందుకో అమ్మా అని నొప్పివలన అరవడం , మరు క్షణమే పవర్ on అయ్యి తనతోపాటు అటూ ఇటూ కొంతమంది మహిళలు తనలానే కేకలు వేస్తూ గొంతుపై నొప్పివలన చేతితో రుద్దుకుంటున్నారు .
స్స్స్.......అమ్మా అంటూ తను కూడా రాసుకుంటుంటే తల్లి ఎర్రగా గీసుకుపోయింది , ఏదీ చూడనీ అంటూ చూస్తుంటే ,
అమ్మా మెడ లో ఏదో లాగేసినట్లు అనిపించింది అమ్మా ........, తల్లి మీ నానమ్మ బంగారు హారం .........
చేతులతో తడుముకుని అవునమ్మా చైన్ లాగడం వలన కలిగిననొప్పివలనే కేక వేసాను అంటూ లేచి కింద పడిందేమో అని చూస్తుంటే , తమతోపాటు రెండువైపులా ఉన్న మహిళలు కూడా మెడలో చైన్స్ కనిపించడం లేదని ,సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ అధికారి .......అని అరవడం విని దొంగతనం జరిగిందని ఒకరికొకరు చూసుకుంటుంటే ,
10 తులాల చైన్ పోగొట్టుకున్నావా ...........అంటూ తింటున్నవాడు వచ్చి తన కూతురిని , భార్యను కోపంతో కొట్టినంతపనిచేశాడు . అది మా అమ్మ గుర్తు అని బాధపడుతున్నాడు . 
ఏమండీ మన ఒక్క చైన్ మాత్రమే కాదు బోగీ లోని చాలా మందివి ప్లాన్ ప్రకారం కరెంట్ తీసేసి క్షణాల్లో లాగేసుకొని వెళ్లిపోయినట్లున్నారు . 
ఇంతలో ట్రైన్ లో ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ అధికారి వచ్చి విషయం తెలుసుకుని 60 -80 km వేగంతో వెళుతున్న ట్రైన్ లోనుండి ఖచ్చితంగా దూకే ధైర్యం చేసి ఉండరు , ఈ స్లీపర్ బోగీలలోనే ఉంటారు అని వెతుకుతూ వెళ్ళాడు . 
అర గంట , గంట అయినా సెక్యూరిటీ అధికారి గురించి జాడ లేకపోవడంతో అందరూ వాళ్ళ చైన్స్ పై ఆశలు వదులుకుని నిద్రలోకి జారుకున్నారు . 
కానీ అమ్మాయి తండ్రి మాత్రం మీకు ఏమాత్రం జాగ్రత్త లేదు , రెస్పాన్సిబిలిటీ కూడా లేదు అని కోపంతో ఊగిపోతూ తిడుతూనే ఉన్నాడు . 
నాన్న నానమ్మ చైన్ అంటే మీకంటే మాకు చాలా చాలా ఇష్టం . మనల్ని వదిలివెళ్లిపోయేముందు ప్రేమతో నా మెడలో వేసింది . నానమ్మ గుర్తుగా ఇప్పటివరకూ దానిని నానుండి తియ్యలేదు అంటూ తన తల్లిని కౌగిలించుకుని బాధపడుతుంటే ............

అయినా ఆపకుండా అతడు భార్యను , కూతురును కోపంతో మాటలు అంటూనే ఉండటంతో , ఇద్దరూ సైడ్ సీట్లో తల దించుకు కూర్చుని మౌనంగా మాటలు పడుతున్నారు .
తన కళ్ళ ముందు చైన్ కనిపించడం చూసి , అమ్మా ......నానమ్మ చైన్ అంటూ తలెత్తి చూస్తే , అదే పిల్లవాడు అక్కా ఈ చైన్ మీదే కదా అంటూ చిరునవ్వుతో అందించాడు. 
