Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
రమణయ్య ఆ లేఖ తీసుకుని చదివిన తరువాత ఆదిత్యసింహుడి వైపు అందోళనగా చూస్తూ, “ఏంటి ప్రభూ….ఈ విపరీతం…మీరు వివాహమాడాల్సిన ప్రభావతీదేవి గారిని మీ అన్నగారు వివాహమాడటం ఏంటి…అదీ మహారాణీ గారు దగ్గర ఉండి చేయించడం ఏంటి,” అనడిగాడు.

ఆదిత్యసింహుడు : అదే నాకూ అవగతం కావడం లేదు రమణయ్య గారు….ఏం చేయాలో పాలుపోవడం లేదు….
రమణయ్య : ఈ లేఖలో వివాహముహూర్తం ప్రకారం ఇంకా రెండు రోజులు ఉన్నది…మనం ఎంత వేగంగా బయలుదేరినా కామపురరాజ్యానికి వెళ్ళడానికి కనీసం మూడు రోజులు పడుతుంది…ఈ లోపు వివాహం అయిపోతుంది….

[Image: ed701a548d5fe9eca8d5f0fb288d4eae.jpg]

ఆదిత్యసింహుడు : కనీసం ఈ రహస్యం ప్రభావతికి, నాకూ తప్ప ఆమె తండ్రికి కూడా తెలియదు…అయినా ప్రభావతి మా అన్న గారితో వివాహానికి ఎలా అంగీకరించినది…..
రమణయ్య : ఏం జరిగిందో తెలియకుండా మన నిర్ణయానికి రావడం మంచిది కాదు ప్రభూ….(అంటూ ఆదిత్యసింహుడి వైపు చూస్తూ) అయినా కామపుర రాజ్య యువరాణి సబంధం మహారాణీ కళావతి గారికి ఎలా తెలిసింది….
రమణయ్య అలా అనగానే ఆదిత్యసింహుడికి తను విరించి చేత రాయించిన లేఖ గుర్తుకొచ్చింది.
దాంతో ఆదిత్యసింహుడు వెంటనే విరించిని పిలిపించాడు.
ఆదిత్యసింహుడు : విరించీ…నేను మహారాణి గారికి రాయించిన లేఖ ఎక్కడున్నది….
విరించి : అది ఆరోజే మన దూత ద్వారా మహారాణి గారికి పంపించాను ప్రభూ….
ఆదిత్యసింహుడు : మరి నేను నా వ్యక్తిగత అధికార ముద్ర వేయకుండా ఎలా పంపించారు….
విరించి : వేయలేదా….నేను చూసుకోలేదు ప్రభూ…మీరు ముద్ర వేసారు అనుకున్నాను…అదీ కాక మీరు అత్యవసరం అనే సరికి నేను దాన్ని వెంటనే పంపించాను….
ఆదిత్యసింహుడు : నువ్వు చేసిన పని వలన ఎన్ని విపరీతాలు జరగబోతున్నవో చూడు….(అంటూ రమణయ్య చేతిలోని లేఖను విరించికి ఇచ్చాడు.)
ఆ లేఖ చదివిన విరించికి వెన్నులో నుండి వణుకు పుట్టుకొచ్చింది.
అతనికి ఏం చేయాలో తోచలేదు.
దాంతో అతను వెంటనే ఆదిత్యసింహుడి కాళ్ళ మీద పడిపోయి, “ప్రభూ నన్ను క్షమించండి….ఈ పొరపాటు నేను కావాలని చేసినది కాదు….” అన్నాడు.
రమణయ్య : కాని నీ పొరపాటు ఎన్ని అనర్ధాలకు దారి తీసిందో చూసావు కదా….(అంటూ సైనికులను పిలిచి విరించిని చూపిస్తూ) ఇతన్ని చెరసాలలో వేయండి…..
సైనికులు వెంటనే విరించిని బంధించి యుధ్ధఖైదీలను ఉంచిన గుడారంలో ఉంచారు.
ఆదిత్యసింహుడు : ఇపుడు ఏం చేద్దాం రమణయ్య గారు….కామపుర రాజ్యానికి వెళ్ళేసరికి వివాహం అయిపోతుంది…

[Image: rajat001.jpg]

