Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అప్డేట్ : 13

(ముందు అప్డేట్ 75వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=13338&page=75)


లేఖలో : ప్రియమైన తల్లిగారికి పాదాభివందనం చేస్తూ రాయునది…నేను ఇక్కడ  కామపుర రాజ్యాధినేత యశోవర్ధనుడి కుమార్తె యువరాణి ప్రభావతిని చూడటం జరిగింది….ఆమెను చూడగానే వివాహం చేసుకోదలిచాను….అందుకు మీ అనుమతి కోసం ఈ లేఖను పంపించుచున్నాను….రెండు మూడు దినములలో నేను రాజ్యానికి తిరిగివస్తాను…అంతలో మీరు కామపురరాజు యశోవర్ధనుడితో సంప్రదించి మీరు వివాహ ముహూర్తము నిర్ణయించకోరుతున్నాను….
ఆ లేఖ చదవగానే వీరసింహుడు వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నందుకు…పైగా కన్యను కూడా ఎంచుకున్నందుకు కళావతి చాలా సంతోషపడిపోయింది.
దాంతో కళావతి వెంటనే తగిన రాజలాంచనాలతో తన దూతను పంపించి వివాహ ముహూర్తాన్ని నిర్ణయించింది.
ఇదంతా జరుగుతుండగా వీరసింహుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు.



పెళ్ళిప్రస్తావనలు తెలియని వీరసింహుడు రాజభవనం అంతా కోలాహలంగా….అలంకరణలతో నిండిపోయే సరికి ఏదో ఉత్సవం జరుగుతున్నదనుకుని తన మందిరానికి వెళ్ళాడు.
అక్కడ తన అంతరంగీకుడు దీలీపుడిని పిలిపించుకుని….

వీరసింహుడు : ఏం జరుగుతుంది….ఏదైనా ఉత్సవ సన్నాహాలు చేస్తున్నారా….

దిలీపుడు : కాదు యువరాజా….మహారాణీ కళావతి గారు మీకు వివాహం చేయ నిశ్చయించారు….ముహూర్తం కూడా నిర్ణయించారు….

వీరసింహుడు : నాకు తెలియకుండా నా వివాహమా….ఇప్పుడే వెళ్ళి మా తల్లి గారిని అడుగుతాను….(అంటూ అక్కడ నుండి మహారాణీ కళావతి దగ్గరకు వెళ్లబోయాడు.)

కాని దిలీపుడు వెంటనే వీరసింహుడి ముందు ఒక చిత్రపటాన్ని పెట్టి….

దీలీపుడు : మీరు మీ మందిరానికి రాగానే మీకు ఈ చిత్రపటాన్ని చూపించమన్నారు….

ఆ పటం మీద బొమ్మ కనిపించకుండా దాని మీద పట్టు గుడ్డ పరిచి ఉన్నది.

వీరసింహుడు : ఏమున్నది ఆ చిత్రపటంలో….

దిలీపుడు : మీరు చేసుకోబోయే కామపుర యువరాణి చిత్రపటం…ఈమెను చూసిన తరువాత కూడా మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మహారాణి గారి దగ్గర మీ అభ్యంతరం తెలుపవచ్చు…..

దాంతో వీరసింహుడు ఆ పటం మీద ఉన్న పట్టుగుడ్డని తీసి చూసే సరికి ప్రభావతి ఆందాన్ని చూస్తూ అలాగే మైమరిచిపోయాడు.

[Image: images?q=tbn%3AANd9GcQzWyTBNe2HHc5ttBUkB...uxkqAVuGxm]


ప్రభావతితో వివాహాన్ని తన తల్లి కళావతి నిశ్చయం చేసిందని వీరసింహుడు అనుకుంటున్నాడు.

వీరసింహుడు ఇష్టపడ్డాడని ప్రభావతితో వివాహం నిశ్చయించింది కళావతి.

అలా కళావతి, వీరసింహుడు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ వివాహాన్ని నిర్ణయించారని అనుకుంటున్నారు.

వీరసింహుడి ముఖకవళికలు చూసి దిలీపుడు కూడా అతనికి రాకుమారి నచ్చిందని అర్ధమయింది.

దిలీపుడు : ఇక మహారాణి గారి దగ్గరకు వెళ్ళి అంగీకారం తెలుపుదురుగాని పదండి…..

దాంతో ఇద్దరూ కలిసి మహారాణీ కళావతి దగ్గరకు వెళ్ళారు.

దిలీపుడు : (మహారాణికి అభివాదం చేస్తూ….) మహారాణీ….యువరాజా వారు వివాహానికి ఒప్పుకున్నారు….

కళావతి : ఒప్పుకోక ఏం చెస్తాడు….ప్రభావతి లాంతి అందగత్తెను ఎవరు మాత్రం ఒదులుకుంటారు…(అంటూ వీరసింహుడి వైపు చూసి…) ఆదిత్యసింహుడు నీదగ్గరకు వస్తానని ఇక్కడ నుండి పయనమయినాడు….నీ దగ్గరకు చేరలేదా….