చైన్ దొరికింది అన్న ఆనందం కంటే పిల్లాడు కనిపించాడనే అమితానందంతో అమ్మా............ఆ దేవుడు మనల్ని కరుణించాడు . ఇక చూడలేమనుకున్న తమ్ముడిని మన దగ్గరకు చేర్చాడు అంటూ ఆనందబాస్పాలతో అమాంతం కౌగిలించుకుంది .
స్స్స్..........అంటూ నోటి నుండి మూలుగు రావడంతో , ఏమైంది తమ్ముడూ ........అంటూ మోచేతులపై గీసుకుపోయి ఉండటం చూసి , కళ్ళల్లో చెమ్మతో కంగారు కంగారుగా అమ్మా...........రక్తం ఇంకా కారుతోంది అంటూ తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని నొప్పిగా ఉందా తమ్ముడు అంటూ తనే నొప్పిని ఫీల్ అవుతున్నట్లు బుగ్గలను అందుకొని ప్రేమతో స్పృశిస్తూ , ఏమైనా చేయమ్మా ........అని బాధతో చెప్పింది . 
వాళ్ళ నాన్న చైన్ చూసివచ్చి పిల్లాడి చేతిలోనుండి లాక్కుని హమ్మయ్యా ..........దొరికింది అంటూ వెంటనే లాకర్ ఉన్న సూట్ కేస్ లో భద్రపరిచేసి , ఎక్కడ ఆ పిల్లవాణ్ణి తమతోనే ఉంచుకుంటారేమోనని వాళ్ళవైపు ఒకరకమైన ఫేస్ పెట్టి చూస్తున్నాడు .
తన తల్లి మరొక బ్యాగులో నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చింది .
అమ్మా ఇంటిదగ్గర ప్రయాణంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకమ్మా అని కోప్పడ్డాను ,లవ్ యు అమ్మా ..........అంటూ అందుకొని కాటన్ పై డేటాల్ అంటించి గాయాలను శుభ్రం చేసి రెండు మోచేతులకు కట్లు కట్టి , తమ్ముడూ ఇంకా ఎక్కడైనా దెబ్బలు తగిలాయా , కాళ్లకు అని సున్నితంగా తాకుతూ అడిగింది .
పిల్లవాణ్ణి తమ్ముడు అన్న ప్రతిసారి ఇప్పటివరకూ ఆప్యాయతతో ఇలాంటి పిలుపు నోచుకోకున్నట్లు వాడి హృదయం సంతోషంతో పొంగిపోయి , వొళ్ళంతా జలదరిస్తూ కళ్ళల్లో చెమ్మ చేరుతోంది . 
ఏమైంది తమ్ముడూ అంటూ పైటతో కన్నీళ్లను తుడిచింది .

ఏమీ లేదండీ ..........ఎక్కడ పుట్టానో తెలియదు , ఊహ తెలిసేటప్పటికి ఈ రైల్వే స్టేషన్ లో పడ్డాను . ఏ పొట్లాలు , టీ అమ్ముకుంటూనే స్టేషన్ లోనే పడుకుంటాను . అందరూ ఒరేయ్ , రేయ్ ...........అని పిలుపు తప్ప ఆప్యాయతతో తమ్ముడు అని పిలుపు వినడం ఇదే తొలిసారి , నా గాయాలను చూసి జాలిపడను కూడా పడలేదు మీరు ప్రక్కనే కూర్చోబెట్టుకొని కట్టు కట్టారు మేడం , అందుకే కన్నీళ్లు ఆగడం లేదు . నా జీవితాంతం ఋణపడిఉంటాను అని రెండుచేతులతో మొక్కాడు .
తమ్ముడు అంటూ కళ్ళల్లో చెమ్మతో గాయాలకు తగలకుండా గుండెలపై హత్తుకొని , అంటే నీకు ..........
ఎవ్వరూ లేరు మేడం అదేదో అన్నారు .........ఆ గుర్తొచ్చింది అనాథ .........