రమణయ్య : ఒక ఉపాయం ఉన్నది ప్రభూ…..
ఆదిత్యసింహుడు : ఏంటది…చెప్పండి….
రమణయ్య : మనం ఎలాగూ వివాహం జరిగే రాజ్యానికి సమయానికి వెళ్లలేం….మీ వంశాచారం ప్రకారం వరుడి కత్తికి బాసికం కట్టి వివాహం జరుపుతారు….కాబట్టి మనం ఇక్కడ నుండి హుటాహుటిన మన అవంతీపుర రాజ్యానికి వెళ్ళి మీ అన్నగారితో జరిగింది మొత్తం చెబుదాము….
ఆదిత్యసింహుడు : లేదు రమణయ్య గారు….అన్నగారి ఆవేశం మనకు తెలియనిది కాదు….అందుకని అవంతీపురానికి వెళ్ళేకన్నా….కామపుర రాజ్యానికి వెళ్ళి మా తల్లిగారితో విషయం తెలుసుకోవాలి….అంతకంటే ముందుగా ప్రభావతిని కలుసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు ఒక నిర్ణయానికి వస్తే మంచిది….
రమణయ్య : అవును ప్రభూ….మీరు అన్నది కూడా నిజమే…విషయం తెలుసుకోకుండా మీ అన్నగారితో చెప్పడం మంచిది కాదు….
ఆదిత్యసింహుడు : మీరు వెళ్ళి సైన్యాన్ని బయలుదేరడానికి సన్నాహాలు చేయండి…సైన్యాన్ని మొత్తం అవంతీపురానికి వెళ్ళమని మన దళనాయకులతో చెప్పండి…యుధ్ధఖైదీలను కూడా తీసుకెళ్ళమని చెప్పండి…మనం కామపుర రాజ్యానికి బయలుదేరుదాం….
రమణయ్య సరె అని బయటకు వెళ్ళి దళనాయకులను పిలిచి ఆదిత్యసింహుడి ఆదేశాలను వివరంగా చెప్పాడు.
దాంతో సైన్యంలోని మూడు భాగాలు యుధ్ధఖైదీలను తీసుకుని అవంతీపురానికి బయలుదేరింది.
మిగిలిన సైన్యంతో ఆదిత్యసింహుడు రమణయ్యతో కామపురరాజ్యానికి బయలుదేరాడు.
ఆదిత్యసింహుడు వెళ్ళేసరికి ప్రభావతికి వీరసింహుడి రాజఖడ్గంతో పెళ్ళి అయిపోయింది.
పెళ్ళి హడావిడీ మొత్తం అయిపోవడంతో ఆదిత్యసింహుడు తరువాత రోజు కామపుర రాజ్యానికి చేరుకున్నాడు.
కోలాహలంగా ఉండాల్సిన రాజప్రసాదం మొత్తం నిశబ్దంగా ఉండటంతో పెళ్ళి అయిపోయిందని అర్ధం అవడానికి ఆదిత్యసింహుడికి ఎంతో సేపు పట్టలేదు.
తనకు భార్య కావాల్సిన ప్రభావతి తన అన్నకు భార్య ఎలా అయింది….ఏం జరిగిందో తెలియక అలాగే బాధ పడుతూ అంతఃపురానికి వెళ్ళాడు.
ఆదిత్యసింహుడు వచ్చిన వార్త విన్న కళావతి ఆనందంతో అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని, “చూసావా కుమారా….నీ మాటలు నిజమయ్యాయి….నువ్వు దేశపర్యటనకు వెళ్ళేముందు అన్న మాటలు అనుకోకుండా నిజమయ్యాయి,” అన్నది.

[Image: maxresdefault.jpg]

కాని ఆదిత్యసింహుడు ముభావంగా మాట్లాడకుండా ఉండేసరికి కళావతి మనసు ఏదో కీడు శంకించింది.
దాంతో కళావతి, “ఏం జరిగింది కుమారా…ఎందుకలా ఉన్నావు…అంతా బాగానే ఉన్నది కదా,” అంటూ ఆదిత్యసింహుడి వైపు అనుమానంగా చూసింది.
ఆదిత్యసింహుడు తన తల్లి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలాగే తల వంచుకుని కూర్చున్నాడు.
అది చూసిన కళావతికి ఏదో జరిగింది అన్న విషయం మాత్రం అర్ధం అయింది.
ఆదిత్యసింహుడు మాట్లాడకపోయే సరికి కళావతి అక్కడే నిల్చున్న రమణయ్య వైపు చూసి, “ఏం రమణయ్యా…ఏం జరిగింది,” అంటూ గట్టిగా అడిగింది.
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 6 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 19-11-2019, 08:17 PM



Users browsing this thread: 4 Guest(s)