Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
ప్రభావతి ఒంటి నుండి వస్తున్న సుగంధపరిమళాలు ఆదిత్యసింహుడిని వివశుడ్ని చేస్తున్నాయి.

“ఏంటిది యువరాజా….మరీ మీరు చనువు ఎక్కువ తీసుకుంటున్నారు…ఎవరైనా చూస్తే ప్రమాదం,” అంటూ తన మీదకు ఒంగి పెదవులను అందుకోబోతున్న ఆదిత్యసింహుడి ఛాతీ మీద చెయ్యి వేసి ఆపడానికి ప్రయత్నిస్తున్నది.
కాని ఆదిత్యసింహుడు ఆమె మాటలు వినకుండా నడుము మీద ఉన్న తన చేత్తో ఆమెను ఇంకా దగ్గరకు లాక్కుని ప్రభావతి ఎర్రటి పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.


[Image: hqdefault-2.jpg]

మొదటి సారి తన పెదవుల మీద ఒక మగాడి పెదవుల స్పర్శ తగిలేసరికి ప్రభావతి కళ్ళు మత్తుగా మూసుకుపోయాయి.
ఆదిత్యసింహుడి కళ్ళల్లోకి చూస్తూ, “యువరాజా….ఏంటి ఈ ధైర్యం…వివాహం కాకుండా ఇలా చేయడం భావ్యం కాదు …నా గురించి కొంచెం ఆలోచించండి,” అంటూ ప్రభావతి సిగ్గు పడింది.
“కాని మీ అందం చూస్తుంటే….నాకు మనసాగడం లేదు యువరాణీ…మరి మాతో వివాహానికి మీరు ఒప్పుకున్నట్టేనా,” అనడిగాడు ఆదిత్యసింహుడు.
“మీ మీద ఇష్టం లేకపోతే ఇంత చనువుగా ఎందుకుంటాను యువరాజా…” అంటూ ప్రభావతి సిగ్గుపడుతూ ఆదిత్యసింహుడికి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తున్నది.
ప్రభావతి ఇబ్బందిని గమనించిన ఆదిత్యసింహుడు ఆమెను వదిలి అక్కడే ఉన్న ఆసనంలో కూర్చుని, “మరి మీ తండ్రి గారిని సంప్రదించమంటారా….” అన్నాడు.
ప్రభావతి కూడా ఆదిత్యసింహుడి పక్కనే ఆసనంలో కూర్చుంటూ, “మీదే ఆలస్యం…నాకు సమ్మతమే,” అంటూ తల వంచుకున్నది.
“మరి ఇప్పుడే వెళ్ళి మీ తండ్రిగారితో మాట్లాడతాను….” అంటూ ఆదిత్యసింహుదు ఆసనంలో నుండి లేచి వెళ్ళబోయాడు.
ఆదిత్యసింహుడి తొందరపాటుకి ప్రభావతి నవ్వుకుంటూ, “ఇప్పుడు సమయం కాదు యువరాజా….అయినా ఇంత తొందర ఏల…మా తండ్రిగారు నిద్రలో ఉంటారు,” అంటూ ఆదిత్యసింహుడి చేయి పట్టుకుని ఆపింది.

[Image: images?q=tbn%3AANd9GcSpR2kE79wSIfx1gChGJ...8M0m8EsRQZ]

“తొందర ఉండదా రాకుమారీ….ఇంత అందాల రాశిని ఎంత తొందరగా వివాహం చేసుకుని నా అంతఃపురానికి రాణిని చేద్దామా అని నా మనసు తహతహలాడుతున్నది,” అంటూ ఆదిత్యసింహుడు మళ్ళీ ప్రభావతి పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతున్నాడు.
కొద్దిసేపటి తరువాత ఆదిత్యసింహుడు, “నేను మీకు పరిచయం అయ్యి ఒక్క రోజు కూడా కాలేదు….అంతలోనే నా మీద మీకు ఇంత ఇష్టం ఎలా వచ్చింది,” అనడిగాడు.
ప్రభావతి చిన్నగా నవ్వుతూ, “మిమ్మల్ని ఖడ్గవిద్యా ప్రదర్శనలో చూడగానే మీ ఆకారం, నడవడికను బట్టి కొంత అంచనా వేయగలిగాను…తరువాత మీతో ఖడ్గ యుద్ధం చేస్తుంటే మీరు సామాన్యులు కాదు అనిపించింది…అందుకే మీరు ఎవరో తెలుసుకోవాలని చనువుగా ఉన్నాను….ఇప్పుడు మీరు ఎవరో తెలిసిన తరువాత చాలా సంతోషంగా ఉన్నది…” అంటూ తన చేతిని ఆదిత్యసింహుడి చేతి మీద వేసింది.
“కాని మీరు మా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు…” అన్నాడు ఆదిత్యసింహుడు.
“ఏమో….నాకు కూడా తెలియదు యువరాజా….మిమ్మల్ని చూడగానే ఎందుకో నా మనసు చలించిపోయింది,” అంటూ ప్రభావతి తన చేత్తో అతని చేతిని గట్టిగా పట్టుకున్నది.
ఆదిత్యసింహుడు : మరి వివాహం కాకుండానే ఇలా నాతో సమీపంగా కూర్చున్నారు….పైగా వేళకాని వేళలో….ఈ సమయంలో మీరు  నాతో ఉంటే మీ నాన్నగారే కాదు…ఎవరు చూసినా తప్పుగానే ఊహిస్తారు….
ప్రభావతి : మీరన్నది నిజమే యువరాజా….కాని మీ సమీపం నుండి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు....