ఈక్షణం నుండి నువ్వు అనాధవి కాదు నాన్న మా బిడ్డవు , మావెంట వస్తావా నిన్ను ప్రేమతో చూసుకుంటాము , స్కూల్ లో చేర్పిస్తాము ..........అని అమ్మాయి తల్లి పిల్లాడి తలపై ప్రేమతో నిమిరి చెప్పింది .
నామాటాలు విని వారినే చూస్తున్న తన భర్తకు విపరీతమైన కోపం వస్తున్నా , తానే కదా మళ్లీ కలిసినప్పుడు ..........అని మాట్లాడింది అని కంట్రోల్ చేసుకుని దుప్పటి , దిండు తీసుకుని పైకి ఎక్కేసాడు .
నాకు అంత ఆశ లేదు మేడం , మీరు తమ్ముడు అని పిలిచారు అదిచాలు నేనేవరినో , ఎలాంటివాన్నో కూడా మీకు తెలియదు . నేను అనాదని రైల్వే స్టేషన్ మరియు ట్రైన్ లలో ఇలా అమ్ముకునేవాడిని అని చెబుతుంటే .......
తమ్ముడూ నీ పేరు తెలియకపోయినా నువ్వు మా గుండెల్లో స్థానాన్ని ఆక్రమించేశావు, ఒకే ఒక్క మాట అడుగుతాను నువ్వు నా తమ్ముడిగా , అమ్మకు కొడుకుగా మావెంట రావడానికి ఇష్టమా కాదా ..........అని అడిగి , please please ...........తమ్ముడూ ఇష్టమని చెప్పవా ........అన్నట్లు పిల్లవాడివైపు ప్రాణంలా చూస్తోంది .
మీరు అడుగుతున్నది ఇష్టం కాదు మేడం , ప్రపంచంలోనే , నా జీవితంలోనే అత్యంత విలువైన వరం , అదృష్టం ............, దానిని ఎవరైనా వధులుకుంటారా ......కానీ వద్దు మేడం చాలా మంది మీపైన వేలెత్తి చూపిస్తారు . నాకు అది ఇష్టం లేదు అని బాధతోనే చెప్పాను .
తమ్ముడూ .........ప్రక్కవాడి గురించి పట్టించుకోని ఈ ప్రపంచం గురించి మాకు అనవసరం , సూటిగా నిన్నే అడుగుతున్నాను ఈ అక్కయ్యా , అమ్మ వెంట రావడం నీకు ఇష్టమేనా .........మాకైతే నువ్వంటే ప్రాణం తమ్ముడూ........
మేడం తమ్ముడూ........అని అంత ప్రేమతో పిలవకండి ఇక్కడ తట్టుకోవడం నావల్ల కావడం లేదు అంత ఆనందం కలుగుతోంది అని గుండెను చూపించి మాట్లాడుతుంటే ..........
అమ్మా తమ్ముడికి ఇష్టమే .........అంటూ ప్రేమతో హత్తుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
ఒక అనాధను దేవతలాంటి అమ్మ , ప్రాణంలా చూసుకునే అక్కయ్య ప్రేమతో తమ వెంట పిలిస్తే ఏ భక్తుడైనా ఎందుకు వెళ్ళడు నేను మీ వెంట వస్తాను మేడం , మీరు ఏమిచెప్పినా చేస్తాను , ఎలా ఉండమంటే అలా ఉంటాను , ఒక పనివాడిలా ఉంటాను అని చెప్పాడు .
తమ్ముడూ ...........ఇంకెప్పుడూ అలా మాట్లాడకు అంటూ నోటిని ఆపి , నిన్ను మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము . అమ్మకు నేనెంతో నువ్వుకూడా అంతే ...........తల్లి నీకంటే నాకు వాడే ఎక్కువ అని తన తల్లి చెప్పడంతో పిల్లాడు ఆనందంతో నవ్వడం చూసి , 
తమ్ముడూ నిన్ను ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండేలా చూసుకుంటాము సరేనా .........
