Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
_*మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.*_
#1
N R:
_*మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.*_

_-{మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి }-_

_ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని,_
_నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను > అదుపులో ఉంచు కోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది._

_నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి._
 
_నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది._

_చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి._

_మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే._

_వాగ్భూషణం భూషణం_

_కేయూరాణి న భూషయంతి పురుషం_ _హారా న చన్ద్రోజ్జ్వలా_
_న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః_
_వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం._

_ఇది భర్తృహరి నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి. *వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం* అన్నాడు భర్తృహరి._

_సంభాషణం_ 
_మిత భాషణం,_ 
_హిత భాషణం,_ 
_స్మిత భాషణం,_ 
_ప్రియ భాషణం,_ 
_పూర్వ భాషణం,_ 
_సత్య భాషణం_ _అయినప్పుడు-_
_అంతకన్నా భూషణం మరొకటి లేదు._

_‘మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ._

_ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి. ఎదుటివారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం._
 
_శ్రీరాముడు స్మిత పూర్వ భాషి- మాట కన్నాముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది._

_సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి._

_ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి._

_‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. *తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’* అన్నారు స్వామి వివేకానంద._ 

_ఎవరైతే తమ మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు._

_ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి._

_మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి._

_మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది._

_నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు._

_అలాంటివారికి శత్రువులే ఉండరు. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు._

_మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో అతి మధురమైన పదాలు, మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి._

_ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి._

_*మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి.* ఏం చెప్పారనేదాని కన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది._

_భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది._

???

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)