Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నమస్కారం
(14-05-2019, 10:25 PM)kamal kishan Wrote: ఇందాక టైపు చేస్తూ ఉండగా ఎగిరిపోయింది. క్రమం వరకూ వచ్చింది.తరువాత వివరాలు మళ్ళీ యధాతధంగా రావు కదా....

thank you.

ఒక్కసారి వచ్చినవి మళ్ళా అలాగే రాకపోవచ్చు. కానీ, ప్రయత్నిస్తే... అంతకన్నా బాగా రావచ్చు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను.

మీరు వినురా 'కవీంద్రా' అని అనటంతోనే చెప్పాను మరి! Wink
(మీకు ఓ పిఎమ్ చేశాను)
Reply
(15-05-2019, 09:42 AM)Vikatakavi02 Wrote: ఒక్కసారి వచ్చినవి మళ్ళా అలాగే రాకపోవచ్చు. కానీ, ప్రయత్నిస్తే... అంతకన్నా బాగా రావచ్చు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను.

మీరు వినురా 'కవీంద్రా' అని అనటంతోనే చెప్పాను మరి! Wink
(మీకు ఓ పిఎమ్ చేశాను)

కవీంద్రా అని మీరు ఈ త్రెడ్ లో పోస్ట్ చెయ్యకపూర్వమే అన్నానండి. 
మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారో.............?!
Reply
తెలుసుకున్నదంతా వ్రాస్తే ఒక బ్రహ్మ ....
టైపు చేసింది ఎగిరిపోతే.........?! శ్రమ 
ఒక అయ్యో రామా......ఏమి ఈ కర్మ
విశ్వదాభిరామ వినురవేమ..
Reply
(15-05-2019, 06:36 PM)kamal kishan Wrote: కవీంద్రా అని మీరు ఈ త్రెడ్ లో పోస్ట్ చెయ్యకపూర్వమే అన్నానండి. 
మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారో.............?!

నేను కవీంద్ర అన్నది చూశాకనే రిప్లై ఇచ్చాను.
ముందు కాదు.

ఇట్లు మీ
వికట'కవి' ౦౨
Reply
జాతి రాయిని ధరించడం ద్వారా వేలి నరాల ద్వారా ఆ రత్న ప్రభావం శరీరం పొందుతుంది.
యెల్లో sapphire / కనకపుష్యరాగం 
కుడి చేతి చూపుడు వేలుకి ధరించవలసి ఉంటుంది. 
ఈ రత్నం ఊపిరితిత్తులు, కడుపుకి సంబంధించిన బాధలకు ప్రభావితం చేస్తుంది.
చూపుడు వేలుకి ముత్యము గానీ, కెంపు, పగడం, చంద్ర శీలా లేదా moonstone లు ధరించవచ్చుఁ.
Reply
middle finger / నడిమి వేలు కి ధరించే రత్నాలు 

శని ఈ నడిమి వేలుని కంట్రోల్ చేస్తుంది.
ఈ వేలుకి నీలం, గోమేధము పిల్లి కన్ను రాయి కూడా ధరించవచ్చుఁ.

మధ్య వేలు  బ్రెయిన్, మెదడు, ప్రేగులు లివర్ లేదా కాలేయం represent చేస్తుంది 
Reply
Ring Finger / ఉంగరం వేలు 

ఈ వేలుని సూర్యుడు కంట్రోల్ చేస్తాడు. సాముద్రికంలో ఈ వేలు Apollo 

ఈ వేలు కి కెంపు, ముత్యం, మూన్ స్టోన్, పగడం, కనకపుష్యరాగం ధరించవచ్చుఁ. ఈ వేలు కడుపు, రక్త సరఫరా., ఊపిరితిత్తులు, కిడ్నీలు-మూత్రపిండాలకు సంబంధించినది.

చంద్రుడు, కుజుడు సూర్యునికి మిత్రులు కాబట్టి వారికి చెందిన రాళ్లు కూడా ఈ వేలుకి ధరించవచ్చుఁ. 
i .e ., ముత్యం, పగడం.

Little Finger / చిటికెన వేలు 


ఈ వేలుని బుధుడు కంట్రోల్ చేస్తాడు. ఈ వేలు కాళ్ళు, వేళ్ళు, జననేంద్రియాలు represent చేస్తుంది.
ఎమెరాల్డ్ లేక పచ్చ రాయి, వజ్రాన్ని ధరించవచ్చుఁ 

పైన ఉదహరించిన అవయవాల అనారోగ్యానికి సంబంధించి ఈ వేళ్ళకి సంబంధించిన రత్నాన్ని ధరించవచ్చుఁ 
Reply
మంచి సమాచారం...
కొనసాగించండి కిషన్ గారూ...
Reply
(18-05-2019, 09:34 AM)Vikatakavi02 Wrote: మంచి సమాచారం...
కొనసాగించండి కిషన్ గారూ...

thanks andi
Reply
Yellow sapphire

గురువు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడూ., పాప స్థానంలో ఉన్నప్పుడూ., పాప గ్రహమైనప్పుడు ఈ రత్నాన్ని ధరించవచ్చు.