సరే మేడం...........
ఇప్పటికీ మేమంటే నీకు ఇష్టం లేనట్లుంది , మేడం అనే పిలుస్తున్నావు ...........అమ్మా , అక్కయ్యా ........అని ఒకసారి పిలు తమ్ముడూ అని ఆశతో కోరింది .
అక్క........య్యా , ఆ.......మ్మా..........అక్కయ్యా , అమ్మా..........అని పిలువగానే ,
ఇద్దరూ ఆనందబాస్పాలతో పిల్లవాణ్ణి ప్రాణంలా హత్తుకున్నారు .
ఆ పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా ఆపకుండా అక్కయ్యా , అమ్మా అక్కయ్యా అమ్మా ...........అని పెదాలపై చిన్నగా పలుకుతూనే ఉన్నాడు . 

అమ్మా మన చైన్ తోపాటు ఇక్కడ పోగొట్టుకున్న అందరి నగలు కూడా దొరికింటే బాగుండేది ప్చ్.........అని బాధపడుతుంటే ,
అక్కయ్యా ..........ఇదిగో అంటూ కర్చీఫ్ ముడివిప్పి నగల కుప్పను చూపించి , మీ చేతులతోనే అందరికీ పంచి వాళ్ళ సంతోషాన్ని ఎంజాయ్ చెయ్యండి అని చెప్పాడు .
తమ్ముడూ ..........ఈ నగలన్నీ ఎలా ఆ దొంగల నుండి తీసుకొచ్చావు . వాళ్ళు నిన్ను ఏమీ చెయ్యలేదు కదా అని కంగారుపడుతూ దెబ్బలేమైనా తగిలాయా అని ముఖం పై , తలపై , వీపుపై సున్నితంగా తడిమి చూస్తుంటే ......... 
నాకేమీ కాలేదక్కా ............ఎవరో కొంతమంది స్లీపర్ క్లాస్ చివరి భోగీకి వచ్చి కంగారు పడుతున్నారు . ఏమిటా అని చూస్తే వెనుకే సెక్యూరిటీ అధికారి ఒక్కొక్కరి క్యాబిన్ లో , టాయిలెట్లలో చెక్ చేస్తూ వస్తున్నారు . 
వారి ముఖాలు భయంతో చెమటపట్టి ఏమి చెయ్యాలో తెలియక ఇడ్లీ ఇడ్లీ టీ టీ .......అని అమ్ముకుంటూ వస్తున్న నా పొట్లాల బాక్స్ లోకి ఈ కర్చీఫ్ మూటను వేసి , రేయ్ అంటూ వాళ్ళ మొబైల్ లో నా ఫోటో తీసుకుని , మళ్లీ వచ్చి తీసుకుంటాము పొలుసుని దాటి వెళ్లిపో అని చెప్పి ఏమీ తెలియనట్లు డోర్ దగ్గర నిలబడ్డారు . 
వాళ్ళు చెప్పినట్లుగానే అమ్ముకుంటూ పొలుసుని దాటి వచ్చేసాను . సెక్యూరిటీ అధికారి వాళ్ళ దగ్గరకువెళ్లి టికెట్ చూపించమని అడిగాడు . 
స్టేషన్ వచ్చినట్లు ట్రైన్ నెమ్మదించడంతో పొలుసుని కిందకు తోసేసి తలుపు తెరిచి నెమ్మదిస్తున్న ట్రైన్ లో నుండి దుంకేశారు . సెక్యూరిటీ అధికారి లేచి వెళ్ళేసరికి వాళ్ళు చీకటిలో కనుమరుగైపోయారు .
ఇంతకీ కర్చీఫ్ మూటలో ఏముందో చూద్దామని కిందపెట్టి చూస్తే ధగధగమంటున్న నగలు , అప్పుడు అర్థమయ్యింది వాళ్ళు దొంగలు అని , వెంటనే పోలుసుకి అప్పజెబుతామని కేక వెయ్యబోయి , ఒక ప్రత్యేకమైన నగను చూసి మీదే అని అనుమానంతో భోగీలన్నీ వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నాను . మీరు కనిపించారు .