వీరసింహుడు : వచ్చాడు మాతా….కాని అక్కడ సరిహద్దుల్లో తిరుగుబాటు దారులు ఎక్కువయ్యారు….వారిని అణిచివేసి వస్తానని చెప్పాడు….మీరు రమ్మన్నారని నేను వచ్చాను….

కళావతి : అలాగే నీ వివాహ సమయానికి వచ్చేలా ఆదిత్యసింహుడికి సందేశం పంపించు….

[Image: shivgami.jpg]


వీరసింహుడు : అలాగే మాతా….

కళావతి : మన ఆచారం ప్రకార నీ కత్తికి బాసికం కట్టి రాకుమారితో వివాహం జరిపిస్తాము….కాబట్టి నీవు రాజ్యంలోనే ఉండు….

వీరసింహుడు అలాగే అన్నట్టు తల ఊపాడు.

తరువాత రెండు రోజులకు అవంతీపుర ముఖ్యపరివారం మొత్తం కామపుర రాజ్యానికి వివాహానికి బయలుదేరారు.

ఇక్కడ ప్రభావతి కూడా తన వివాహం ఆదిత్యసింహుడితో అనే భావించి సంతోషపడిపోతున్నది.

వివాహానికి ముందు శయ్య మీద ఒకటి అయినా అంతా సవ్యంగా వివాహం జరుగుతున్నందుకు ప్రభావతికి గుండెల మీద భారం దిగినట్టు అయ్యి ప్రశాంతంగా ఉన్నది.

నాలుగు రోజులకు రత్నసింహుడి పరివారం మొత్తం కామపుర రాజ్యానికి చేరుకున్నది.

అప్పటికే యశోవర్ధనుడు వాళ్ళు విడిది చేయడానికి మందిరాలను ఏర్పాటు చేసాడు.

వీరసింహుడు తన వివాహ సమాచారం ఆదిత్యసింహుడికి పంపించాడు.

కాని ఆ లేఖ ఆదిత్యసింహుడికి అందకపోవడంతో అతనికి వివాహం గురించి తెలియక తిరుగుబాటుదారులతో యుధ్ధం చేస్తున్నాడు.

రెండు రోజుల తరువాత ఆదిత్యసింహుడు తిరుగుబాటుదారులను అణిచివేసి తన శిబిరంలో అలిసిపోయి పడుకున్నాడు.

కొద్దిసేపటికి వార్తాహరుడు వచ్చి, “ప్రభూ….” అని పిలిచాడు.

ఆదిత్యసింహుడు కళ్ళు తెరిచి అతని వైపు చూసి, “ఏంటి….” అన్నాడు.

వార్తాహరుడు : ప్రభూ….మహారాణీ కళావతి గారి నుండి అత్యవసర లేఖ తీసుకొచ్చాను….మీకు ఈ లేఖ అందిన వెంటనే మిమ్మల్ని బయలుదేరమన్నారు….

ఆదిత్యసింహుడు : ఏమైనా విశేషమా….

వారాహరుడు : అవును ప్రభు…వీరసింహుల వారి వివాహ మహోత్సవావనికి రమ్మని సందేశం….

ఆదిత్యసింహుడు : (ఆనందంతో అతని దగ్గర లేఖ తీసుకుంటూ) ఇది చాలా సంతోషకరమైన వార్త….మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము….(అంటూ లేఖని తీసి చదువుతున్నాడు.)

ఆ లేఖలో సారాంశం చదివిన వెంటనే ఆదిత్యసింహుడి మొహంలో రంగులు మారడం మెదలయింది.

దాంతో ఆదిత్యసింహుడు వెంటనే రమణయ్యని పిలిపించాడు.

రమణయ్య వచ్చిన వెంటనే ఆదిత్యసింహుడు వార్తాహరుని వైపు చూసి, “ఇక్కడ నుండి బయలుదేరడానికి ఏర్పాట్లు చేయండి…” అన్నాడు.

వార్తాహరుడు సరె అని తల ఊపుతూ ఆదిత్యసింహుడుకి అభివాదం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

రమణయ్య : ఏమయింది యువరాజా….ఎందుకంత కలవరపడుతున్నారు…(ఆదిత్యసింహుడిని చూసి జరగకూడనిది ఏదో జరిగిందని అర్ధం అయింది.)
ఆదిత్యసింహుడు ఏమీ మాట్లాడకుండా తన చేతిలో ఉన్న లేఖను రమణయ్యకు ఇచ్చాడు.


[Image: 599379-bp-21.jpg]
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CvDpU1sVofsIery1UzWeWD
[+] 5 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 19-11-2019, 07:58 PM



Users browsing this thread: 1 Guest(s)