Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు సాహిత్యం
#6
[Image: Fire-Shot-Capture-125.png]

ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ, సాహిత్యరంగపు చర్చలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా ఈమెను గుర్తిస్తారు. స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, తనను తాను తెలుగులో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కంతో ప్రారంభమైన అభ్యుదయ రచనా పరంపరలో భాగంగా కూడా భావించింది.

నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామములో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసిన తర్వాత తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఓల్గా కథలు, నవలలు, పద్యాలు మహిళా సాహిత్యములో ఎన్నదగినవి. చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనల వల్ల ప్రభావితమై స్త్రీ చైతన్యము అంశముగా రచనలు చేసి తనకై ఒక ప్రత్యేక స్థానము సంపాదించింది. పత్రికలలో, సాహిత్యములో, అనువాదములలో మహిళా హక్కులపై వివాదాస్పద చర్చలు గావించింది. చలన చిత్ర రంగములో 'ఉషా కిరణ్' సంస్థకు కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందింది. ఈమె రాసిన స్వేచ్ఛ నవలని వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి నేషనల్ బుక్ ట్రస్టు స్వీకరించింది.1986 నుండి 1995 వరకు ఆమె ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసారు. 1991 నుండి 1997 వరకు అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు అధ్యక్షురాలిగా పనిచేసారు. ఆమె ప్రస్తుతం అస్మితలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు ఓల్గా వ్రాసిన 12 రచనలను, ఆమె కథల ఆంగ్లానువాదములను తమ సంగ్రహములో చేర్చారు.
>>> DOWNLOAD <<<

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: తెలుగు సాహిత్యం - by Vikatakavi02 - 19-05-2019, 03:09 AM



Users browsing this thread: 1 Guest(s)