Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
#76
ఒక తల్లి తన నిత్యపూజయైన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారునితో మాట్లాడిన సంభాషణలు ఈ విధంగా ఉన్నాయి.

అవి మీ, మా, మనందరికి ఎంతగానోఉపకరిస్తాయి.

తల్లి... నాయనా! పూజా పురస్కారాలైనాయా?

కుమారుడు... ఇలా చెప్పాడు. అమ్మా! నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. నీవు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినేవుంటావు. అలాంటి నేను పూజలు గట్రా ఏం బాగుంటాయి.

తల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసురా. కానీ, అతను కనిపెట్టినవన్నీ మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా అన్నది.

కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు.

అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. నీకు దశావతరాలు... అది మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా...

కొడుకు ఆసక్తిగా అవును తెలుసు.. దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని ప్రశ్నించాడు.

అప్పుడు ఆ తల్లి... హా.. సంబంధం ఉంది. ఇంకా నీవు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను...

మొదటి అవతారం మత్స్య అవతారం. అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. ఇది నిజమా కాదా.

కొడుకు కొంచెం శ్రద్ధగా వింటున్నాడు.

తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు. దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.

మూడవది వరాహ అవతారం... అంటే పంది. ఇది అడవి జంతువులను అంటే బుద్ధి పెరగని జీవులు... అదే డైనోసార్లని గుర్తుకు తెస్తుంది.

ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయని తెలుస్తుంది.

ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడైనా ఎంతో ఎత్తుకు పెరిగినవాడు. నీకు తెలుసుకదా మానవుల్లో మొదట హోమో మరియు హోమో సేపియన్స్ వున్నారు అని, వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులు గా వికాసం చెందారని.

కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.

తల్లి.. కన్నా ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే.. ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవుల్లోని గుహల్లో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడని.

ఇక ఏడో అవతారం రామావతరం. మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచనాపరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు, సమస్త కుటుంబ బంధుత్వానికి ఆదిపురుషుడు.

ఇక ఎనిమిదవది అత్యంత ప్రముఖమైనది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు, పాలకుడు, ప్రేమించే స్వభావి. ఆతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజంలో ఉంటూ సుఖదుఃఖ, లాభనష్టాలు అన్నీ నేర్పినవాడు.

కొడుకు ఆశ్చర్యవిస్మయాలతో వింటున్నాడు.

ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం. ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణలకు మూలం.

ఇక చివరది అయిన కల్కి పురుషుడు. అతను నీవు ఏ మానవునికై వెతుకుతున్నావో అతనే ఇతను. అతను యిప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.

కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తూ.. ఆనందబాష్పాలతో అమ్మా హిందూ ధర్మం ఎంతో అర్థవంతమైన నిజమైన ధర్మమని అనడంలో సందేహించనక్కర్లేదని పేర్కొన్నాడు.

ఆత్మీయులారా!!! మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు,
ఇత్యాదివన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మాత్రం మారాలి. మీరు ఏ విధంగా భావిస్తే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మపరమైనవి కావచ్చు. శాస్త్రీయంతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. ఇకనైనా మేలుకోండి.. ఋషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.

# మనం మారుదాం.. యుగం మారుతుంది #

గమనిక : సైన్స్ అంటే నిరూపణ మాత్రమే అని భావిస్తే... సనాతన ధర్మం, వేదాలు ఇత్యాదులన్నీ నిరూపణ చేయబడ్డవే.
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 03-12-2019, 07:01 PM



Users browsing this thread: 5 Guest(s)