[Image: 5UmftCP.png]

ఆదిత్యసింహుడు : కాని యువరాణీ…మీ తండ్రిగారితో నేను మాట్లాడే కన్నా నేను మా రాజ్యానికి వెళ్ళి మా తల్లిదండ్రుల చేత మనిద్దరి వివాహం కొరకు సమాచారం మీ నాన్నగారికి పంపిస్తాను…అదే పధ్ధతి….
ప్రభావత : మీరు మళ్ళీ మీ రాజ్యానికి వెళ్ళడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది…..
ఆదిత్యసింహుడు : తొందరలోనే వెళ్తాను ప్రభావతి….వెళ్ళిన వెంటనే మన వివాహం గురించే ప్రస్తావిస్తాను సరెనా….
ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఇంకొద్దిసేపు ముచ్చట్లాడుకుని ఎవరి మందిరాల్లోకి వారు వెళ్ళి నిద్రపోయారు.
వీళ్ళిద్దరినీ చాటుగా గమనిస్తున్న రమణయ్య కూడా మనసులో సంతోషపడుతూ వచ్చి పడుకున్నాడు.
తరువాత రోజు నిద్ర లేచిన దగ్గర నుండి ప్రభావతి చాలా ఉత్సాహంగా ఉన్నది.
ఆమె మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆదిత్యసింహుడిని కలుద్దామా అన్నట్టు ఆత్రంగా ఉన్నది.
అలా వారం రోజుల పాటు ప్రభావతి రోజూ ఆదిత్యసింహుడిని కలుస్తూ ఆనందంగా ఉన్నది.
ఇక ఆదిత్యసింహుడు రెండు రోజుల్లో బయలుదేరతాడు అనగా ప్రభావతికి మనసు బాధగా అనిపించింది.
కాని ఆదిత్యసింహుడు సర్దిచెప్పడంతో ప్రభావతి కూడా భారమైన మనసుతో ఒప్పుకోకతప్పలేదు.
ఆరోజు రాత్రి ఆదిత్యసింహుడు నిద్రపట్టక బయటకు వచ్చి ఉద్యానవనంలో కూర్చుని ఉన్నాడు.
ప్రభావతి వస్తుందేమో అని కొద్దిసేపు ఎదురుచూసాడు.
కాని ఆమె ఎంత సేపటికీ రాకపోయే సరికి ఆదిత్యసింహుడు మెల్లగా ఆమె మందిరం దగ్గరకు వెళ్లాడు.
అక్కడ కాపలా బాగా ఎక్కువగా ఉండటంతో మళ్ళీ తను కూర్చున్న చోటుకు వచ్చ ఆమె మందిరం వైపు చూసాడు.
ఆమె మందిరం వెనక వైపు ఒక పెద్ద చెట్టు ప్రభావతి మందిరానికి దాదాపుగా ఆనుకున్నట్టు ఉండటంతో ఇక ఏమాత్రం ఆలోచించకుండా చెట్టు ఎక్కాడు.
ఆదిత్యసింహుడు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రభావతి మందిరం లోకి చూసాడు.
హంసతూలికా తల్పం మీద ప్రభావతి నిద్ర పట్టక అటూ ఇటూ పొర్లుతున్నది.

[Image: Jodhaa+Akbar+(2008)+(Hindi)+(All+Videos)...inks+3.png]

ఇద్దరు దాసీలు ఆమెకు గాలి రావడానికి వింజామరలు విసురుతున్నారు.
కాని ప్రభావతి మనసులో మాత్రం ఆదిత్యసింహుడు తన రాజ్యానికి వెళ్ళీ వీలైనంత త్వరగా పెళ్ళి ప్రస్తావన ఎప్పుడెప్పుడు పంపిస్తాడా అన్న ఆలోచనతో నిద్ర పట్టడం లేదు.
అలా ఆలోచిస్తున్న ప్రభావతికి చూపు చెట్టు మీద పడటంతో ఆమెకు కొమ్మల మధ్యలో ఏదో కదిలినట్టు గమనించింది.
దాంతో ప్రభావతి చెట్టులో కదులుతున్నది ఏంటా అని లేచి పరీక్షగా చూసింది.

[Image: 0cefbb18b339625e467577979eba27b6.jpg]
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CvDpU1sVofsIery1UzWeWD
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 30-10-2019, 01:48 PM



Users browsing this thread: 11 Guest(s)