Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
#11
1. కరణం అంటే ఏమిటి?

చంద్రగతిని అనుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిధిలో సగభాగంగా లెక్కిస్తారు. శుభతిథిని ఎన్నుకుని పని – ప్రారంభిస్తే సంపద, వారం వల్ల – ఆయుషు, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఇష్టకామ్యం సిద్ధిస్తాయి. కాబట్టి వివాహాది శుభకార్యాలను సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెపుతున్నాయి. రెండు కరణాలు ఒక యోగం అవుతుంది.

2. కరణాలు – వాటిలో జన్మించిన వారి లక్షణాలు

కారణాలను బట్టి ఆ కాలం లో జన్మించిన వారి లక్షణాలను చెప్పవచ్చు. అలాగే ఆ కరణ లక్షణాన్ని బట్టి అది ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో కూడా నిర్ణయిస్తారు.

3. బవకరణం

బవ కరణం లో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులై ఉంటారు. వారికి అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అబద్ధాలకూ, అసాంఘిక కార్య కలాపాలకూ దూరంగా ఉంటారు. ఊహల్లో తేలకుండా నిజానిజాలను గమనిస్తారు. చాలా తెలివైన వారుగా ఉంటారు. అందరిచేతా గౌరవింపబడతారు ప్రేమింపబడతారు.

4. బాలవ

ఈ కారణం లో జన్మించిన వారు దైవభక్తినికలిగి ఉంటారు. పుణ్యకార్యాసక్తులై ఉంటారు. జీవితం లో ఎక్కువ భాగం తీర్థ యాత్రలతో గడుపుతారు. వీరు ఉన్నత విద్యావంతులవుతారు.

5. కౌలవ

ఈ కారణం లో జన్మించిన వారు సంఘజీవులుగా ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ప్రేమ, ఆప్యాయతలకు వీరు చిరునామాగా ఉంటారు. స్నేహితులకు సహాయం చేయడం స్నేహితుల నుండీ సహాయం పొందటం వీరి నిత్య జీవితం లో తరచుగా జరుగుతూ ఉంటాయి. వీరికి ఆత్మాభిమానం నిండుగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలోనూ అనవసరంగా మాట పడరు. వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగే చోట ఉండరు.

6. తైతుల

వీరు చాలా అదృష్టవంతులు. చాలా సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పెద్ద పెద్ద వ్యాపారాదులకూ, భవంతులకూ వీరు అధిపతులుగా ఉంటారు. ప్రేమ వీరి జీవితం లో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. వీరు అందరితోనూ దయగా ఉంటారు.


7. గరజ

ఈ కారణం లో జన్మించినవారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు శ్రమ జీవులు. బద్ధకం వీరి ఛాయలకు కూడా రాదు. అవసరమైన చోట, కావలసిన పనికొరకు వీరు ఎంతటి కష్టాన్నైనా పడతారు. శ్రామికులు, హాలికులు ఈ కోవకు వస్తారు.

8. వనజి

ఈ కారణం లో జన్మించిన వారు అపారమైన జ్ఞానాన్ని, తెలివితేటలని కలిగి ఉంటారు. వ్యాపారాన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తారు. ప్రయాణాలనీ విహారయాత్రలనీ ఎక్కువగా ఇష్టపడతారు. వీరి వ్యాపార దృష్టి అసమానమైనది.

9. విష్టి

దీనినే విష్టి కారణం అనికూడా అంటారు. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం చాలా దోషకరమైన కరణం. కానీ ఈ కారణం లో జన్మించిన వారు చాలా అనుమాస్పదంగా ఉంటారు. అసాంఘిక కార్యకలాపాలలో, దోష కార్యాలలో పాల్గొంటారు. పాప చింతనను కలిగి ఉంటారు. పగబట్టే మనస్తత్వం వీరిది. ప్రతీకారం తీర్చుకోకుండా ప్రాణం పోయినా వాదలరు.

10. శకుని

వీరు న్యాయబద్ధులై ఉంటారు. ఈ కారణం లో జన్మించిన వారు ఎక్కువగా జంతుప్రేమికులై ఉంటారు. మానవత్వాన్ని కలిగి ఉంటారు. గొడవలు జరిగే చోట వారి వాక్చాతుర్యం, తెలివి తేటలతో సంధి కుదురుస్తారు. వీరు వైద్యులు, లాయర్లు అయ్యే అవకాశాలు ఎక్కువ.

11. చతుష్పాతు

ఈ కరణం లో జన్మించినవారు మతధర్మాలను పటిష్టంగా ఉంచుతారు. సంస్కృతినీ సాంప్రదాయాన్నీ నమ్మి ఉంటారు. ఎంతటి క్రూర జంతువయినా వీరికి త్వరగా మాలిమి అవుతుంది. వీరు సమర్థవంతమైన పశువైద్యులు కాగలరు.


12. నాగవం

జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ కరణం కూడా దోషకరమైనడి గా చెబుతారు. ఈకరణం లో జన్మించినవారు కొంత మేరకు దురదృష్టవంతులని చెప్పవచ్చు. వీర్ జీవితం గొడవలు, తగాదాలు, వివాదాల మయంగా ఉంటుంది. అత్యంత శ్రమ పడినా కొన్ని సార్లు వీరికి ఫలితం దక్కదు. ఈ కారణం లో జన్మించినవారికి సహనం చాలా తక్కువగా ఉంటుంది.

13. కింస్తుఘ్నం

ఈ కారణం ల జన్మించినవారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. వీరికి శారీరక సామర్థ్యం అధికంగా, అసాధారణంగా ఉంటుంది. జీవితం లో అన్నిరకాల సంతోషాలనూ వీరు చవిచూస్తారు. చాలా సౌభాగ్యవంతమైన, సౌకర్య వంతమైన జీవితాన్ని వీరు పొందుతారు. మంచి విద్యావంతులయి ఉంటారు.
[+] 2 users Like dev369's post
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM



Users browsing this thread: 1 Guest(s)