Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అప్డేట్ ః 11
(ముందు అప్డేట్ 61వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=13338&page=61)


కళావతి : (సంతోషంగా ఆదిత్యసింహుడి వైపు చూసి నవ్వుతూ) నీతో కొద్దిసేపు మాట్లాడితే మనసులో ఉన్న భారం మొత్తం చేత్తో తుడిచేసినట్టు మాయమైపోయిద్ది ఆదిత్యా….ఇంత బాగా మాట్లాడటం నీకు వెన్నతో పెట్టిన విద్య…
ఆదిత్యసింహుడు : అమ్మా….మీతో ఒక్క విషయం మీద అనుమతి తీసుకుందామని వచ్చాను….


కళావతి : ఏం కుమారా….నీవు కూడా ఎవరైనా రాజకుమార్తెను మోహించావా….

[Image: images?q=tbn%3AANd9GcSE5lXT4RFbcC7q_JiNM...RBywLkoSsq]

ఆదిత్యసింహుడు : లేదమ్మా….ఇంకా అంత దూరం వెళ్లలేదు….
కళావతి : మరి….విషయం ఏంటి కుమారా…..
ఆదిత్యసింహుడు : నాకు దేశపర్యటన చేయాలని అనిపిస్తున్నది…అందుకని మీ అనుమతి తీసుకుని బయలుదేరుదామని వచ్చాను…..
అలా అనగానే కళావతి కలవర పడటం గమనించిన ఆదిత్యసింహుడు….
ఆదిత్యసింహుడు : ఏమైంయిందమ్మా….
కళావతి : ఏం లేదు కుమారా….ఇప్పుడే వీరసింహుడి వివాహం గురించి మాట్లాడుతున్నాం కదా….ఇప్పుడు నువ్వు దేశపర్యటన కోసం వెళ్తానంటున్నావు….ఎలా….
ఆదిత్యసింహుడు : ఇందులో విచారపడాల్సిన అవసరం ఏం లేదమ్మా….నేను ఎక్కడ ఉన్నది….ఎప్పటి కప్పుడు మన వేగుల ద్వారా మీకు సమాచారం అందిస్తూ ఉంటాను….అదీ కాక తూర్పు వైపున ఉన్న మన రాజ్యపు సరిహద్దుల్లో అక్కడక్కడ ఆక్రమణలకు గురైనట్టు సమాచారం అందింది….అందుకని ఒకసారి వివరాలు కనుక్కుని ఆ తిరుగుబాటుని అణిచివేసునట్టు ఉంటుంది….పైగా ప్రజల అవసరాలు కనుక్కున్నట్టు కూడా ఉంటుంది….
కళావతి : అవును కుమారా….ఈ విషయం మీ తండ్రిగారు కూడా ఒకసారి నాతో చర్చించారు….
ఆదిత్యసింహుడు : అయితే….నా ప్రయాణానికి మీరు అనుమతించినట్టేనా…..
కళావతి : వద్దన్నా…నువ్వు అనుకున్న తరువాత ఆగుతావా…నీకు కావలసిన సైనిక బలగాన్ని తీసుకుని బయలుదేరు….

[Image: maxresdefault.jpg]

ఆదిత్యసింహుడు : నాకు సైనిక బలగం ఏమీ వద్దమ్మా….నేను ఒంటరిగానే వెళ్దామనుకుంటున్నా…..
కళావతి : ఒంటరిగానా….ఇందుకు నేను అనుమతించను కుమారా…..
ఆదిత్యసింహుడు : సరె…అమ్మా….నాతో పాటు నాకు నమ్మినబంటు అయిన రమణయ్యను తీసుకువెళ్తాను….
కళావతి : కాని ఒంటరిగా వెళ్లడం చాలా ప్రమాదం కుమారా…..
ఆదిత్యసింహుడు : నేను ఎలా ఉంటానో మన అంతఃపురంలో తప్పితే ఎవరికీ తెలియదు….పైగా మేము సామాన్య పౌరుల దుస్తులలో వెళ్తే మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టరు….దానికి తోడు నాతో పాటు రమణయ్య వస్తున్నాడు…ఇక మీరు చింతించడానికి కారణం కనిపించడం లేదు….
కాని కళావతి మౌనంగా ఉండటం చూసి ఆదిత్యసింహుడు….
ఆదిత్యసింహుడు : అదీకాక తూర్పు వైపు మా చిన్నన్న వీరసింహుడు కూడా ఉన్నట్టు వర్తమానం అందింది మాతా…. మీరు ఆయనకు వివాహం చేద్దామనుకుంటున్న విషయం ఆయనకు వివరించి మీ దగ్గరకు పంపిస్తాను…..
ఆదిత్యసింహుడు అలా అనగానే కళావతి ఇక చేసేది లేక అలాగే అన్నట్టు తల ఆడించింది.
కళావతి ఒప్పుకోగానే ఆదిత్యసింహుడు అక్కడ నుండి వచ్చేసి రమణయ్యతొ కలిసి రాజ్య పర్యటనకు బయలుదేరాడు.
ఆదిత్యసింహుడు తన తల్లి అనుమతి తీసుకోగానే రమణయ్యతో పాటు దేశాటనకు బయలుదేరాడు.
అలా వాళ్ళిద్దరూ రాజ్యంలోని విశేషాలు, పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ కొద్దిరోజులు ప్రయాణం చేసి తమ రాజ్యసరిహద్దుల్లో ఉన్న కామపుర రాజ్యానికి చేరుకున్నారు.
కామపుర రాజ్యం అవంతీపుర సామ్రాజ్యానికి సామంత రాజ్యం కాకపోయిన ఇరు రాజ్యలకు మంచి మైత్రీ భావం ఉన్నది.
సైనిక పరంగా కూడా రెండు రాజ్యాలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటాయి.
అయితే వీళ్ళిద్దరూ ఆ రాజ్యంలో అడుగుపెట్టే సమయానికి అక్కడ జాతర జరుగుతుండటంతో చాలా కోలాహలంగా ఉన్నది.
ఆదిత్యసింహుడు, రమణయ్య ఆ జాతరని తిలకిస్తూ అక్కడ జరుగుతున్న ఆటలు, పాటలు చూస్తూ ముందుకు వెళ్తున్నారు.
అంతలో ఒక చోట బాగా కోలాహలంగా ఉండే సరికి వీళ్ళిద్దరూ ఏంటో చూద్దామని అక్కడకు వెళ్ళారు.
అక్కడ కత్తియుద్ద పోటీలు జరుగుతున్నాయి.