ఈ రత్నాన్ని ధృంచడంవల్ల సంపద, సక్సెస్, గౌరవం మరియు అదృష్టం వెలుగులోకి వస్తుంది. అంతే కాక అధికారం కూడా లభిస్తుంది. ఈ రత్నం సిద్దింపచేసే విశేషాలు ధనంతో పాటుగా పిల్లలూ, మత, న్యాయ సంబంధ, బ్యాంక్, కంపనీస్ సంబంధంగా ప్రాధాన్యతని పొంది ఉంటుంది. ఈ రత్నం వల్ల దూర ప్రయాణాలు, విదేశీ, తీర్ధయాత్రలు వంటివి అందిస్తుంది.
కావున, పై విశేషాలలో జాతకం రీత్యా గురువు పాప స్తానాధిపతి అయిననూ పాప స్తనంలో ఉన్నచో, పాప ప్రభావితుడైనచో.... కుమారుడిని ఆశించినవార్కి, విలాసవంతమైన జీవితాన్ని ఆశిస్తే.....ధరించండి.

ఈ రత్నం పడనిచో కొట్లాటలూ, లాస్, షేర్ మార్కెట్ లో అనూహ్యమైన డౌన్ ఫాల్ ఉంటుంది. క్యాన్సర్ కారకంగా కూడా జుపిటర్ ని చెప్పవచ్చు.

మూత్రపిండాలు, తొడలు, కండరాలు, రక్తము, పాదాలు, క్రొవ్వు, ముఖ్యంగా కాలేయం, కుడి చెవి....కామెర్లు, లివర్ complaints, హెర్నియా, శరీరంలో కొవ్వు, ఒబేసిటీ, నిద్రలేమీ, piles వ్యాధులు కలుగుతాయి.

జాతకంలో శుభ గ్రహాలు కూడా పాప ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా చంద్రుడు, గురువు, కేతువు ఇచ్చే పాప ఫలితాలు అనూహ్యం.

ఈ విషయాన్ని గురించి అనేకులు పరిశోధనలు చేశారు. ఎంతో లోతైన విశ్లేషణ ఉన్న astrologer మాత్రమే దీనిని చెప్పగలరు. నాకు అంత సీన్ లేదు. కానీ సర్ BV. Raman వంటి వారు ఇంకా అనేకులు ఉన్నారు. దానికి దైవానుగ్రహం ఉండాలి. 

మంచి గ్రహం చేసే శుభం ఎంత గొప్పదంటే.............20-25 ఏళ్లవరకూ అప్పటివరకూ పడిన కష్టాలూ; అగౌరవం అన్నీ పాజిటివ్ గా అయిపోతాయి. 

రత్నం, జీవ రత్నం నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.


రత్నాలు వ్యాధి తీవ్రతని తగ్గించుకోవడానికి ఉద్దేశించబడినవి. ఇవే సంపదకూ, జీవితానికీ, వ్యాధిని ఎదుర్కొనే ధైర్యానికీ, శక్తికీ కూడా ఉపయోగపడతాయి. ఈ రత్నాలు ఎంత గొప్పవైనా అవి ఉండే ప్రదేశాన్ని తేజోవంతమూ ప్రకాశవంతమూ చేయగలవు. అందుకే రత్నాన్ని శరీరానికి కాంటాక్ట్ లో ఉండేవిధంగా ధరించాలి అని చెబుతారు. మంచి చెడులకు వాడదాం.


Yellow sapphireని వేరే రత్నంతో కలిపి కాంబినేషన్ గా వాడుతూ., నపుంసకత్వాన్ని, గ్యాస్ ప్రాబ్లమ్స్(కుకింగ్ గ్యాస్ LPG కాదు) కడుపులో పుల్లూ, గుండె, ఆమవాతం, గౌట్, అర్తెరైటీస్ కి వాడి చూడవచ్చు.


ఆడవారికి యెల్లో సప్ఫిర్ మరియు పగడం ధరించి పెళ్లి కానీ స్త్రీలు ధరించి వివాహాన్ని పొందవచ్చు.

శుక్రుడు పూర్తిగా వ్యతిరేక గ్రహం అందువల్ల శుక్రుడు అనుకూలంగా లేని వారికి యెల్లో సప్ఫైర్ ధరించి శ్రీ శుక్రుని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల నుండి మంచిగా చేసుకోవచ్చు.
Reply
Users browsing this thread: 1 Guest(s)