అయినా ఇది నాదేనని నీకెలా తెలుసు తమ్ముడూ .......   
తిరుపతి స్టేషన్ లో నేను కిందపడినప్పుడు వచ్చి లేపి కూర్చోబెడుతున్నప్పుడు మా అక్కయ్య మెడలో చూసాను . ఇప్పుడు ఉన్న నగలలో ప్రత్యేకంగా ఉండటంతో చూడగానే కనిపెట్టాను . 
అవును తమ్ముడూ మా ముత్తాతలు వంశపారంపర్యంగా ఆ ప్రత్యేకమైన హారాన్ని బహుకరిస్తూ వస్తున్నారు . మా నానమ్మ చనిపోయే ముందు నా మెడలో వేశారు . అది పోగొట్టుకున్నానని పైనున్న నాన్న నన్ను కోపంతో తిడుతుంటే , దేవుడిలా వచ్చావు , మా తమ్ముడు బంగారుకొండ అంటూ హత్తుకొని పట్టరాని సంతోషంతో నుదుటిపై గట్టిగా ముద్దుపెట్టింది.
తమ్ముడూ అందరూ పడుకున్నారు ఎలా ఇచ్చేది అని అడిగింది . తల్లి వాళ్ళ నగల కోసం ఎప్పుడు నిద్ర లేపినా సంతోషిస్తారు , ఏమంటావు నాన్నా అని పిల్లాడిని అడిగారు . అంతే అమ్మా .........ఎన్నోసార్లు విన్నాను ఆడవాళ్లు నగల కోసం ఏమైనా చేస్తారు అని బదులివ్వడంతో , అందరూ నవ్వుకున్నారు .

ఈ మాటలన్నింటినీ దుప్పటి కప్పుకొని వింటున్నట్లు ఆతృతతో కిందకుదిగి , ఏమేవ్ ఇవి మనదగ్గర ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు . ఎవరైనా విని చెప్పినా మన హారం కూడా పోయింది కాబట్టి నమ్మరు . వీటిని వెంటనే దాచేసామంటే మనవే అయిపోతాయి అని చెబుతుంటే ,
తల్లీ కూతుళ్ళిద్దరూ అతనివైపు కోపంతో చూసి , ఏమండీ మనకు ఉన్న ఆస్తి సరిపోదా ........పరుల సొమ్ముకోసం ఆశపడితే చాలా పాపం . నా కూతురు నాకుడుకు ఇష్టప్రకారం ఎవరివి వాళ్లకు చేరేలా చేస్తాను మీరు వెళ్లి పడుకోండి అని చెప్పింది .
తల్లి నువ్వైనా చెప్పు నీకు నగలంటే ఇష్టం కదా ..........నాన్న ఇక ఒక్కమాట కూడా మాట్లాడకండి , మన కస్టార్జీతంతో లభించిన నగలంటే ఇష్టమే ఎందుకంటే అవి మనవి కాబట్టి , ఇలా పరుల సొమ్ముకోసం ఏ ఆడది ఆశపడదు అని కోపంతో బదులిచ్చింది . 
బాబు నువ్వైనా మీ........... (నోటివెంట పిలుపు రాకపోయినా నగల కోసం) మీ అక్కయ్యకు నువ్వైనా చెప్పు అని చిన్నగా బ్రతిమిలాడుతుంటే .........
ఏమండీ అది తప్పండి , మా అమ్మ , అక్కయ్య ఇష్టమే నాఇష్టం అని చెప్పడంతో ,
పిల్లాడిపై మరింత కోపంతో కిముక్కుమనకుండా పైకివెళ్లి పడుకున్నాడు.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 17-12-2019, 10:36 AM



Users browsing this thread: Depukk, 9 Guest(s)