[Image: images?q=tbn%3AANd9GcQFS0RT-4EhQzllv7MQG...wf90E7U5mf]

దానికి తోడు ఆ రాజ్యపు రాజుగారు కూడా పాల్గొనడం….గెలిచిన వారికి మంచి బహుమతి ప్రకటించడంతో చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
కత్తి యుద్ధం బాగా హోరహోరీగా జరుగుతుండటంతో అందరూ చాలా ఉత్సాహంగా చూస్తున్నారు.
కొద్దిసేపటికి పోటీలో ఒకతను విజేతగా నిలిచాడు.
ఆదిత్యసింహుడు కూడా ఉత్సాహంగా ఆ పోటీలో పాల్గొనదలిచి ముందుకు అడుగువేసాడు.
కాని రమణయ్య వెంటనే ఆదిత్యసింహుడిని ఆపుతూ, “యువరాజా….మనకెందుకు ఈ పోటీలు…మన దారిన మనం వెళ్దాం పదండి,” అన్నాడు.
ఆదిత్య సింహుడు నవ్వుతూ, “రమణయ్యా….నాకు కత్తి యుధ్ధం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుకదా…” అన్నాడు.
“చిత్తం….నాకు ఎందుకు తెలియదు యువరాజా….ఇప్పుడు మనం దేశపర్యటనలో ఉన్నాము…ఇప్పుడు మీరు ఈ పోటీలో పాల్గొన్నారంటే మనం ఎవరమో తెలిసిపోతుంది…అందుకని ఈ ప్రయత్నాన్ని విరమిస్తే మంచిదని నా అభిప్రాయం,” అంటూ రమణయ్య చుట్టుపక్కల తమను ఎవరైనా గమనిస్తున్నారేమో అని పరిశీలిస్తున్నాడు.
“అదేం లేదు రమణయ్యా….నా నిజరూపాన్ని బయటపడనివ్వనులే…చింతించకు,” అంటూ ఆదిత్యసింహుడు బరిలోకి దిగి, “నేను కూడా పాల్గొనదలిచాను….ఒక్క అవకాశం ఇప్పించండి,” అన్నాడు.
దాంతో ఆ పోటిని నిర్వహించే అధికారి ఆదిత్యసింహుడిని చూసి, “ఎవరు నువ్వు….చూస్తుంటే ఈ దేశపౌరిడిలా లేవే…” అన్నాడు.
ఆదిత్యసింహుడు : మీరు చెప్పింది నిజమే….నేను దేశపర్యటన చేస్తూ ఇక్కడకు వచ్చాను….ఈ కత్తి యుద్ద పోటీలు చూసేసరికి నాకూ పాల్గొనాలనిపించింది….
నిర్వాహకుడు : కాని ఇది మా దేశానికి సంబంధించిన పోటీలు…ఇందులో పరాయి దేశం నుండి వచ్చిన వారిని అనుమతించం….
ఆదిత్యసింహుడు : అలాగే….మీ ఇష్టం……(అంటూ అక్కడ నుండి రావడానికి వెనక్కు తిరిగాడు.)

[Image: MohenjoDaro-new-poster.png]
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 30-10-2019, 01:10 PM



Users browsing this thread: 3 Guest(s)