Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
#9
నక్షత్రములు - ఆరాధన.

రత్నధారణ, పూజ, హవనం, యజ్ఞం వంటివి. నక్షత్రశాంతికి మరొక ప్రత్యామ్నాయం ఉంది. వివిధ చెట్లను పూజించటంవల్ల నక్షత్ర-గ్రహశాంతి జరిగి వ్యక్తి జీవితంలోని సమస్యలు ఒకటొకటిగా తొలగిపోతాయి.


అశ్విని నక్షత్ర వృక్షం :

కుచల. ఈ నక్షత్రంలో జన్మించినవారు కుచల చెట్టును నిత్యం పూజించాలి. చెట్టువేరుకు నీరుపోసి, అక్షతలు చల్లి, ప్రదక్షిణ చేయాలి.

భరణి నక్షత్ర జాతకులు ఉసిరిక చెట్టుని నిత్యం జలంతో తడిపి ప్రదక్షిణ చేయాలి. పొరపాటున కూడా ఈ చెట్టు దగ్గర మూత్రవిసర్జన వంటివి చేయకూడదు.

కృత్తిక నక్షత్ర జాతకులు మేడివృక్షాన్ని నిత్యం నీళ్ళు, అక్షతలతో ప్రదక్షిణ చేయాలి.

రోహిణి నక్షత్రంలో జన్మించినవారు నేరేడు చెట్టు మొదట్లో చెక్కర, బియ్యం లేదా గోధుమపిండి వేసి ఒక గ్లాసు నీరుపోసి ప్రదక్షిణ చేయాలి.

మృగశిర నక్షత్ర జాతకులు బుధవారంరోజు జలంతో రేగుచెట్టుని పూజించటం వల్ల సుఖ సమృద్ధి లభిస్తుంది.

ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినవారు కృష్ణకమలాన్ని పూజించటం లేదా దీంతో దేవతారాధన చేయటం వల్ల సుఖం కలుగుతుంది.

పునర్వసు నక్షత్ర జాతకులు తుమ్మచెట్టును ఆరాధించాలి. చెట్టు మొదట్లో నీరుపోసి పూజ చేయాలి.

పుష్యమి నక్షత్రంలో జన్మించినవారు రావిచెట్టుకు నీరుపోసి నిత్యం ప్రదక్షిణం చేయటం శుభకరం.

ఆశ్లేష నక్షత్ర జాతకులు చంపా వృక్షానికి ప్రతిరోజూ నీరుపోసి పూజించాలి.

మఖ నక్షత్రంలో జన్మించినవారుమర్రిచెట్టును పూజించినట్లయితే విశేష ఫలప్రదం లభిస్తుంది.. మర్రిచెట్టు సహజంగానే పూజనీయ వృక్షం. అందరూ పూజిస్తారు.

పూర్వఫల్గుణి ( పుబ్బ )నక్షత్రంలో జన్మించినవారు అశోకవృక్షం ఆకులు ఇంటి ద్వారానికి కట్టుకోవటం, వృక్షాన్ని పూజించటం వల్ల సుఖం లభిస్తుంది.

ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టును ( వేరును కానీ )పూజించాలి. సూర్య మంత్రం జపించాలి. 11 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి

హస్త నక్షత్ర జాతకులు ఇంట్లో మల్లెచెట్టు నాటి పూజించటం మంచిది. దీనివల్ల వ్యాపారవృద్ధి చెందుతుంది.

చిత్త నక్షత్రం లో జన్మించిన వారు మారేడు చెట్టును పూజించాలి.మారేడు చెట్టుకు ప్రదక్షిణలు, సూర్యోదయానే దీపారాధన చేయాలి.

స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు మద్ది చెట్టుకు పూజ, ప్రదక్షిణలు..నువ్వుల నూనె తో దీపారాధన రాహుకాలం లో చేయాలి

విశాఖ నక్షత్రం లో పుట్టినవారు నంది వర్ధనం చెట్టు కానీ వేప చెట్టు ను కానీ పూజించాలి. సూర్యోదయానే దీపారాధన చేసి ఉడికిన శనగలు నైవేద్యం పెట్టాలి. గురు మంత్రం జపించాలి.

అనురాధ నక్షత్ర జాతకులు మారేడు చెట్టును పూజించాలి.మారేడు చెట్టుకు 9 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి.

జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినవారు వేపచెట్టుని రోజూ నీటితో మొదలు తడిపి సేవించాలి. ఆదివారం నువ్వులు, చెక్కెర మొదట్లో వేయాలి.

మూల నక్షత్రం లో పుట్టినవారు వేగి చెట్టు కానీ, తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి ని కానీ పూజించాలి.. ఆవు నేతి దీపారాధన చేయాలి.గణపతి మంత్రం జపించాలి.

పూర్వాషాడ, శ్రవణం..ఈ రెండు నక్షత్రాల జాతకులు జిల్లేడుచెట్టును సేవించాలి. బుధవారం చేసే పూజ అధిక ఫలప్రదం.

ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించినవారు కదంబ వృక్షానికి ప్రతిరోజూ నీళ్ళు పోయాలి.

ధనిష్ఠ నక్షత్రంలో జన్మించినవారు కొబ్బరిచెట్టును పూజించటం శుభం. కానీ, ఇది అన్నిచోట్లా లభించదు. కాబట్టి వీలులేనివారు పూజాగృహంలో కొబ్బరికాయను ఉంచుకుని పూజించాలి.

శతభిష నక్షత్రంలో జన్మించినవారు మామిడిచెట్టును పూజించటం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినవారు కదంబ వృక్షాన్ని అక్షతలతో పూజించాలి.

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినవారు గోరింటచెట్టుని అక్షతలతో పూజించాలి.

రేవతి నక్షత్రంలో జన్మించినవారు రేగుచెట్టుకి నీరుపోసి పూజించాలి.
[+] 1 user Likes dev369's post
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM



Users browsing this thread: 3 Guest(s)